4-2-2019 తేదీన జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీసంతనానగలింగేశ్వర స్వామివారికి ఉదయం 7 నుండి 11 వరకు విశేష  అభిషేకాలు 11 గంటలకు సోమవతిఅమ్వాస్య ప్రత్యేక పూజా.. సాయంత్రం 6.30 ని లకు నాగదండ పూజ జరుగును…. జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం,రాహు కేతు దోషం ఉన్నవారు తప్పక పాల్గొనగలరు….

​పుష్యబహుళ అమావాస్య సోమవారం 4-2-19 శ్రవణానక్షత్రయుక్త మహోదయపుణ్యకాలం గురించి శ్రీ స్వామివారి అనుగ్రహపూర్వక భాషణం.

మాఘ పుష్య మాసాలలో అమావాస్య సోమవారం నాడు శ్రవణా నక్షత్రం కలిసిన పుణ్యకాలం మహోదయం చెప్పబడుతోంది.

కోటి సూర్య గ్రహణాలలో దానం, తపస్సు చేసిన ఫలితము ఒక్క మహోదయ కాలంలో చేసిన స్నానానికి సమానము.

పరమాచార్య స్వామివారు మహోదయ పుణ్యకాలంలో విద్యారణ్యమునందు స్నానమాచరించేవారు.
సులభంగా తరించటానికి ఇటువంటి సదవకాశాన్ని  అందరూ ఉపయోగించుకోవాలని స్వామి వారు బోధించారు..

4-2-2019 తేదీన జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

సోమవారం నాడు వచ్చే అమావాస్యకు హిందూధర్మం లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోజుని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకం లో ఉండే సకల దోషాలు పోతాయి.

_*సోమావతి అమావాస్య కథ :*_

ఒకానొక ఊరిలో ఒక సాధువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంటిలోని పెళ్లికాని ఒక కన్యను ఆమె ముఖం చూసి దీవించకుండా నే వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం ఎంతో బాధ పడింది. చివరికి పురోహితుని పిలిపించి కారణం అడుగగా , ఆయన ఆమె జాతకం చూసి, ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలం లోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. అని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుని ప్రార్థించారు. ఆయన సింఘాల్ ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పాడు.

వర్తకుడు ఆ అవివాహిత అయిన కన్యనూ,తన చిన్న కొడుకునూ అక్కడికి పంపుతాడు. మార్గ మధ్యం లో ఒక నదిని దాటబోతుండగా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన  గద్ద పిల్లను ఒక పెద్ద పాము చంపి తినడానికి వస్తోంది. నిత్యం అక్కడ ఇదే జరుగుతుండేది. గద్ద పిల్ల పుట్టిన వెంటనే పామువచ్చి వాటిని తిని వెళ్లిపోయేది. కానీ ఆరోజు ఆయువతి ధైర్యంగా ఆ పామును చంపి గద్ద పిల్లను కాపాడింది. తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గద్ద వారికి చాకలి స్త్రీ ఇంటికి దారిచూపింది. కొన్ని నెలల పాటు ఆ చాకలామెకు సేవచేయగా ఒక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమనిచ్చింది. ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోయింది.

ఫిబ్రవరి 4న సోమాతి అమావాస్య రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే..

సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు.

సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య ఫిబ్రవరి నాలుగో తేదీ (2019)న రానుంది.

ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *