18 11 అనంతవచనం

ఏ పని చెప్పినా… రాదనకు,కాదనకు.

ఆలోచించు, ప్రయత్నించు, ఆచరించు.

 అప్పుడు నీకన్ని పనులు వచ్చి తీరుతాయి.

*అనంతవచనం*

11.11 అనంతవచనం

ఒక మాట అనేప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అన్న మాట అబద్ధమని తెలిస్తే మనమే సిగ్గు పడాల్సి వస్తుంది.

*అనంతవచనం*

11.11.2018

15 11 అనంతవచనం

చెల్లిపోయిన కాలం గురించి ఆలోచించకు. వచ్చే వర్ధమాన కాలం గురించి జాగ్రతపడు. రేపటి పని గురించి ఈ రోజే ఆలోచించేవారు చాలా కాలాన్నిసంపాదించుకోగలరు

*అనంతవచనం*

15.11.2018

11.11 అనంతవచనం

ఒక మాట అనేప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అన్న మాట అబద్ధమని తెలిస్తే మనమే సిగ్గు పడాల్సి వస్తుంది.

*అనంతవచనం*

11.11.2018

14 11 అనంతవచనం

మన విజయాలను మనం చెప్పుకోవడం కాకుండా..

మన విజయాలను ఎదుటి వారు చెబుతుంటే… మనకు మరింత బాధ్యతతెలుస్తుంది. 

*అనంతవచనం*

14.11.2018

12.11 అనంతవచనం

గతమెప్పుడు గుణపాఠం గాను,వర్తమానమెప్పుడు కర్తవ్య ప్రభోదనంగాను, భవిష్యత్తు ఎప్పుడూ ఉపకారం కొరకు గాను ఆలోచించి పయనించడమే 

ప్పుట్టిన రోజు పండుగ గా కావాలి.

*అనంతవచనం*

12.11.2018

13.11 అనంత వచనము

రోగిని రోగిలానే చూడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయడం వలన రోగి తొందరగా కోలుకోవడానికి తేలికవుతుంది. అలాగే ప్రయత్నం లో విఫలమైన వారిని మరింత ప్రేమతో ప్రోత్సహిస్తే వారికి ధైర్యం కలిగి విజయవంతులవుతారు.

*అనంతవచనం*

13.11.2018

దేవునికి సమీపమున

దేవునికి సమీపమున నివసించే విధానమే ఉపవాసం. అంతేగాని

అచేతనంగా ఉన్న శరీరాన్ని మరింత బలహీన పర్చుకోవడానికి కాదు

*అనంతవచనం*

చెప్పే వారి విషయంలోనే కాదు

చెప్పే వారి విషయం లొనే కాదు. వినే వారి విషయంలో కూడా ఎదుటి వారు  సరైన భావనను కలిగి ఉండాలి. లేకపోతే..అపార్థాలు,అనుమానాలు కలిగి సమానాతలు తొలగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

*అనంతవచనం*

దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే

ప్రమిదలో చమురైపోతుంది. ఒత్తికూడా కాలిపోతుంది. ఉన్నన్నాళ్లు తాము  ఆవిరైపోతు. దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే. మనం కూడా కొంతలో కొంతైనా పదిమందికి సహాయ పడేలా మన జీవిత గమనం సాగేలా చూసుకోవాలి. అదే దీపం పరమార్థం.

*అనంతవచనం*