వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కూడరై పూజలు


స్వయంభు శ్రీ శ్వేతార్కగణపతి దేవాలయం లో కొలువు తీరిన శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజున ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఉదయం ఏడు గంటలకు కుడారి ఉత్సవమును వైభవంగా జరుపబడినది. 108దొప్పలలో ప్రత్యేకంగా తయారు చేసిన గూడారపుపొంగలిని నివేదన చేసి పూజించారు.ఈ కార్యక్రమములో దేవాలయ రాజ పోషకులు హరిపురం రవీంద్రనాథ్ సునంద దంపతులు పాల్గొన్నారు. మరియు దేవాలయ కార్యకర్తలు శ్రీనమ్మ,సుజాత,లతాశ్రీ ,ఉమ,రాజకుమార్, కల్పన, సౌజన్య,జయమ్మ,వనజ తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి గోవింద నామములు విష్ణు సహస్రనామ పారాయణము సామూహికంగా జరిపారు. శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక తులసిమాలలతో అలంకారం చేశారు . హరిస్వామి మరియు దేవాలయం అర్చకులు ఈ పూజల్లో పాల్గొన్నారు .
ఇట్లు
టంటం దయాకరస్వామి
దేవాలయపూజా కార్యక్రమ నిర్వాహకులు