సంకష్టహరచవితి పురస్కరించుకుని శ్వేతార్క గణపతికి 340 లీటర్ల మామిడి ఫలరసాభిషేకం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో సంకష్టహర చతుర్ధి పురస్కరించుకొని శ్రీస్వామివారికి భక్తులచే సేకరించిన 340లీటర్ల మామిడి ఫలరసాభిషేకం చేయడమైనది. పూజకి వరంగల్ జిల్లా మెయిన్ జిల్లా జడ్జి రవీందర్ దంపతులు, టాస్క్ ఫోర్స్ C I గణేష్ దంపతులు, వరంగల్ జిల్లా D P R O శంకర్ పల్లవి దంపత్ సమేతంగా దేవాలయానికి విచ్చేశారు..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయడమైనది.

వైశాఖ మాసంలో మామిడి రసంతో గణపతికి అభిషేకం చేయడం వలన శరీర వేడిని, మరియు ఆరోగ్య సంబంధించిన వ్యాధులనుండి ఉపశమనం పొందవచ్చని దేవాలయ వ్యవస్థాపకుడు ఐనవోలు అనంతమల్లయ్య గారు దేవాలయ చరిత్ర మరియు మామిడి ఫలరసాభిషేకం ప్రాశస్త్యమును భక్తులనుదేశించి వివరించారు. అంతకు పూర్వం ఐనవోలు రాధాకృష్ణ శర్మ గారు 21మంది జంటలతో సంకష్టహరచవితి దూర్వా లాజ హోమం చేశారు.. అభిషేకం అనంతరం భక్తులకు శ్రీస్వామివారికి అభిషేకం చేసిన మామిడి రసాన్ని వితరణ చేయడమైనది.. దేవాలయం లోని అన్నపూర్ణ భవనంలో నేటి అభిషేకమునకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల్ల భక్తులకు అణా ప్రసాద వితరణ చేయడమైనది.

పూజారులు సాయికృష్ణ శర్మ,నమోనరాయణ, మిశ్రా మరియు దేవాలయ మేనేజర్ రవి,ప్రదీప్,దినేష్,దేవాలయ pro మణి కార్యకర్తలు పాల్గొన్నారు..

ఈ సమాచారమును మీయొక్క అన్ని మీడియా ప్రచారమాధ్యమలలో షేర్ చేయగలరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *