వరాలు ప్రసాద్దించే వరలక్ష్మీ అమ్మవారు

పరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో నేడు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకి శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి విశేషంగా పంచామృత, సహస్రధారాభిషేకములు మరియు హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం అలంకరణ తీర్థప్రసాద వితరణ అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజలు జరిగాయి. అష్టలక్ష్మి మూలమంత్ర హవనము మరియు నిత్య సహస్రమోదకగణపతి హోమమును లక్ష్మీ కటాక్షము కొరకై నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జనగాం,కరీంనగర్,సిద్దిపేట్,హుజురాబాద్,బాపట్ల,మహబూబాబాద్,ఆదిలాబాద్,హైదరాబాద్,భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని, ముతైదువులకు వాయనములు ఇచిపుచుకున్నారు. తదుపరి క్షేత్రంలోని అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ మహా అన్నదానం జరిగింది. ఈనాటి పూజ కార్యక్రమాలు దేవాలయ వేద పండితులు అయినవోలు రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాలు జరుపగా, దేవాలయ కార్యకర్తలు కవిత సీతారత్నం గుణవతి ప్రదీప్ భక్తులకు అన్నదానంలో సేవనందించారు. దేవాలయ అసిస్టెంట్ మేనేజర్ డి.సుధీర్ కుమార్,ఆర్.పి.ఆర్.వో మణి,నాగేష్, అర్చకులు ఆనంద్ కుమార్ త్రిపాటి,రాకేష్ శుక్ల,నమో నారాయణ త్రిపాటి,అరుణ్ కుమార్ త్రిపాఠి, నరేష్ మిశ్రా,హరికృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు దేవాలయ మేనేజర్ రవి

గణపతిదీక్ష -మాలధారణ చేయువారికి సూచన

గణపతిదీక్ష ..మాలధారణ చేయువారు చాలామంది మాకు ఫోన్ చేయు చున్నారు
*ముఖ్యముగా గమనింప దగిన విషయము ఏమనగా*
మాలధారణ చేయువారు కాజీపేట కే రావలసిన అవసరము లేదు. మీరు మీ సమీపంలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయంనకు వెళ్లి అక్కడి పూజారి తో (రుద్రాక్ష,స్పటిక)మాలలు వేయించుకొన వచ్చును.

మరియు అక్కడి పూజారి చేతనే మాలవిసర్జన-దీక్షా విరమణ చేసుకొనవచ్చును.

మాలలకు అభిషేకము చేయించుకొని సిద్ధి బుద్ధి సహిత హరిద్రాగణపతి కి పూజ చేసి దీక్ష వస్త్రమును ధరించి మాలలు వేసుకోవలెను.
పూర్తి వివరాలకై దేవాలయ వెబ్సైట్లో నియమాలు చూడగలరు
*www.swetharka.org*

ఇట్లు
ఎల్ . రవి
గురుస్వామి
9347080055

శ్వేతార్కలో ప్రారంభమైన గణపతి మండల దీక్షలు

తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట శ్వేతార్కగణపతి క్షేత్రంలో 2019 శ్వేతార్కగణపతి నవరాత్రి ఉత్సవ ౼ కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా 41 రోజుల మండల దీక్షలు ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది భక్తులు దేవాలయానికి చేరుకొని గణపతి మండలదీక్ష ధారణ చేసి ఉన్నారు. ఈ సంవత్సరం భక్తులు ఇంకా గణపతి మాల తీసుకోవాలనుకునే వారు 21 రోజుల,16 రోజుల,11రోజుల గణపతి దీక్షలు తీసుకొనవచ్చును. మరిన్ని పూర్తి వివరాలకు www.swetharka.org వెబ్సైట్ ద్వారా గానీ లేదా దేవాలయ సమాచార కేంద్రంలో నియమాలు మరియు పూర్తి వివరాలు తెలుసుకోగలరు. సంప్రదించండి 9394810881,9347080055

శ్వేతార్కగణపతి కళ్ళు తెరచి రేపటికి 5 సంవత్సరాలు పూర్తి, దేవాలయంలో రేపు మహా అన్నదానం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామివారు తమ యొక్క దివ్య నేత్రములు తెరచినట్టుగా గోచరమై రేపటికి 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా…దేవాలయం లో విశేష అభిషేక, పూజ,హోమ,అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయం వ్యక్తంగా ప్రకాశితమై లక్షలాది మంది భక్తుల ఇంటి ఇలవేల్పు దైవంగా భాసిల్లుతున్న శ్రీ శ్వేతార్కమూలగణపతిస్వామివారు జూన్ 10 2014 మంగళవారం నాడు పాలతో అభిషేకం చేస్తున్న క్రమంలో తమ యొక్క దివ్య నేత్రాలు ఒకటి తర్వాత ఒకటి తెరిచి భక్తులను చూస్తున్నట్టుగా గోచరించింది. ఈ సందర్బంగా శ్రీస్వామివారికి రేపు ఉదయం 7గంటలకు ప్రత్యేక పంచామృత ద్వాదశ వర్ణ వివిధ నదీ సముద్ర జలములతో మరియు అమర్నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురాబడిన జలములతో అభిషేకం జరగనున్నది. ఆ తర్వాత విశేష అలంకరణ గణపతి పూజ,పుణ్యాహవాచనం,చతుర్వేద గణపతి సూక్త మహాగణపతి హోమం,హారతి,తీర్థప్రసాద వితరణ మరియు *మహా అన్నదాన* వితరణ జరగనున్నది. కావున యావన్మంది భక్త మహాశయులందరూ శ్రీస్వామివారి యొక్క దివ్య దర్శనము తప్పకుండా చేసుకొని శ్వేతార్కమూలగణపతిస్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. రేపు ఉదయం 7 గంటల నుంచి అన్ని పూజా కైంకర్యాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. భక్తులు కొబ్బరికాయ,పూలు,గజమాలలు,పూలదండలు,వస్త్రములు అందించువారు ఉదయం 7 గంటల లోపల దేవాలయంలో అందించగలరు. పూర్తి వివరాలకై దేవాలయ సమాచార కేంద్రం లో సంప్రదించగలరు

ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా పంపించగలరు.

శ్రీ స్వామివారి కళ్ళు తెరచిన వీడియో యూట్యూబ్ లో చూడ వచ్చును.