ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు… దేవి నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి

్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ఈరోజు అనగా 28-09-2019 శనివారం రోజున మహాలయ అమావాస్య సందర్భంగా అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు అయినవోలు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పితృ అర్చన తర్పణం విధిని జరుపబడింది. భక్తులు బియ్యం పప్పుదినుసులు కాయగూరలతో అర్చనలు జరిపించారు. పిత్రు అర్చనచేసిన భక్తులకు దేవాలయంలో తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి భక్తులనుద్దేశించి అమావాస్య తర్పణం యొక్క విశిష్టతను గురించి తెలపడం జరిగింది. మన భారతదేశ సనాతన సంప్రదాయంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పువ్వుకు పూజ చేసే ఆచారం ఉందని. అదే విధంగా పశువులకు పక్షులకు కూడా ఆరాధన చేసే సంప్రదాయం ఉందని పిత్రు అర్చనప్పుడు పక్షికి పూజ చేయడం పక్షికి ఆహారం ఇవ్వడం పిట్టకు పెట్టడం ఒక భాగమని, అదేవిధంగా దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించడం వల్ల విజయం కలుగుతుందనే విశ్వాసం ఉందని తెలుస్తుంది. మన సంప్రదాయంలో పక్షి ఆరాధన ఎంతో ముఖ్యమైనది అని గమనించవచ్చు.
మహాలయ అమావాస్య నాడు గతించిన పెద్ద వారంతా తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతార ని, వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతార ని. నిజానికి, ప్రతి మాసం లోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంద ని తెలిపారు. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంద ని. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తార ని తెలిపారు. .శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింద ని. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తార ని. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంద ని తెలిపారు. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనద ని, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంద ని, ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుం దని అన్నారు . ఎంసి
తదుపరి సాయంత్రం ఏడు గంటలకు శ్వేతార్కమూల గణపతి దేవాలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ పండుగను నిర్వహించారు ఈ బతుకమ్మ పండుగ లో స్త్రీలంతా కలిసి ఆటపాటలతో గౌరీ పూజ చేశారు ఈ వేడుకలను శ్వేతార్క ఛానల్ అనే యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.రేపు ఉదయం 9 గంటల నుంచి దేవీ నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మ నిర్వహణలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మశ్రీ అయినవోలు వెంకటేశ్వర శర్మ పుష్పలత దంపతులు ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భంగా దేవాలయం లో కొలువై ఉన్నటువంటి శ్రీలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ దేవి గాయత్రీ మాత అమ్మవార్లకు విశేష అభిషేకము అలంకారము అర్చన హారతి తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. చతుష్షష్టి పూజా విధానంతో పూజలు జరుపబడతాయి.ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కుమారి సుష్మా సుస్మిత అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయడం జరుగుతుంది. పూజ అనంతరం రేపు పగలు అన్నపూర్ణ భవన్లో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం కావాల్సిందిగా కోరుతున్నాంఇట్లు
ఎల్ .రవి
దేవాలయం మేనేజర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *