అంగరకసంకష్టహరచతుర్థి పురస్కరించుకుని జైజై గణేశా నామ స్మరణతో కిక్కిరిసిన భక్తులతో జనసంద్రమైన శ్వేతార్కగణపతి క్షేత్రం

తెలంగాణ గణపతిగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ఏకైక స్వయంభు గణపతిదేవాలయ క్షేత్రమై శివ కేశవులకు నిలయంగా ఉండి 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ దేవాలయ క్షేత్రంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజిపేట విష్ణుపురిలో వెలసిన స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవలయముల క్షేత్రంలో 25 డిసెంబర్ 2018 నాటి రోజున  ఉదయం 5.30ని౹౹ల నుండి వేలాది మంది భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకొనుటకు విచ్చేసారు.

నిత్య మంగళవారం పూజలతో పాటుగా సంకష్టహర చవితి పూజలు వైభవోపేతంగా జరిగాయి.. ఉదయం 5.30 ని౹౹ల నుండి పంచామృత,పంచవర్ణ, సహస్రధారభిషేక సేవలు, ఉ.10 గం౹౹ల నుండి నిత్యా సహస్రమోదక రుద్ర పంచంసూక్త నవగ్రహ హోమములు మధ్యాహ్నం 12 గం౹౹లకు శ్రీస్వామివారికి ప్రీతిగా సంగీత,గాత్ర సహిత సహస్రనామార్చన సేవలు జరిగాయి. తిరిగి సాయంత్రం 4గం౹౹లకు సిద్ది బుద్ధి సమేత శ్రీగణపతిస్వామి కి కళ్యాణోత్సవం, సా.5గం౹౹లకు దూర్వా, లాజ హోమము మరియు నిత్య మంగళవార ప్రదోషకాలపూజ, సాయంత్రం 6.20ని౹౹ల నుండి శ్వేతార్క గణపతి స్వామివారికి *438 లీటర్ల తేనేతోమహామధురాభిషేకము* ను జరుపబడింది.ఈ పూజకు వివిధ రాష్ట్రాల నుంచి భారిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు తమ మహత్భాగ్యంగా జైజై గణేశా అనే నామస్మరణతో  శ్రీస్వామివారిని బంగారువర్ణములో దర్శనమును చేసుకొని మధురానుభూతిని పొందినారు…తదుపరి భక్తులకు తేనెప్రసాదమును వితరణ చేయడం జరిగింది. శ్వేతార్కాగణపతి స్వామివారికి జరిపిన తేనె అభిషేక ఫలిత విశేషాలను భక్తులకు తెలియజేసి హారతి,తీర్థప్రసాదాలు అందచేయబడింది. మరియు నిన్నటి రోజున 4000మందికి వరకు మహా అన్నదానం జరుపడమైనది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *