ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించవచ్చా ?

ఉపవసతేతి ఉపవాసః ‘ ( ఉప అంటే దగ్గర ) ఉపవాసం ద్వారా భగవంతుని దగ్గర మన మనసును ఉంచుట . భగవంతుని నుంచి మనల్ని దూరం చేసేది ఆహారం , నిద్ర . ఆహారంలో వైకుంఠం చూసేవారు . ఆ భగవంతునికి దూరంగా ఉంటారు . భగవంతునికి సన్నిహితంగా ఉండాలనుకునేవారు ఆహారం , నిద్ర రెండూ మానాలి . ఉపవాసం చేసిన రోజు ఉదయం నిద్రించరాదు . సాంసారిక విషయాలను మాట్లాడరాదు . పరమాత్మ యందు మనస్సు ఉంచితే వాక్కు కూడా పరమాత్మ యందే ఉంచాలి . భగవంతుని నామాన్ని స్మరించాలి . ఆయన కథలే వినాలి . ఆయన కీర్తనలు పాడాలి . ఈ విధంగా భగవంతుని పలువిధాలుగా ఆరాధించాలి .

శ్వేతార్కాలో వైకుంఠ ఏకాదశి పూజ వివరాలు

వైకుంఠ ఏకాదశి సంధర్బంగా స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో కొలువైవున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు జరుగును

కార్యక్రమ వివరాలు

ఉదయం 5.20ని౹౹ల అభిషేకం,

ఉదయం 5.45 నుండి తిరుప్పావై సేవ మరియు సామూహిక విష్ణుపారాయణం అనంతరం బాలభోగా నివేదన.

ఉదయం 6.15ని౹౹ల నుండి వైకుంఠ ద్వారాదర్శనం,విశేష అలంకరణ. దర్శన వేళలో భక్తుల హరినామ సంకీర్తన.

ఉదయం 10 గం౹౹లకు పురుషసూక్త, సుదర్శన, నరసింహ మూలమంత్ర,లక్ష్మీకుబేర గణపతి నిత్య సహస్రమోదక హోమములు

పగలు 12గం౹౹లకు మహాన్నదానం(అన్నపూర్ణ భవనంలో)

సాయంత్రం 6.30 భాగవత్గీత మరియు విష్ణు లక్ష్మీ సహస్ర నామ పారాయణములు,పూజ,హారతి,తీర్థప్రసాదా వితరణ.

గమనిక:: పై పూజ,హోమముల్లో పాల్గొన్న భక్తులు గోత్రనామాలకు 151/-(అభిషేక,హోమమ్),351/-(అభిషేక,హోమం,అన్నదానం,ప్రదోషకాలార్చన),551(అభిషేక,హోమములో కూర్చునచో-దంపతులకు మాత్రమే)1116/-అన్ని పూజలలో స్వయంగా కూర్చినవచ్చు(ప్రత్యేక ప్రసాదం ఇవ్వబడును)

ఈ సందర్బంగా.. వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత..
రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు శ్రీ మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని తెలుస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి. ఈనాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికిశుభఫలితాలుంటాయి. బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కూడా ఈ రోజే కలుగుతుంది. ఈ రోజుప్రాత: కాలంలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలిగించుకోవడం మంచిది. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి భుజించాలి.
ఉపవసించలేనివారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ కూడా ఉండదని శాస్త్రం తెలుపుతుంది.

ఉత్తరద్వారా దర్శనం-స్వర్గ ద్వారా మార్గమా ?

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.

కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ‘ముర ‘ అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.

ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.

ఉత్తరద్వార దర్శనం” గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.

ఏకాదశి మర్నాడు ఉసిరికాయలు ఎందుకు తినాలి?

వైకుంఠ ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసము చేయడం, ద్వాదశినాడు
అవిసి కూరను, ఉసిరికాయలను తినడం
ఎందుకో తెలుసా?

చంద్రుడు భూమిని చుట్టి రావడానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు అవుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిధి (phase of moon) అనబడే చాంద్రమాసంలో 30 తిధులు వున్నాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 తిధులను శుక్ల పక్షమని
పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల తిధులను బహుళ పక్షమని (కృష్ణ పక్షమి)
అని అంటారు.

అమావాస్య నాడు సూర్య చంద్రులు ఒకే సమయంలో ఉదయించి, ఒకే సమయంలో అస్తమిస్తారు. అక్కడ నుండి ఒక్కొక్క రోజు
12 డిగ్రీల చొప్పున చంద్రుడు, సూర్యుని నుండి దూరమౌతాడు. నాలుగవ రోజు అంటే
చవితి నాడు చంద్రుడు సూర్యుని నుండి 37 డిగ్రీలు మొదలు 48 డిగ్రీలు వెనుక బడతాడు.
పదకొండవ రోజు ఏకాదశి నాడు సూర్యుని నుండి 134 డిగ్రీలు వెనుక వున్నట్టు. పౌర్ణమినాడు సూర్యుని నుండి 180 డిగ్రీలు వుంటుంది. పైన చెప్పిన రోజుల్లో సూర్యుని
నుండి చంద్రుడు దూరముగా వున్నందున
భూమ్యాకర్షణ శక్తి అధికమవుతున్నది.
ఆసమయంలో ఎప్పుడూ భోజనం చేసినట్లు చేస్తే జీర్ణక్రియ సరిగా వుండదు. అందు వలన ఆ కాలంలో శాస్త్ర పండితులు ఉపవాసం
చేయాలని చెప్పారు.

వైకుంఠ ఏకాదశి రోజున చంద్రుడు సూర్యునికి
135 డిగ్రీలు వెనుకబడి వుంటాడు. ఆనాడు సూర్యుని మార్గానికి దక్షిణాన దూరంగా వుంటాడు. ఆనాడు కూడా భూమ్యాకర్షణ శక్తి
అధికమైనందున ఉపవాసం చేయాలి అని
తెలిపారు.

ఏకాదశినాడు ఉపవాస వ్రతం చేసినందు వలన మొదటి పదిరోజులు భుజించిన ఆహారంలో చేరిన మలినాలు కరిగి బయటికి పోతాయి. 11 వ రోజు ఏకాదశినాడు కడుపు శుభ్రపడుతుంది. ఆ నాడు జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. పిదప మనకు విటమిన్లు అవసరమవుతున్నాయి.
ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ విటమిన్ ‘సి’ అవసర పడతాయి. అందు వలన ద్వాదశినాడు ‘ఏ’ విటమిన్ అధికంగా కలిగిన అవిసి కూరను,
‘సి’ విటమిన్ అధికంగా కలిగిన ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకుంటున్నాము.

నిత్యం మనం సూర్య నమస్కారాలు చేసి
నెలకి ఒక సారి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వలన, నేత్ర దృష్టి కి దేహానికి
ఆరోగ్యం లభిస్తాయి.

వైకుంఠ ఏకాదశి పాటించాల్సిన విధివిధానాలు

06-01-2020 అనగా రేపటి రోజున” వైకుంఠ ఏకాదశి ”
ప్రాముఖ్యత,విశిష్టత,ఆచరించవలసిన పద్దతులు తెలుసుకుందాం!

ఒక్క రోజు ముందుగానే మీకు,మీ కుటుంబసభ్యులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు
…….. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ……..

🌴🌻🌹శ్రీరామరక్ష – సర్వజగద్రక్ష🌹🌻🌴

🌴☝🌺ముక్కోటి ఏకాదశి -వైకుంఠ ఏకాదశి🌺☝🌴

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

👉🏿👉🏿ఈ రోజున ముఖ్యమైనవి::👏

ఉపవాసం, జాగరణ. జపం, ధ్యానం.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.
పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
గీతోపదేశం జరిగిన రోజు కనుక ‘భగవద్గీత’ పుస్తకదానం చేస్తారు.

వైకుంఠ ఏకాదశి పేరు

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్ధాలున్నాయి.

