15-12-2019 సంకష్టహర చవితి శ్వేతార్కాగణపతికి ఉండ్రాళ్ళతో అభిషేకం

*15.12.2019 ఆదివారం రోజున సంకష్టహరచవితి
శ్వేతార్కగణపతికి ఉండ్రాళ్ళు మరియుపంచామృతాభిషేకము*

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో 15-12-2019 ఆదివారం రోజున సంకటహరచవితిని పురస్కరించుకొని శ్రీశ్వేతార్కగణపతికి సా. 5 గం౹౹లకు దుర్వాహోమం మరియు సా. 6 గం౹౹లకు ఉండ్రాళ్ళు,పంచామృతాలతో విశేషాభిషేకం జరుగుతుంది. తదుపరి అర్చన హారతి తీర్థప్రసాదా వితరణ జరుగును. అన్నపూర్ణ భవనంలో భక్తులకు మహాన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. బయట నుండి తెచ్చు ఉండ్రాళ్ళు దేవాలయంలో నివేధించబడవు కావున భక్తులు తామే స్వయంగా దేవాలయంలో ఉండ్రాళ్ళు తయారు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడమైనది — భక్తులు ఇట్టి అవకాశం వినియోగించుకొని శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం.

వెన్నె మరియు పంచామృతాలతో వల్లీదేవసేన సుబ్రమణ్యస్వామికి అభిషేకం

This slideshow requires JavaScript.

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఈరోజు స్వయంభు శ్రీ శ్వేతార్కగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూర్తులకు పంచామృత పంచవర్ణ మరియు వెన్నతో స్వామివారికి విశేష అభిషేకం చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాగ దోషాలు కాలసర్ప దోషాలు సంతానం లేని వారికి ప్రత్యేక సంతాన పూజలు ఉదయం 11 గంటలకు కాలసర్ప హోమము సర్ప సూక్తం తో సుబ్రమణ్యేశ్వర మూల మంత్రములు విశేషంగా జరిగాయి. తదుపరి అన్నపూర్ణ భవనంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.