*దూరప్రయాణాలు – పూర్ణిమ, అమావాస్య, గ్రహణం*

పూర్ణిమ, అమావాస్య రోజుల్లో, గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. చంద్రుడు మనః కారకుడు, పూర్ణిమ, అమావాస్య తిధుల్లో మనసు చంచలంగా, గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. గమనిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ ఈ తిధుల్లోనూ, మంగళవారం నాడు అధికంగా జరుగుతాయి. మనకు సూర్యోదయం ప్రధానం. వారం మొదలయ్యేది రాత్రి 12.00 గంటలకు కాదు, సూర్యోదయంతో, అలాగే ముగుసేది కూడా రాత్రి 12.00 కాదు, మరునాడు సూర్యోదయానికి ముగుస్తుంది. మనకు అర్ధరాత్రితో సంబంధంలేదు. సూర్యోదయంతోనే రోజును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని గమనించి చూడండి, అధికశాతం పూర్ణిమ, అమావాస్య, గ్రహణం, మంగళవారం ఘడియాల్లోనే జరిగాయి. రాత్రి సమయం, తెల్లవారుఝామున అధికంగా జరుగుతున్నాయి. కనుక ఇటువంటి తిధుల్లో దూరప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ||

జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః | అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||

భావం: నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *