అక్టోబర్ 1 మాధవానంద సరస్వతీ స్వామివారు విచ్చేయనున్నారు

*తోగుట స్వామివారి ఆగమనం*

అక్టోబర్ 1వ తేదీన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు సాయంత్రం 7 గంటలకు శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దేవాలయ దివ్యక్షేత్రమునకు విచ్చేయనున్నారు…

రంగంపేట లోని ఆశ్రమంలో 14 మాసాలుగా అకుంఠిత దీక్షను వహించి ( చాతుర్మాస్య దీక్షను ) పూర్తి చేసుకొన్న అనంతరం మొట్టమొదటి సారిగా కాజిపేట శ్రీ శ్వేతార్కగణపతి క్షేత్రమునకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేయబడుచున్నవి.

అక్టోబర్ 1వ తేదీన
సాయంత్రం 6.00 గంటలకు శ్రీ స్వామీజీ వారు కాజీపేట చేరుకుంటారు
బాపూజీ నగర్ నుంచి వారికి ఘన స్వాగత యాత్ర ప్రారంభమవుతుంది.

సాయంత్రం 7 .30 నిముషాలకు దేవాలయంలో శ్రీ స్వామీజీ వారికి పాద పూజ జరుపబడుతుంది. కావున
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు.

స్వాగత యాత్రలో భక్తులు హారతులతో, ర్యాలీగా(వాహనాలతో) స్వామీజీ వారిని ఆహ్వానించుటకు పాల్గొనగలరు..

వివరాలకు 9347080055 నందు సంప్రదించగలరు

#మాధవానంద #madhavananda #సరస్వతీ #saraswathi #రంగంపేట #తోగ్గుట

రేపటి నుండి సా.6.30 నుండి బతుకమ్మ ఆటపాటలు

కార్యకర్తలకు భక్తులకు మనవిరేపటినుండి సద్దుల బతుకమ్మ పండుగ వరకు ప్రతి రోజు శ్వేతార్కమూల గణపతి దేవాలయ ప్రాంగణం లో బతుకమ్మ పండుగ జరుపబడుతుంది. ఇందులో మహిళలు ఆటపాటలతో బతుకమ్మ ని పూజిస్తారు. కావున బతుకమ్మ పండుగ లో పాల్గొనే వారంతా సాయంత్రం 6 గంటల వరకు దేవాలయానికి రాగలరుఇట్లు
మేనేజ్మెంట్
శ్వేతార్క ఆలయం

మట్టితోనే ప్రారంభమయ్యే ఈ జీవితం మట్టిలోనే కలిసిపోతుంది

్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో 16 రోజులపాటు జరుపబడే గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజున రెండోవ రోజు పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి భక్తులచే సేకరించిన 108 లీటర్ల పాల తో మహా క్షీరాభిషేకం జరుపబడింది. ఈ క్షీరాభిషేకాన్ని ఆలయ అర్చకులు నమో నారాయణ ,అరుణ్ త్రిపాటిలు పాల్గొన్నారు. వేద పండితులు కులకర్ణి మహేశ్వర శర్మ ,అక్షయశర్మ జోషిమల్లికార్జునశర్మ లు సువర్ణ ఘర్మ అనువాకంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్యకర్తలు శీనమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేసి భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 11:00 గంటలకు మహాలింగార్చన జరుపబడింది. ప్రత్యేకంగా పుట్టమన్నుతో తయారు చేయబడిన 1001 లింగాలకు అభిషేకం జరుపబడింది. నమక చమకం తో జరిగిన ఈ రుద్రాభిషేకం లో కార్యకర్తలు సులోచన, సుజాత ,అనురాధ, విజయలక్ష్మి, సాయికుమారి, రమాదేవి, అయితఉమాదేవి, శకుంతల, తారాబాయి, జయమ్మ తదితరులు పాల్గొని శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపించిన భక్తిగీతాలు భక్తులను అలరించాయి అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామి వారికి పెసరు లడ్డు లతో ప్రత్యేక అలంకారం చేసి అర్చన చేయడం జరిగింది. ఈ రోజున ఆదిగణపతిని కుంకుమతో అలంకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయినవోలు రాధాకృష్ణ శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ… మట్టి తో మొదలయ్యే ఈ మానవజన్మ చివరికి మట్టిలోనే కలిసిపోతుందని మానవుని శరీరం మీద కూడా మృత్తిక నే ఉంటుందని మృత్తిక శివలింగానికి ఆరాధన చేయడం వల్ల ముక్తి కలుగుతుందని తెలియజేశారు. మనిషిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించుకునే అవసరం ప్రతి ఒక్కరిలో ఉంటుందని దేనిని మూఢ నమ్మకంగా భావించరాదని కొన్ని విషయాలు మన పూర్వీకులు మనం ఆచరించే సంప్రదాయాల వెనుక అర్థము ఉంటుందని దాని ద్వారా మనిషి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలరని తెలియజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్నపూర్ణ భవన్లో అన్నదానమునిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు గణపతి మూల మంత్ర సహితంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భూమియందు సకాలంలో వర్షాలు కురిసి సస్య వృద్ధి కలిగి రైతు క్షేమంగా ఉండాలని రైతు కు ఉఅభివృద్ధి కలగాలని కోరుతూ ఈరోజు ఋత్విక్కులు,వేద పండితులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయినవోలు రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మ పాల్గొన్నారు అనంతరం రాత్రి 7 గంటలకు జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీమతి తాడూరిరేణుకా శిష్య బృందం వారిచే నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శనలో చిన్నారులు చక్కటి నాట్యాన్ని ఆవిష్కృతం చేశారు. అనంతరం దర్బార్ సేవ నిర్వహించడం జరిగింది. వైవిధ్యభరితంగా కొనసాగిన ఈ సేవలో అనేకమంది కళాకారులు పాల్గొన్నారు స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు దర్బారు సేవ నిర్వహించడం జరుగుతుందని, ఈ సేవ లో పాల్గొనే వారు రాత్రి 7 గంటల 30 నిమిషాల లోపు దేవాలయానికి వచ్చి ఉండాలని ముందుగానే ఒక గంట ముందుగా తమ పేర్లను ఇవ్వాల్సిందిగా దర్బార్ సేవ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం మేనేజర్ ఎల్ రవి, శనిగరపు రాజమోహన్,అసిస్టెంట్ మేనేజర్ దుర్గమ్ సుదీర్, ఎలక్ట్రికల్ మేనేజర్ వలపు దాసు శ్రీనివాస్ ,పి ఆర్ ఓ మణిదీప్, ప్రదీప్, దినేష్, శ్రావణి ,గుణవతి తదితరులు పాల్గొన్నారు ఈనాటి పూజా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్రికేయులు కొంతమంది పాల్గొన్నారు

ఇట్లు

అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి కాజీపేట దేవాలయ వ్యవస్థాపకులు

బోనమెత్తిన శ్వేతార్క గణపతి కార్యకర్తలు

స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో జరుపబడుతున్నటువంటి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా మూడోరోజయిన ఈరోజున శ్రీ స్వామి వారికి ఉదయం 6 గంటలకు గంధంతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యదా శక్తిగా గంధమును అందించారు. శరీరంలో ఉష్ణతాపంతగ్గాలని చర్మ సంబంధమైన ఎటువంటి బాధలు రాకుండా ఉండాలని తత్సంబంధమైన మంత్రములతో బ్రహ్మశ్రీ కులకర్ణి మహేశ్వర శర్మ జోషి మల్లికార్జునశర్మ జోషి అక్షయ శర్మ లు పాల్గొని అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తలు కవిత, విజయలక్ష్మి, సవిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 9 గంటలకు మంటపస్థిత ఆవాహిత దేవతా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజలో కార్యకర్త బిట్ల సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం జరిగిన పూజలలో కార్యకర్తలు పాల్గొని బోనాల పండుగను నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరించి జరుపబడిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేకంగా బోనాలను తయారుచేసుకొని, బోనాలు ఎత్తుకుని దేవాలయ ప్రదక్షిణ గావించి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవి సాయికుమారి సుజాత సులోచన బేబీ శకుంతల విజయలక్ష్మి శ్రీలత రమ్య సీనమ్మ జయమ్మ తారాబాయి అయితఉమ, లతాశ్రీ సంధ్య,ఉమాదేవి కల్పన ప్రదీప్ రాజారోహితరెడ్డి దినేష్ అమర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టత గురించి తెలంగాణ సంప్రదాయంలో బోనాల పండుగ ను ఆచరించే విధానం గురించి మరియు ఆంధ్రప్రాంతంలో జరుపబడే తిరునాళ్ల గురించి అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి భక్తులను ఉద్దేశించి తెలియజేశారు. హిందూ పద్ధతిలో వృక్ష ఆరాధన గురించి విశేషంగా చెప్పబడిందని చెప్పారు. ఆషాడమాసంలో బోనాల పండుగ పేరుతో చెట్లకు పూజ చేయడం మన సంప్రదాయంలో ఉందని ఆషాడమాసంలో వేప చెట్టుకు, అదేవిధంగా శ్రావణమాసంలో ఉత్తరేణి ఆకులకు పూజ చేసే సంప్రదాయం స్త్రీలలో ఉందని. భాద్రపద మాసంలో ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేసే ఆచారం వృక్ష పూజను సూచిస్తున్నాయని తెలియజేశారు. ఈనాటి పూజా కార్యక్రమంలో రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మ దేవాలయ అర్చకులు ఆనంద్ శర్మ నమో నారాయణ, మిశ్రాశర్మ అరుణ్ శర్మ హరిస్వామి పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఆది గణపతిస్వామివారిని గంధంతో అలంకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టం టం దయాకర స్వామి పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నపూర్ణ భవన్లో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాల్వంచ వాస్తవ్యులు శాంతి మోహన్ శిష్య బృందంచే సంగీత నృత్య ములను ప్రదర్శించడం జరిగింది. చిన్నారి భవిత శ్రీ అభినయించిన నృత్యము భక్తులను అలరించింది.
ఈ కార్యక్రమంలో దేవాలయ అసిస్టెంట్ మేనేజర్ దుర్గం సుధీర్ ఎలక్ట్రికల్ మేనేజర్ వి శ్రీనివాస్ పిఆర్ఓ మణిదీప్ పాల్గొన్నారు,

రేపటి అభిషేక కార్యక్రమంలో శ్రీ స్వామివారికి నెయ్యితో అభిషేకం చేయడం జరుగుతుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల కుటుంబము నందు సంతోషము ఆనందము కలుగుతుందని కుటుంబ సభ్యులు అన్యోన్యతను కలిగి ఉండాలని కోరుతూ ఈ అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది . రేపు ఆది గణపతిని విష్ణుమూర్తి వలె అలంకరించడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకు మరుమాముల శశిధర్ శర్మ బృందం వారిచే ఆధ్యాత్మిక సంగీతవిభావరి నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం
ఇట్లు
ఎల్ రవి
దేవాలయ మేనేజర్

గణపతి దీక్ష సామగ్రి

దీక్ష తీసుకొనే భక్తులు తెచ్చుకోవలసిన సామగ్రి.
(1)పసుపు,కుంకుమ
(2)2.1/4 కేజీ ల బియ్యం
(3)తమలపాకులు(21)
(4)పోకలు,కార్జురాలు(5,5)
(5)దీపారాధన సామగ్రి
(6)అగర్ బత్తిలు,పూలు,కర్పూరం,గరిక
(7)తెల్లని వస్త్రములు(లుంగీ లేదా తెల్ల ప్యాంటు కొత్తవి లేదా పాతవి)
(8)అరుద్రా రంగు ఉత్తరీయం
(9)1.1/4 మంచి నూనె
(10)1.1/4.పప్పు
(11)1.1/4.కాయగూరలు
(12)1.1/4.ఆకుకూరలు
(13)రుద్రాక్ష లేదా స్పటిక మాలలు.(108 గలది.ఒకటి.54 గలది.ఒకటి)
(14)100 గ్రాముల కొబ్బరి నూనె
(15)కొబ్బరికాయలు 2
(16)పంచామృతాలు
(17)మట్టి చిప్ప పెద్దది

(18) ఎండు కొబ్బరి 1

(19) విస్తారు/ప్లేట్మా మరియు గ్లాస్/పంచపాత్ర 1set

ఇట్లు.
శ్వేతార్కా దేవాలయ మేనేజ్మెంట్
కాజిపేట్.

వివరాలకు 9347080055,9394810881 లో సంప్రదించగలరు

నవరాత్రుల సందర్బంగా కార్యకర్తల ద్వితీయ సమావేశ తేదీ22-08-2019.గురువారం

*కార్యకర్తలకు, భక్తులకు సమావేశ ఆహ్వానము*

*22.8.2019 గురువారం*
రోజున ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణములో *కార్యకర్తల ద్వితీయ సమావేశమును*
ఏర్పాటు చేయబడింది.
_*~*సమావేశం10గంటలకు ప్రారంభమై 11గంటల వరకు పూర్తి అగును…….. గమనించగలరు**~_
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉదయం 9.30 ని.ల లోపున దేవాలయ ప్రాంగణంలో కి వచ్చి ఉండా లి.

👉 మొన్న జరిగిన సమావేశమునకు రాని వారంతా తప్పక ఈ సమావేశమునకు హాజరు కావాలి. మరియు
*కార్యకర్తలందరూ కూడా తప్పక పాల్గొనాలి.*

👉ఈనాటి సమావేశమునకు
శ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో సేవ చేసే దాదాపు 30మంది మహిళాసేవకులు కూడా పాల్గొంటున్నారు
👉కాజీపేటకు దూరంలో ఉన్నవారు అనగా హైదరాబాద్,నల్గొండ,
ఖమ్మం,మంచిర్యాల,కరీంనగర్ లాంటి దూరం లో ఉన్నవారు కూడా వీలు కలిపించుకొని తప్పక ఈ సమావేశమునకు రావాలి.

👉 ఈ రోజున వచ్చే వారికి
*బ్యాడ్జ్ కొరకు ఫోటో తీసుకోవడం జరుగుతుంది.*
ఈ రోజు మాత్రమే ఫోటో తీయబడును. తదుపరి అవకాశం ఉండదు.

👉ఈ సమావేశములో కార్యకర్తలకు సేవలు కేటాయించబడుతాయి

🌴కార్యకర్తలకు పగలు భోజన ప్రసాదం ఏర్పాటు చేయబడుతుంది.

ఇట్లు
మేనేజ్మెంట్
శ్వేతార్కదేవాలయం
కాజీపేట

శ్వేతార్కాలో నవరాత్రులకు సేవ చేయుటకు కావలసినటువంటి సేవకులు

*స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవ పూజలలో సేవకు 20 రోజులకు కావలసినటువంటి కార్యకర్తలు*

అభిషేకమునకు ఎనిమిది మంది కార్యకర్తలు

మంటపపూజకు ఇద్దరు కార్యకర్తలు

హోమమునకు ఇద్దరు కార్యకర్తలు

సాయంత్రం పూజకు నలుగురు కార్యకర్తలు

సహస్రదీపాలంకరణ సేవకు నలుగురు కార్యకర్తలు

ఊరేగింపు సేవకు నలుగురు కార్యకర్తలు

ఊరేగింపు రథమును నడుపుటకు ఒక డ్రైవర్ అవసరము

విఐపి రిసీవింగ్ కొరకు నలుగురు కార్యకర్తలు

వంట ఏర్పాట్లకు ఇద్దరు కార్యకర్తలు

అన్నదానమునకు ఎనిమిది మంది కార్యకర్తలు

అయ్యా గారి వద్ద పర్సనల్ గా ఉండుటకు ఇద్దరు కార్యకర్తలు

ఫోటో మేకింగ్ ముగ్గురు కార్యకర్తలు

స్టోర్ ఇంచార్జి ఒక కార్యకర్త

ప్రోగ్రామర్ గా ఇద్దరు కార్యకర్తలు

లైవ్ ప్రోగ్రాం కార్యకర్తలుగా ఇద్దరు కార్యకర్తలు

దేవాలయ అలంకారము నకు నలుగురు కార్యకర్తలు

స్టార్స్ నిర్వహణకు ఇద్దరు కార్యకర్తలు

బుక్ స్టాల్ నిర్వహణకు ఇద్దరు కార్యకర్తలు

కౌంటర్లో సహాయము అందించుటకు ఇద్దరు కార్యకర్తలు

ఎలక్ట్రికల్ కి సహకరించు టకు ఇద్దరు కార్యకర్తలు

అవసరంగా ఉన్నది

ఉత్సాహం కలిగినవారు 9347080055 నకు వాట్సప్ ద్వారా మీ అడ్రస్ మీ ఫోటో మరియు వివరాలు పోస్ట్ చేయగలరు.

భగవంతుని సన్నిధిలో కార్యకర్తగా సేవ చేయుటకు ఆహ్వానం

ఈనెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 12 వ తేదీ వరకు జరుపబడు *శ్రీశ్వేతార్క గణపతి స్వామి వారి* నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ పూజల రోజులలో… మీరు కార్యకర్తగా సేవను అందించా దలిచారా..
అయితే…
మీరు మీ సేవలను అందించు వివరములను సమాచార కేంద్రం లో తెలుప కోరుచున్నాము.

అనగా ఈ 16 రోజులు మీరు ఏ సమయం నుండి ఏ సమయం వరకు సేవకు రాగలరో తెలపాలి.

మీ పేరు
మీ వాట్సాప్ నెంబర్
మీ ఇంటి అడ్రస్
మీరు గుడికి వచ్చే సమయం

ఇత్యాదివి
రిజిస్టర్లో రాయగలరు.

ఇట్లు
అయ్యగారు శ్వేతార్కగణపతి దేవాలయం
కాజీపేట
506003
5.8.19