శ్వేతార్కాలో రేపు గీతజయంతి వేడుకలు

శ్రీ వికారి నామ సంవత్సరే,మార్గశిరమాసే,
హేమంతఋతువు,దక్షిణాయనే,శుక్లపక్షే
ఏకాదశినాడు కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి దివ్య క్షేత్రంలో కొలువైవున్న భామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం మరియు భాగవత్గీత పారాయణము తులసీ అర్చన జరుగును… లోకహితమై పరమాత్మ అర్జునిడికి దుష్టశిక్షణ శిష్టరక్షణాకై భాగవత్గీత ను ఉపదేశించారు. అలాంటి భాగవత్గీత లోని కొన్ని ముఖ్య అంశాలు జీవితంలో భాగవత్గీత యొక్క ఆవశ్యకత ఎంతవరకు అనే అంశాలపై కాజిపేట పట్టణ పురోహితులు ఐనవోలు వెంకటేశ్వర్లు శర్మ భక్తులను ఉదేశించి మాట్లాడతారు.. తదుపరి హారతి,తీర్థప్రసాదా వితరణ జరుగును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సామూహిక భాగవత్గీత పారాయణము లో పాల్గొని శ్రీస్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు …

ఇట్లు

ఎల్.రవి

దేవాలయ మేనేజర్

గీతా జయంతి విశిష్టత……

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.

ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.
గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది .
కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ప్రతి ఇంట్లో తప్పకుండా భాగవత్గీత పుస్తకం ఉంచుకొని, వారి పిల్లలకు అట్టి పవిత్ర గ్రంథ విశిష్టతను శ్లోకాలను నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము.

జ్యోతిర్లింగ శక్తిపీఠ అష్టవినాయక యాత్ర

జనవరి నెలలో జ్యోతిర్లింగ – శక్తిపీఠ – అష్ట వినాయక యాత్ర

ఈ యాత్రలో

తుల్జా భవాని – తుల్జాపూర్
పాండురంగ క్షేత్రం – పండలాపూర్,
8 వినాయకులు – అష్టవినాయక
ప్రముఖ జ్యోతిర్లింగాలలో కొన్ని – 5 జ్యోతిర్లింగాలు

ఇంకా
శిరిడి,శనిసింగనాపూర్, బాసర, ఇత్యాదియాత్రలు చేయబడుతున్నవి.

7 లేదా 8 రోజులు ప్రయాణం

ఏసీ బస్సులో ప్రయాణం

సీటు ఒక్కంటికి 10.200₹

ఒకపూట భోజనము – ఒక పూట టిఫిన్

ముందుగా పూర్తి డబ్బులు చెల్లించిన వారికి ముందు వరుసలో నుంచి సీట్లు కేటాయించడం జరుగుతుంది.

గమనిక

డిసెంబర్ 15వ తేదీ లోపున పూర్తి రుసుమును చెల్లించి సీటు రిజర్వు చేసుకోగలరు.

పూర్తి వివరాలకై
8686398004, 9542227807 లో సంప్రదించగలరు.

ఇట్లు
M K ట్రావెల్స్

15-12-2019 సంకష్టహర చవితి శ్వేతార్కాగణపతికి ఉండ్రాళ్ళు అభిషేకం

వెన్నె మరియు పంచామృతాలతో వల్లీదేవసేన సుబ్రమణ్యస్వామికి అభిషేకం

This slideshow requires JavaScript.

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఈరోజు స్వయంభు శ్రీ శ్వేతార్కగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూర్తులకు పంచామృత పంచవర్ణ మరియు వెన్నతో స్వామివారికి విశేష అభిషేకం చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాగ దోషాలు కాలసర్ప దోషాలు సంతానం లేని వారికి ప్రత్యేక సంతాన పూజలు ఉదయం 11 గంటలకు కాలసర్ప హోమము సర్ప సూక్తం తో సుబ్రమణ్యేశ్వర మూల మంత్రములు విశేషంగా జరిగాయి. తదుపరి అన్నపూర్ణ భవనంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

02.డిసెంబర్.2019 సోమవారం రోజున సుబ్రమణ్య షష్టి పూజలు

ఈ సందర్భంగా కాజీపేట శ్వేతార్క మహా గణపతి క్షేత్రంలో కొలువైవున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7గం.లకు పంచామృత మరియు వెన్నేతో అభిషేకం చేయబడును.10.30 ని. లకు ప్రత్యేక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూలమంత్ర హోమం…హోమంలో పాల్గొనడం వలన కాలసర్పదోషం, కుజదోషము, శ్రీఘ్రకళ్యాణం, సంతానప్రాప్తి, సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. త్రిశతి పారాయణము మరియు దత్తయా నమః నామసంకిర్తన జరుగును…వివరాలకు 9394810881 నకు ఫోన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకొనవచ్చును.

*శ్రీసుబ్రహ్మణ్యస్వామి షష్టి విశేషం*
*
పంచమినాడు ఉపవాసం ఉండి, షష్టి నాడు కుమారస్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగదోషాలకు, సంతానలేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. స్కంద పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది.

మహశివుని అనుగ్రహంతో లోక కళ్యాణం కోసం కుమారస్వామి ఉద్భవించాడు. ఈయన మహ శక్తివంతుడు. సాక్షాత్ పరమశివునిచే శక్తి అనే ఆయుధాన్ని పొందిన వాడు. కుమారస్వామి, కార్తికేయ, స్కంద,మురుగ,షణ్ముఖ,బాల, మహసేన,గుహ,వల్లినాయక, సుబ్రమణ్యస్వామి పేర్లతో పిలువబడుచున్నాడు. శూరపద్మ అనే రాక్షసుడిని సంహరించి లోక కళ్యాణం చేసినందులకు సుబ్రమణ్య షష్టిని జరుపుకొంటారు. మహమహిమోన్నతుడైన శ్రీ సుబ్రమణ్య స్వామిని భక్తితో పూజించినా స్మరించినా శక్తి యుక్తుల్ని, ఆరోగ్య ఐశ్వర్యాలను, సత్ సంతానాన్ని ప్రసాదిస్తాడ ని
తెలియుచున్నది.
ఇట్లు
అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి కాజీపేట.

పరి _పూర్ణం_ గా జరిగిన కల్యాణోత్సవం …. పుష్కలం_ గా పాల్గొన్న అయ్యప్ప భక్తులు

This slideshow requires JavaScript.

స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజున అంగరంగ వైభవంగా పూర్ణ పుష్కలంబా సమేత శ్రీఅయ్యప్పస్వామి వారికి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఉదయం ఏడు గంటలకు రమేష్ గురుస్వామి, పిల్లల కుమారస్వామి, సాయి కృష్ణ శర్మ టం టం హరి స్వామి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో 108 లీటర్ల పాలు, పంచామృతములు మరియు నవవిధా ఫల రసములు ఉపయోగించి అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం వేద పండితులు సందుగుల సుధన్వాచార్య, పిల్లలమఱ్ఱి కృష్ణ మోహన్ శర్మ, దేవనూరు శశాంక శర్మ అయినవోలు రాధాకృష్ణశర్మ , వై.క్రాంతి శర్మ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవము నిర్వహించడం జరిగింది. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో మహా పడిపూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వాములు గొలనకొండ శ్రీనివాస్, రమేష్ బాబు ,అయినవోలు నాగరాజ్ శర్మ తదితరులు అభిషేక పూజలు పాల్గొన్నారు. దేవాలయ కార్యకర్తలు ఎం.రజిత ఎం. కవిత ,శకుంతల ,బేబీ సాయికుమారి, రమాదేవి, సుజాత, సులోచన, అయిత ఉమాదేవి, ఎం విజయలక్ష్మి, బి.రమేష్ ప్రవీణ్ ,సాయితేజ, శృతి, మరియు దేవాలయ సిబ్బంది యల్. రవి, డి సుదీర్, వి. శ్రీనివాస్, ఏ మణిదీప్, పద్మ, గుణవతి తదితరులు పాల్గొని భక్తులకు అన్నపూర్ణ భవన్లో అన్నదానం చేశారు.

అందరూ అయ్యప్ప కళ్యాణాన్ని ఆచరించాలి

అయ్యప్ప మాల ధరించిన ప్రతి భక్తుడికి అయ్యప్ప స్వామి కరుణ పరి పూర్ణముగా పుష్కలముగా లభించాలంటే పూర్ణ పుష్కలా సమేత అయ్యప్ప స్వామి కళ్యాణం ఆచరించ వలసిన అవసరం ఉందని. దీనిని గ్రంథంలో ప్రత్యేకంగా పేర్కొనక పోయినా దేవ దేవేరి ల యొక్క ప్రవర చెప్పబడినట్లు గా దాన్ని ఆధారంగానే తీసుకొని ఈరోజు దేవాలయంలో అయ్యప్ప కళ్యాణాన్ని నిర్వహించినట్టు , తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా 2016లో అయ్యప్ప స్వామి కళ్యాణాన్ని జరపగా.ఈ రోజు మళ్ళీ దేవాలయం లో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించడం జరిగిందని, స్కాందపురాణంలో అయ్యప్ప చరిత్రను తెలుప పడిందని ఈ విషయం దేవదేవేరి ల యొక్క ప్రవర ద్వారా తెలుస్తున్నది చెప్పారు.. దీని ద్వారా అయ్యప్ప స్వామి కళ్యాణము ఉన్నదనే విషయం అవగతం అవుతున్నదని. మరియు తమిళనాడు ప్రాంతంలో అచ్చం కోవెలలో పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నదని,అయ్యప్ప స్వామి కళ్యాణం చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని. అందరూ పూర్ణముగా పుష్కలంగా జీవించే అవకాశం ఉంటుందని అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి అయ్యప్ప స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తు తెలియచెప్పారు.

ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజా నాయకులు జక్కుల రవీందర్ యాదవ్ మరియు మౌనికచరణ్ రెడ్డి, వై రవీంద్ర శర్మ కంది కోట శ్రీనివాస శర్మలు హాజరయ్యారు.

ఇట్లు

అయినవోలు రాధాకృష్ణశర్మ

దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు

శ్వేతార్కుడికి పుష్కర జలాభిషేకం

కార్తీక మాస సందర్భంగా ఈ రోజు శ్వేతా ర్కాగణపతి స్వామి వారికి విశేషించి. బ్రహ్మ పుత్ర నదీ పుష్కర జలంతో సహస్ర దారాభిషేకం జరుపబడిందీ. భక్తులు శనిగ రపు రాజ మోహన్ సుజాత దంపతుల చే తెప్పించబడిన ఈ జలం తో ఉపనిషద్ పూర్వకంగా,నమక చమక సహితంగా రుద్రాభిషేకం జరపబడింది.
ప్రతి సంవత్సరం పుష్కర జలంతో అభిషేకించడం ఆచారంగా వస్తోంది. ఈ రోజు జరిగిన ఈ పూజా లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామి వారికి ఆలయ ప్రదక్షిణ చేసి అభిషేకం లో పాలుపంచుకున్నారు.
అభిషేక అంతరం భక్తులకు అట్టి జలమును శిరస్సుపై చిలకరించడం జరిగింది.
అనంతరం రాధా కృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో లో భక్తులచే రుద్ర హోమం చేశారు.
కార్తీక మాసంలో అగ్ని ఆరాధన చేయాలని.అందుకే దీపారాధనలు వెలిగించడం ఆచారంగా ఉందని తెలిపారు.
కార్య కర్తలు.సులోచన,రమాదేవి,రమ్య,బేబీ,ఉమాదేవి,విజయ కోటి,సవిత,భవాని,అయిత ఉమాదేవి, పాల్గొనగా దేవాలయ సిబ్బంది. రవి,సుధీర్,శ్రీనివాస్,పద్మ,గుణవతి,హరి స్వామి,దయాకర స్వామి, తదితరులు పాల్గొని అన్నదానం చేశారు.

*24 న కాళేశ్వర యాత్ర*

కార్తీక మాస సందర్భంగా ఈ నెల 24 వ తేదీన శ్వేతా ర్క గణపతి దేవాలయం నుండి భక్త బృందం కాళేశ్వరం వెళ్లడం జరుగుతుంది. అక్కడ త్రివేణి సంగమ గోదావరి నది లో స్నాన సంకల్ప విధి, సైకత లింగ పూజా,కాళేశ్వర ముక్తేశ్వర దర్శనం,నియమిత స్థలంలో శివాభిషేకం,దాత్రినారాయన పూజా,దీపదానము లు,ఉసిరిక చెట్టుకింద భోజనము లు ఇత్యాది వి జరిప బడుతాయి. రా దలచిన వారు బస్ బుకింగ్ కోసం 9347080055 కు ఫోన్ చేసి పేరు రాయించు కొనగలరు.

ఇట్లు
అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి.

…………………………

సీట్ ఒక్కరికి 850₹

ముందుగా చెల్లించిన వారికి ముందు సీట్స్ వరుసగా ఇవ్వబడుచున్నవి.

ఇప్పటివరకు 38 సీట్లు అయిపోయిన వి.
ఇప్పుడు రావాలనుకొనే వారు వెనక సీట్స్ లో కూర్చోవలసి ఉంటుంది.

13.11.2019నాడు కోటి దీపోత్సవం వేడుకలో శ్వేతార్క గణపతి స్వామివారు