🌲🌷 పండగ ఆచరించు విధానం 🌺🌲
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. ‘లంకణం పరమౌషధ’ మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :

1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.

2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

3. అసత్య మాడరాదు.

4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

7. అన్నదానం చేయాలి.

వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది సోమవారం ( జనవరి 06) నాడు వస్తోంది.ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, వైకుంఠ ద్వారాలు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి…….వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

🌴 :: పండుగ ప్రాశస్త్యం:::🌴
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
👉🏿🌷వైఖానసుడి కథ::🌷
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
👹👿 : మురాసురుడి కథ::😈👺
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు ‘ఏకాదశి’ అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
👉🏿::పుత్రద ఏకాదశి కథ:::👈
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.దీని గొప్పతనాన్ని వివరించే కథ : పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే ‘వార్త’ తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు ‘పుత్రద ఏకాదశి’ గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంతట, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య ‘చంపక’కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ‘ఏకాదశీ వ్రతాన్ని’ చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు.
🌻👏 :: తాత్త్విక సందేశం ::👏🌻
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికిగ స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
🌹👏వైకుంఠ ద్వారం::👏🌹
శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

ధన్యోస్మి 👏👏💐💐

07 జనవరి 2020 శ్వేతార్కాలో సహస్రాధికరుచికర చిత్రాన్న పూజ

తెలంగాణగణపతిగా భాసిల్లుతోన్న కాజిపేటశ్వేతార్కగణపతి స్వామివారి సన్నిధిలో 07.1.2020 మంగళవారం సా.6గం౹౹ల నుండి సహస్రాధిక రుచికర చిత్రాన్న పూజ జరుపబడుచున్నది. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు. ఈ దేవాలయ క్షేత్రములో ఎప్పుడూ కూడా బయటి నుంచి తెచ్చే భోగములు ప్రసాదములు నివేదించడంకు అనుమతించబడదు . కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ఈ అవకాశము భక్తులకు కల్పించబడుచున్నది. భక్తులు తమ ఇంటి నుండి కేవలం చింతపండుతో మాత్రమే తయారు చేసిన ఒక కిలోమ్భావు ప్రమాణము కలిగిన పులిహోరలు తీసుకొని వచ్చి సాయంత్రం 5 గంటల లోపల దేవాలయములో అందించాలి . అలా భక్తుల నుండి సేకరించబడిన పులిహోర శ్రీస్వామివారి ఎదురుగా ఒక రాశిగా పోసి నివేదన చేయడం జరుగుతుంది. ముందుగా అన్నపూర్ణాదేవి పూజలు జరిపి పౌష్యలక్ష్మి ఆవాహన చేసి ఈ పూజను జరుపబడుతుంది. ఈ పూజా కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్రములోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్నాటక ,మహారాష్ట్ర నుంచి భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొంటారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు స్వయంగా భగవంతునికి భోజనం పెట్టె ఈ సదావకాశమును వినియోగించుకొనగలరు.

ఇట్లు
అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి దేవాలయ వ్యవస్థాపకులు

— మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.
— కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని దర్శనం చేసుకొని తరించగలరు.
ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు సమచారమునకుTelegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.

ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app

గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ సోత్రం

🙏🙏🙏

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥
॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

శ్వేతార్కలో కేతు గ్రస్త సూర్యగ్రహణ అమావాస్య సందర్భంగా ప్రత్యేక నాగదండ పూజలు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ శివ కేశవుల క్షేత్రమైన 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక వాహన దంపత సమేత నవగ్రహ క్షేత్రమైన కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రములో

— ఈరోజు కేతు గ్రస్త సూర్య గ్రహణం మరియు గురు అమావాస్య సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ సంతాన నాగలింగేశ్వరస్వామివారికి విశేష రుద్రాభిషేకములు మరియు బిల్వార్చనలు ప్రత్యేకంగా శ్వేతార్కగణపతిస్వామివారి ఆభరణమైన నాగదండమునకు విశేష పూజలు జరుగనున్నాయి.

— ఇక్కడి శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు చెట్టులో స్వయంగా స్వామివారి ఆభరణామ్ స్వయంగా ప్రకృతి స్వరూపమైన అడవులలో లభించడం అర్కము అంటే సూర్యునికి సంబంధించినదై ఈరోజు సూర్యగ్రహణం కలసిరావడంతో ప్రత్యేకించి పూజలు నిర్వహించడం జరుగుతున్నది

— గురుదోషాలు,కుజదోషం, నాగ దోషములు కాలసర్ప దోషం జాతకంలోని గ్రహస్థితి ననుసరించి సంతాన దోషాలు,రాహుకేతు కాలసర్పదోషాలు పోతాయి.

— కోర్టు సమస్యలు చికాకులు దాంపత్య జీవితంలోని సమస్యల నుండి విముక్తికై ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.

౼౼ అలాంటి వారు ఈ రోజున ప్రదోషకాలములో నాగ దండమును ఆరాధించినచో మంచిదని తెలుస్తుంది.

౼౼ ఈ రోజున విశేషించి తెల్ల జిల్లేడు పూవులతో మరియు ఎర్రని మందార పువ్వులతో గణపతికి ఆయుధమైన నాగదండమును పూజించిన, గణపతికి ప్రీతికరంగా 16 ప్రదక్షిణాలు చేసినా కోరిన కోరికలు నెరవేరుతాయి.

౼౼ ఈ సందర్బంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు దేవాలయములో గల నాగదండమునకు ప్రత్యేక అలంకరణ , హారతి భజనలతో విశేష పూజా కైంకర్యాలు జరగనున్నవి. భక్తులు కొబ్బరికాయ, పూలు (తెలుపు,ఎరుపు), పూలమాలలు,శర్కర, బెల్లం తీసుకొనిరగలరు..

౼౼ ఈ పూజలో గోత్రనామాలు చదివించ దలచినవారు 101 ₹ 9347080055 నెంబర్నకు (gpay,phone pe,paytm) ద్వారా చెల్లించి మీ గోత్రనామలు చదివించుకోగలరు, గోత్రనామాలు 9394810881 నెంబర్కి వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేయగలరు

— మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.

— కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని, నాగదండమును దర్శనం చేసుకొని తరించగలరు.

ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు సమచారమునకుTelegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.

ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app

ఇట్లు
దేవాలయ పరిపాలన నిర్వాహకులు

*ఐనవోలు సాయి కృష్ణ శర్మ*

9వ రోజు తిరుప్పావై live

https://m.facebook.com/story.php?story_fbid=1208349436018690&id=100005309344868&sfnsn=wiwspmo&extid=9gMxTBAx5aPoDWEf&d=n&vh=i

శ్వేతార్కాలో 2020 క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారు

2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆంగ్ల మాసముల క్యాలెండర్ను కాజిపేట శ్వేతార్కగణపతి దివ్య క్షేత్రంలో దేవాలయ ఆస్థాన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారి (రంగంపేట) కరకమలములచే క్యాలెండర్ ఆవిష్కరించబడినది. భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మరియు రంగంపేట మదనానంద సరస్వతీ క్షేత్ర ఆస్థాన సిద్ధాంతి, కాజీపేట శ్వేతార్కమూలగణపతి దేవాలయ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారిచే రచింపబడిన పంచాంగ గణిత తిథి వార నక్షత్రాలు మరియు రాబోయే శర్వారినామ సంవత్సర దినదర్శిని , తెలంగాణ రాష్ట్ర విద్వత్సభలో నిర్ణయించిన పండుగలను ఇందులో చేర్చబడినవి. అయినవోలు సాయికృష్ణ శర్మ కళ్యాణి దంపతులు శ్రీస్వామివారికి మొదటి క్యాలెండర్ అందించారు. ఈనాటి కార్యక్రమంలో భక్తులు దేవాలయ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు… ఇట్లు అయినవోలు సాయికృష్ణశర్మ దేవాలయ పరిపాలన నిర్వాహకులు