398కిలోల నెయ్యితో శ్వేతార్క గణపతికి అభిషేకం

తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ అర్బన్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభుశ్రీశ్వేతార్క గణపతి క్షేత్రంలో సంకష్టహరచవితి పురస్కరించుకుని శ్రీస్వామివారికి 398కిలోల మహా ఘృతాభిషేకం(నెయ్యితో) జరిగింది. స్వయంవ్యక్తమైన శ్వేతార్కుడికి విద్యార్థినివిద్యార్థుల మేధాసంపత్తి, పరీక్షలలో ఉత్తిర్ణత సాధించుటకై గణపతికి ప్రీతికరమైన ఈ అభిషేకం చేయడమైనది. బాల్యం నుండే పిల్లలకు వారు స్వీకరించే భోజనంలో నెయ్యి అలవాటు ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు చురుకుగా పనిచేస్తూ పిల్లలకు అన్ని రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది అని ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్దాంతి గారు ఉపన్యసించారు మరియు సిద్ధాంతిగారి పర్యవేక్షణలో రాధాకృష్ణ శర్మ సాయికృష్ణశర్మల వేదమంత్రోచ్చారణలతో గణపతి ఉపనిషత్తులు సూక్తముల పారాయణములతో సిద్దిబుద్ది గణపతి మూర్తుల జై గణేశ అంటూ శరణుఘోషతో నగరసంకీర్తనలు భజనలతో క్షేత్రమంతా గణపతి నామస్మరణతో మారుమ్రోగింది.తదుపరి భక్తులకు నెయ్యి వితరణ చేయడమైనది.భక్తులకు విశేష అన్నప్రసాదా వితరణ క్షేత్రంలోని అన్నపూర్ణ భవనమునందు దేవాలయ సేవకులు వితరణ చేశారు.

కోరిన కోర్కెలు తీర్చే క్షిప్రప్రసిద్ది లక్షలాదిమంది ఇంటి ఇలవేలుపు దైవంగా భాసిల్లుతోన్న ఇక్కడి శ్వేతార్కగణపతి స్వామివారు… www.swetharka.org..telegram:-t.me/swetharka, WhatsApp:-+91 9394810881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *