02.02.2019 శనిత్రయోదశి. ఈ శనిత్రయోదశి నాడు అన్ని రాశులవారు పూజలో పాల్గొనండి సమస్త శని బాధల నుండి విముక్తి పొందండి..

స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు కు శనివారం, లయకారకుడైన పరమేశ్వరునికి త్రయోదశి ప్రీతికరమైనవి. శనివారం రోజున త్రయోదశి తిథి వచ్చిన యోగాన్ని “శనిత్రయోదశి” పర్వదినంగా పేర్కొంటారు.
శివకేశవులకు ప్రీతి కరమైన “శనిత్రయోదశి” రోజున శనైశ్చరుని మరియు సవర్ణ, సపత్ని, సవాహన నవగ్రహాల అనుగ్రహం పొందుట ఎంతో శ్రేయస్కరం.

జాతకరీత్యా అర్థాష్టమ, అష్టమ, ఏల్నాటి శని దోష ప్రభావిత రాశులైన వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారి శని దోష నివారణకు 02.02.2019 శనివారం రోజు ఉదయం 10.30 గం.లకు “సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహములకు అభిషేకం, శనికి తైలాభిషేకం, షోడశోపచార పూజలు, తిల దానం, నవగ్రహ హోమాలు నిర్వహించబడును.

     -::  ఫలితాలు. ::-

*వృత్తి, ఉద్యోగ, వ్వాపారాదులలో విజయం, లాభం సిద్ధించుటకు*

*విద్య, విదేశీయాన, వివాహ, సంతాన, అన్యోన్య దాంపత్యం పోందుటకు*

*అనారోగ్య, కోర్టు, ఋణబాధల నివారణకు*

*కీర్తి-ప్రతిష్ఠలు, దీర్ఘాయువు, ఐశ్వర్యం, ధర్మార్ద, కామ, మోక్షాలు పొందుటకు*

శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం.

శనిగ్రహం దీర్ఘాయువు, దుర్భాగ్యము, దుఃఖము, వృద్ధాప్యం మరియు చావు, క్రమశిక్షణ, నియమం, బాధ్యత, కాలయాపనలు, గాఢమైన వాంఛ, నాయకత్వము, అధికారం, నిరాడంబరత, చిత్తశుద్ధి, అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం, కాదనుట, అనురాగం లేకపోవుట, ఆత్మ స్వరూపత్వం, కష్టించి పనిచేయుట, సంవిధానం, వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది. అసమానమైన లక్షణాలు: అపారమైన శక్తి, చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు..

 శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే, కాలసర్పం, సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.

శని త్రయోదశి రోజున సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహ అభిషేక హోమాలలో పాల్గొనుటకు సంప్రదించువారు

*29 దేవతమూర్తులతో కొలువుదిరిన దంపత్ వాహన సమేత తెలంగాణ గణపతిగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లా కాజీపేటలోని సపరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి స్వామివారి దివ్య క్షేత్రం* 
Website : www.swetharka.org

Telegram : t.me/swetharka

Contact/Whatsapp : +91 9347080055, +91 9394810881.

*శ్లోకం:*

*ॐ నీలాంజన సమాభాసం | రవి పుత్రం యమాగ్రజం||*

*ఛాయామార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరమ్ ||*

నువ్వులు ,నువ్వులనునెతో అభిషేకం, మరియు 108 సార్లు ప్రదక్షణ..చేయండి
_*శని త్రయోదశి*_

———————–

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. 

ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. 

శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు..

శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాయాధిపతి లా శని దండన విధిస్తాడు.శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి ,త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేస్తాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి.
*శని త్రయోదశి* ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లాబిస్తుంది. ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు,శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు.ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనె తో శని కి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టు కి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనె లో ముఖం చూసుకొని ఆ నూనె ని దానం చేయడం. నల్ల కాకి కి అన్నం పెట్టడం,నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు,నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది.

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం,కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

_*శనీశ్వర స్తోత్రం*_

———————

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్‌ నమామి శనైశ్చరమ్‌ (108 సార్లు)

ప్రదక్షిణ చేసి తరువాత కాళ్లు కడుక్కొని ఈశ్వర దర్శనం కానీ అభిషేకం చేయండి

తప్పక హనుమంతుని ఆలయాన్ని దర్శించి హనుమాన్ దర్శనం హనుమంతునికి కూడా 108 ప్రదక్షిణలు చేయండి .

అందువల్ల ఏలినాటి శని ప్రభావం ఉపశమనం కలిగి మీకు మనశ్శాంతి సౌఖ్యం లభిస్తాయి కార్య విజయం కలుగుతుంది.

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా…? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.

త్రయోదశి వ్రతం

త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశిగానీ లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు గానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు.

ప్రదోషకాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలకాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట. 

శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. 

1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.

2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.

3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు 

నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ: శివాయ” అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.

7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *