దీపావళినోములు .. వివరణ

*దీపావళినోములు .. వివరణ*

శ్రీ వికారి నామ సంవత్సరంలో వచ్చే దీపావళి పండుగకు సంబంధించిన వివరములు ఈ క్రింది విధంగా తెలుస్తున్నాయి.

అక్టోబర్ 27వ తేదీ ఆదివారం రోజున చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉండి తదుపరి అమావాస్య తిథి ప్రారంభం అవుతున్న కారణంచేత ఆ రోజుననే నరకచతుర్దశి (అనగా తెల్లవారుజామున మంగళహారతులు ఇచ్చుకోవాలి) మరియు రాత్రి సమయంలో అమావాస్య తిథి ఉన్న కారణం చేత ఆ రోజున నే దీపావళి పండుగను మరియు ధనలక్ష్మి పూజలను ఆచరించాలి. 28వ తేదీ సోమవారం రోజున అమావాస్య తిథి ఉదయం 9 గంటల 31 నిమిషాల వరకు మరియు స్వాతి నక్షత్రం రాత్రి2:54 వరకు ఉన్న కారణం చేత నూతనంగా కేదార వ్రతం ప్రారంభం చేసుకునేవారు సోమవారం నాడు కేదార వ్రతం చేసుకొని గురువారం నాడు నోము ఎత్తుకోవాలి.
పుట్టు బుధవారం ఆచారం ఉన్నందున గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. అయితే గురువారం రోజున దేవుని ఎత్తుకునే వారు ఉదయం 6.50 లోపున లేదా ఉదయం 8.26 నిముషాల తర్వాత దేవుని ఎత్తుకోవాలి. ఈ సంవత్సరము స్వాతి నక్షత్రము మరియు అమావాస్య తిథి సూర్యోదయంలో కలిసి ఉన్న కారణం చేత కొత్త నోములు ఆచరించుకోవచ్చు.

పాత నోములు గల వారు
సోమవారం నాడు రాత్రి నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తు కొనవ లెను.కొందరి మతమున మంగళవారం మరియు పుట్టు బుధవారం దేవుని ఎత్తుకోడానికి అంగీకరించరు. కావున గురువారం నాడే దేవుని ఎత్తుకొన వలెను.
అమావాస్య రాత్రి తో సంబంధం లేని వారు కూడా బుధవారం నా డే కేదార నోము నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సింది గా తెలియజేస్తున్నాను.

ఇట్లు

అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
భద్రకాళి దేవస్థానం ఆస్థాన
సిద్ధాంతి. వరంగల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *