ప్రారంభమైన కాజిపేట శ్వేతార్క గణపతి క్షేత్ర గాలిగోపురం నిర్మాణ పనులు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి దివ్య క్షేత్ర *రాజ గోపుర* నిర్మాణం పనులు ప్రారంభమైనాయి…దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ గారు భూమి పూజాది కార్యక్రమాలు చేసి ఇటుకలు పరిచి ఆరంభించారు….. ఈ కార్యక్రమంలో భాగంగా కాజీపేట పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త మరియు అయ్యప్ప దీక్ష గురుస్వామి సిరిపురం వెంకటయ్య గారు మరియు దేవాలయ మేనేజర్ ఎల్.రవి , స్థాపతి ప్రభాకర్, మరియు శివకుమార్, జక్కుల రవీందర్, సుధీరకుమార్, శ్రీనివాస్, స్వప్న, మణిదీప్, హరిస్వామి, మరియు కాజీపేట పుర ప్రముఖులు పాల్గొన్నారు… స్థాపతి బృందం వారికి శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వారిని వేద ఆశీర్వచనాలు చైర్మన్ గారి చేతులమీదుగా జరిగింది….#శ్వేతార్క #తెలంగాణ #swetharka #telangana #gopuram #gopuramcontrusction #swetharkapoojas #telanganaswetharka #telanganaganapathi #తెలంగాణగణపతిLeave a Reply

Your email address will not be published. Required fields are marked *