రైతుల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు ఈ నెల 17 సంకష్టహర చవితి రోజున జరుగును

*ఈ నెల 17 న*
*సంకట హర చవితి*

*శ్రీ స్వామి వారికి*
*సప్త వర్ణాభిషేకం*

*రైతుల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు*

స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం లో ఈ నెల 17 వ తేదీ గురువారం రోజున సంకష్టహరచతుర్థి పూజలు జరుపబడుచున్నవి.
ఇటీ వల కురిసిన వర్షాలు రైతులకు కల్పతరువుగా మారి మంచి ఆరోగ్యకరమైన పంటలు చేతి కి రావాలని కోరుతూ.. దేశానికి వెన్నెముక అయిన రైతు క్షేమాన్ని కోరుతూ
శ్రీ స్వామి వారికి వరుణ దేవుడి మూల మంత్రములతో
సప్త వర్ణాలతో అభిషేకము జరిపబడుచున్నది.

ఉరుములు,పిడుగులు రాకుండా ప్రజా మరియు పశు రక్షణ కలగాలని ఇంద్ర చాప వర్ణముతో ఈ అభిషేకము జరుపబడుచున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమము యందు పాల్గొని రైతు క్షేమాన్ని కొరుటకు రావలసిందిగా కోరుతున్నాము.

*ఆ రోజు పూజా సమయములు.*

ఉదయం 7 గంటలకు పాలాభిషేకం,
8 గంటలకు అలంకార దర్శనము,
9 గంటలకు గణేశ మూల మంత్రములచే నిత్య సహస్ర మోదక హోమము. 12 గంటల నుండి దూర ప్రదేశములు నుండి వచ్చు భక్తులకు అన్న దానం,

సాయంత్రం 5 గంటలకు దూర్వా హోమము,
6 గంటలకు సప్తవర్ణాభిషేకము. 7 గంటలకు శ్రీ స్వామి వారి ఉత్సవ విగ్రహములు ఊరేగింపు.

అనంతరం అర్చన, హారతి,తీర్థ ప్రసాదాల వితరణ

అనంతరం అన్నపూర్ణ భవన్ లో అన్నదానము జరుపబడును.

కావునభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన గలరు.

ఇట్లు

ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
మీడియా మిత్రులకు మనవి

లైవ్ ప్రోగ్రాం కొరకుసాయంత్రం 6 గంటల వరకు దేవాలయం లో ఉండాలి.6.30 కి లైవ్ స్టార్ట్ చేసుకోవచ్చును 7 వరకు.

గణపతి దీక్ష సామగ్రి

దీక్ష తీసుకొనే భక్తులు తెచ్చుకోవలసిన సామగ్రి.
(1)పసుపు,కుంకుమ
(2)2.1/4 కేజీ ల బియ్యం
(3)తమలపాకులు(21)
(4)పోకలు,కార్జురాలు(5,5)
(5)దీపారాధన సామగ్రి
(6)అగర్ బత్తిలు,పూలు,కర్పూరం,గరిక
(7)తెల్లని వస్త్రములు(లుంగీ లేదా తెల్ల ప్యాంటు కొత్తవి లేదా పాతవి)
(8)అరుద్రా రంగు ఉత్తరీయం
(9)1.1/4 మంచి నూనె
(10)1.1/4.పప్పు
(11)1.1/4.కాయగూరలు
(12)1.1/4.ఆకుకూరలు
(13)రుద్రాక్ష లేదా స్పటిక మాలలు.(108 గలది.ఒకటి.54 గలది.ఒకటి)
(14)100 గ్రాముల కొబ్బరి నూనె
(15)కొబ్బరికాయలు 2
(16)పంచామృతాలు
(17)మట్టి చిప్ప పెద్దది

(18) ఎండు కొబ్బరి 1

(19) విస్తారు/ప్లేట్మా మరియు గ్లాస్/పంచపాత్ర 1set

ఇట్లు.
శ్వేతార్కా దేవాలయ మేనేజ్మెంట్
కాజిపేట్.

వివరాలకు 9347080055,9394810881 లో సంప్రదించగలరు

నవరాత్రుల సందర్బంగా కార్యకర్తల ద్వితీయ సమావేశ తేదీ22-08-2019.గురువారం

*కార్యకర్తలకు, భక్తులకు సమావేశ ఆహ్వానము*

*22.8.2019 గురువారం*
రోజున ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణములో *కార్యకర్తల ద్వితీయ సమావేశమును*
ఏర్పాటు చేయబడింది.
_*~*సమావేశం10గంటలకు ప్రారంభమై 11గంటల వరకు పూర్తి అగును…….. గమనించగలరు**~_
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉదయం 9.30 ని.ల లోపున దేవాలయ ప్రాంగణంలో కి వచ్చి ఉండా లి.

👉 మొన్న జరిగిన సమావేశమునకు రాని వారంతా తప్పక ఈ సమావేశమునకు హాజరు కావాలి. మరియు
*కార్యకర్తలందరూ కూడా తప్పక పాల్గొనాలి.*

👉ఈనాటి సమావేశమునకు
శ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో సేవ చేసే దాదాపు 30మంది మహిళాసేవకులు కూడా పాల్గొంటున్నారు
👉కాజీపేటకు దూరంలో ఉన్నవారు అనగా హైదరాబాద్,నల్గొండ,
ఖమ్మం,మంచిర్యాల,కరీంనగర్ లాంటి దూరం లో ఉన్నవారు కూడా వీలు కలిపించుకొని తప్పక ఈ సమావేశమునకు రావాలి.

👉 ఈ రోజున వచ్చే వారికి
*బ్యాడ్జ్ కొరకు ఫోటో తీసుకోవడం జరుగుతుంది.*
ఈ రోజు మాత్రమే ఫోటో తీయబడును. తదుపరి అవకాశం ఉండదు.

👉ఈ సమావేశములో కార్యకర్తలకు సేవలు కేటాయించబడుతాయి

🌴కార్యకర్తలకు పగలు భోజన ప్రసాదం ఏర్పాటు చేయబడుతుంది.

ఇట్లు
మేనేజ్మెంట్
శ్వేతార్కదేవాలయం
కాజీపేట

శ్వేతార్కాలో నవరాత్రులకు సేవ చేయుటకు కావలసినటువంటి సేవకులు

*స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవ పూజలలో సేవకు 20 రోజులకు కావలసినటువంటి కార్యకర్తలు*

అభిషేకమునకు ఎనిమిది మంది కార్యకర్తలు

మంటపపూజకు ఇద్దరు కార్యకర్తలు

హోమమునకు ఇద్దరు కార్యకర్తలు

సాయంత్రం పూజకు నలుగురు కార్యకర్తలు

సహస్రదీపాలంకరణ సేవకు నలుగురు కార్యకర్తలు

ఊరేగింపు సేవకు నలుగురు కార్యకర్తలు

ఊరేగింపు రథమును నడుపుటకు ఒక డ్రైవర్ అవసరము

విఐపి రిసీవింగ్ కొరకు నలుగురు కార్యకర్తలు

వంట ఏర్పాట్లకు ఇద్దరు కార్యకర్తలు

అన్నదానమునకు ఎనిమిది మంది కార్యకర్తలు

అయ్యా గారి వద్ద పర్సనల్ గా ఉండుటకు ఇద్దరు కార్యకర్తలు

ఫోటో మేకింగ్ ముగ్గురు కార్యకర్తలు

స్టోర్ ఇంచార్జి ఒక కార్యకర్త

ప్రోగ్రామర్ గా ఇద్దరు కార్యకర్తలు

లైవ్ ప్రోగ్రాం కార్యకర్తలుగా ఇద్దరు కార్యకర్తలు

దేవాలయ అలంకారము నకు నలుగురు కార్యకర్తలు

స్టార్స్ నిర్వహణకు ఇద్దరు కార్యకర్తలు

బుక్ స్టాల్ నిర్వహణకు ఇద్దరు కార్యకర్తలు

కౌంటర్లో సహాయము అందించుటకు ఇద్దరు కార్యకర్తలు

ఎలక్ట్రికల్ కి సహకరించు టకు ఇద్దరు కార్యకర్తలు

అవసరంగా ఉన్నది

ఉత్సాహం కలిగినవారు 9347080055 నకు వాట్సప్ ద్వారా మీ అడ్రస్ మీ ఫోటో మరియు వివరాలు పోస్ట్ చేయగలరు.

మాఘ స్నానం చేస్తున్నపుడు పాటించాల్సిన శ్లోకం

మాఘ పౌర్ణమి సముద్ర / నది స్నానం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం.

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ

స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ
అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి.
అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ 

ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. అని అర్థము.

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి.

మహా మాఘీ. మాఘ పౌర్ణమి

సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ . ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము .

తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది .

పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసం లో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసం లో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమల లో చేసే దేవతారాధన  మరింత శ్రేస్టమయినది . ” మహామాఘి , అలభ్యయోగం ” అని ఈ మాఘ పూర్ణిమను అంటారు . అంటే ఈ రొజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట .

వైశాఖీ కార్తీకీ మాఘీ ! తిధయోతీవ పూజిత: !!

స్నానదాన విహీనాస్తా ! ననేయా: పాండునందన !! .

అని చెప్పబడింది . స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు.

స్నానము :
యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. . జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ… మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన

ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే… మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి… దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. ఈ మాసంలో వస్త్రాలూ గొడుగులూ నువ్వులూ దానంచేస్తే విశేషఫలం లభిస్తుంది.

సూర్యోదయానికి ముందే…

పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ కిరణాలు నీటిపై పడటం వల్ల ఆ నీరు చాలా శక్తిమంతమవుతుందట. అందుకే, జనవరి 20 నుంచి మార్చి 30 వరకూ సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలామంచివని చెబుతారు.

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి. మాఘంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడు చేసే స్నానమే అత్యుత్తమమైనది. సూర్యోదయం తరవాత చేసే స్నానం నిష్ఫలమైనది. మాఘమాసమంతా నదీస్నానం చేయలేనివాళ్లు కనీసం మూడురోజులైనా చేయాలట. ఈనెలలో అమావాస్యనాడు ప్రయాగలో స్నానంచేస్తే సమస్త పాపాల నుంచీ విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది.

సనాతనధర్మంలో స్నానానికి ఎంతో విశిష్టస్థానం ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్ధిచేసి, మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ స్నానాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంశ, అభ్యంగన, క్రియా అని ఆరు రకాలు. ఇందులో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను కోరి చేసే స్నానాలనూ; యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలనూ కామ్యస్నానాలుగా చెబుతారు. ఇలాంటి స్నానం ప్రవాహజలాల్లో… ముఖ్యంగా 

సాగరసంగమ ప్రదేశాల్లోనూ చేస్తే ఇంకా మంచిది.