దీపావళి పండుగ సందర్బంగా శ్వేతార్కగణపతి దేవాలయం లో కొలువైఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారికి ఘనంగా పూజలు జరుపబడినవి. ఉదయం 7గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం,హరిద్రోదకాభిషేకం జరుపబడింది. అనంతరం అర్చన హారతి మరియు ఐనవోలు రాధాకృష్ణ,సాయికృష్ణ శర్మలు వ్యాపారస్తులు క్షేమాన్ని కోరుతూ లక్ష్మీ మూల మంత్ర హోమము జరుపబడింది. అనంతరం దేవాలయ ఆస్థాన గాయనీమణులు సాయకుమారీ,రమాదేవి లు సహస్రనామ స్తోత్ర పారాయణ,బైభవ లక్ష్మీ పూజలు జరిపారు. సాయంత్రం జరిపిన దీపారాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేశారు. రామాజన్మభూమి లో మందిర నిర్మాణం త్వరగా కావాలని శ్రీరామ ఆకృతిలో దీపాలు వెలిగించారు. అనంతరం అన్నపూర్ణాభవన్ లో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమములో రజిత,ఉమాదేవి,శకుంతల,విజయకోటి,తదితరులు పాల్గొనగా సిబ్బంది యల్.రవి,శ్రీనివాస్,మణిదీప్,స్వప్న ,మహతి,కల్యాణి, శారదా,పుష్పలత తదితరులు పాల్గొన్నారు.