భక్తులకు శ్రీవికారి నామ సంవత్సర ఉగాది శుభాకంక్షలు

తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట శ్వేతార్క మహా గణపతి సన్నిధిలో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీశ్వేతార్క గణపతి స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరుగనున్నయి.. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారికి విశేష పంచామృత, నది, సముద్ర జలాలతో అభిషేకం, 8గంటలకు మహాకాళ స్వరూపమైన పంచాంగమునకు విశేష పూజ. 8.30ని||లకు శ్రివికారి నామ సంవత్సరంలో దేశ,రాష్ట్ర వ్యవహారాలలోఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపుతూ క్షేత్ర వ్యవస్థాపకుడు పంచాంగ కర్త ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి గారిచే పంచాంగ శ్రవణం చేస్తారు. దేవాలయ ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ సీతా కోదండ రామాలయంలో 9 రోజులపాటు జరుగు చైత్ర వసంత నవరాత్రోత్సవముల సందర్భంగా రాముల వారికి 7.30 ని||లకు విశేష అభిషేకం, 9.30 ని||లకు గణపతి పూజ, పున్యాహవచనం,అంకురార్పణ ఉత్సవ పూజలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ రాములవారి సన్నిధిలో విశేష అర్చనలు,అష్టోత్తర సహస్రనమార్చన పూజలు, హనుమాన్ చాలీసా,సుందరకాండ పారాయణం జరుగనున్నాయి. భక్తులు ప్రతిరోజూ పులిహోర భోగమునకు, పూలదండలకు మరియు పూజలలో గోత్రనామాలు చదివించాలని అనుకునే వారు మరిన్ని వివరాలకు 9394810881నందు సంప్రదింగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *