13.11.2019నాడు కోటి దీపోత్సవం వేడుకలో శ్వేతార్క గణపతి స్వామివారు

వైభవోపేతంగా శ్వేతార్కలో కార్తీక పూర్ణమి వేడుకలు

బ్రహ్మపుత్ర నది పుష్కరాల జలం తో శ్వేతార్క గణపతి కి అభిషేకంకార్తీకమాసోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగ లింగేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి ప్రత్యేకంగా కార్తీక పూజలు జరుబడినవి. ఉదయం 6 గంటలకు జరిపిన పంచామృత అభిషేకములో కార్యకర్త శనిగారపు రాజమోహన్ చే అజ్మీర్ నుండి తెప్పించ బడిన బ్రహ్మపుత్ర నది పుష్కరాల జలం తో గణపతి కి మరియు శివుడికి పుషారాలు అవితున్నందున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరుపబడినది. ముందుగా పుష్కర జల పాత్రను తీసుకొని భక్తులుకార్య కర్తలు కలిసి మంగళ హారతులతో తో మంగళ వాయిద్యాలతో ఆలయము చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం అభిషేకం చేయడం జరిగింది.అనంతరం ఉదయం 9 గంటలకు అర్చన హారతి తీర్థప్రసాద వితరణ, 11గంటలకు రుద్రహోమం మరియు శివకేశవ మూలమంత్రంలచే హవనం జరిపబడింది. అనంతరం
భక్తులు శివుని దగ్గర కార్తీక దీపారాధనలు చేశారు. తులసీ అమ్మవారి దగ్గర దామోదర వ్రతాన్ని జరిపారు. కార్తీక పూర్ణిమ ను పురస్కరించుకుని రామాలయం లో విష్ణు సహస్రనామ పారాయణలు. మరియు శ్రీవెంకటేశ్వర దేవాలయంలో కార్తీక దామోదర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐనవోలు రాధా కృష్ణ శర్మ ఆధ్వర్యంలో శివునికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వదళ పూజలు జరుప బడినవి. ఈ రోజున శివకేశవ ఆరాధన చేస్తే మహా పుణ్యమని, భక్తులకు తెలపడం జరిగింది. శ్వేతార్క గణపతి దేవాలయం లో కొలువై ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. వైష్ణవ ఆరాధకులు టంఠం దయాకర స్వామి. భక్తులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించగా సాయి కృష్ణ శర్మ పూజలు జరిపించారు. అనంతరం భక్తులు విశేషంగా లక్ష వత్తుల కార్తీక దీపాలను వెలిగించారు. వ్రతం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ మరియు మహామంగళహారతి ఇవ్వడం జరిగింది. రాత్రి 7 గంటలకు జరిగిన ఆకాశ దీప పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయానికి చెందిన గోపికాటీం కార్యకర్తలు పాల్గొని దీపోత్సవం నిర్వహించారు. ఇందులో లత శ్రీ ,ఉమారాణి, హరిపురంసునంద ,శీనమ్మ,పోషాలా శ్రీలత,లక్ష్మీ కల్పన,సుజాత,సవిత,సాయి కుమారి, రమాదేవి,ఉమాదేవి,సులోచన,శకుంతల,తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా దేవాలయంలో భక్తులు దీపాలతో పాటుగా కాకర వోత్తులు వెలిగించి. జ్వాలాతోరణం జరిపారు. ఈ రోజు పూజా కార్యక్రమంలో మాజీ డి సి సి బ్యాంక్ చైర్మన్ సతీమణి శ్రీమతి జంగా సుజాత గారు పూజల్లో పాల్గొన్నారుఈ రోజు పూజా కార్యక్రమానికి పూర్వ మెదక్ జిల్లా జడ్జి సాయి రమాదేవి, మరియు ప్రిన్సిపాల్ జడ్జ్ శ్రీనివాస రావు పాల్గొన్నారు
ఇట్లు
అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి దేవాలయ వ్యవస్థాపకులు

కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వర యాత్ర

*కార్తీక మాస సందర్భంగా కాళేశ్వర యాత్ర*

*రేపటి నుంచి బుకింగ్ ప్రారంభం*

కార్తీకమాస సందర్భంగా కాళేశ్వర యాత్ర రావాలనుకునేవారు రేపటి నుంచి పూర్తి రుసుమును (850₹) దేవాలయంలో చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.
లేదా 9347080055 అనే నెంబర్ లో గూగుల్ పే ద్వారా పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. 22-11-2019 రోజు వరకు కు పైసలు కట్టి ఉండాలి
*24 నవంబర్ 2019 ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు దేవాలయం నుండి బస్సు బయలుదేరును.*
ముందుగా పూర్తి రుసుము చెల్లించిన వారికి ముందు వరుస నుంచి సీటు ఇవ్వబడుతుంది.

కాలేశ్వరం లో
నదీ స్థానము
శివుని దర్శనం
ధాత్రి నారాయణ పూజ దీప దానములు
కార్తీక పురాణ పఠనం కార్తీక వనభోజనము ఇత్యాది పూజలు జరుగును.

అక్కడ జరుపబడే పూజలకు సంబంధించిన అన్ని పూజాద్రవ్యములు దేవాలయంలో తక్కువ ధరల్లో లభించును

ఆ రోజున అన్నదానం చేయదలచిన వారు ముందుగా దేవాలయంలో సంప్రదించగలరు

ఇట్లు
దేవాలయ మేనేజిమెంట్ శ్వేతార్కమూల గణపతి దేవాలయం
కాజీపేట

అనంత వచనం

కోపమనేది మనసును దూరం చేస్తుంది. మనిషిని కాదు
*అనంతవచనం*

రేపు శ్వేతార్కాలో కర్తవీర్యార్జున పూజలు విశిష్టత

రేపు(3.11.2019 ఆదివారంనాడు) శ్వేతార్క గణపతి క్షేత్రంలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక కర్తవీర్యార్జున పూజ,హోమం జరుగును. భక్తులు తెచ్చుకొను సామగ్రి — తులసి మాల,పూలమాల,కొబ్బరికాయ, కర్పూరం,పూలు,అగరుబత్తి తీసుకొని 9.30 లోపు దేవాలయానికి రాగలరు.9394810881

ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్

తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే

ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.

ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
పరసురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.
కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము.

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు.శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః
రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్
సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః
అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.
కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి
కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః
సహస్రబాహుం సాహస్రం స రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత
కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ
సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి మహావీర్యార్జునమ్ కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం
సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్
శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్
ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే
కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్.

తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.
మన మనసు లలో ఉన్న దిగులు హరించి స్వస్థత పొందడానికి ఇది అత్యావశ్యకం సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కార్తవీర్యార్జున హోమం తత్ దశాంశం తర్పణ మున్నగునవి శాస్త్ర ప్రమాణం గా ఆచరించడం మంచిది.

సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సన్తు

కార్తవీర్యార్జున ద్వాదశనామస్తోత్రమ్ స్తోత్రం

అప్పు ఇచ్చి తిరిగిరాదు అనుకున్న సొమ్ము , పోయాయి అనుకున్న వస్తువులు, …… ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు, వంటివి మనం తిరిగి పొందడానికి , స్థల సంబంధిత వివాదాలు , ఆస్తితగాదాలు నివారణకు చదువవలిసిన స్తోత్రం

కనీసం 28 సార్లు మండలం రోజులు చదవడం వలన ప్రయోజనం ఉంటుంది

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.
ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.
చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.🌻
భోజనం తర్వాత అస్సలు చేయకూడని పనులు🥀👍🥀భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే… డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది.బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తిండి పూర్తిగా తగ్గించేయడం, గంటల తరబడి వ్యాయామం చేయడం లాంటివి ఎన్నో చేస్తారు. అయితే… ఎన్ని చేసినా చాలమంది బరువు మాత్రం తగ్గరు. దానికి కారణం మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తే… బరువు తగ్గడం కష్టమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనమూ చూద్దాం..1. నిద్ర… కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఓ చిన్న కునుకు వేస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. నిద్ర కూడా అంతే త్వరగా పడుతుంది. దీంతో చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే.. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అరగకపోవడంతోపాటు… ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్యాలరీలు కరగడం లాంటివి కూడా జరగవని చెబుతున్నారు.2.చల్లటి నీరు… చాలా మంది భోజనం మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి భోజనం చేసిన వెంటనే మంచినీరు తాగుతారు. ఈ రెండు అలవాట్లు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక చల్లటి నీరు తాగడం మాత్రం ఇంకా ప్రమాదమంటున్నారు. భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే… డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది. భోజనం పూర్తైన 15 నిమిషాల తర్వాత మంచినీరు తాగడం ఉత్తమం.3.ఎక్కువ సేపు కూర్చోవడం… కొందరికో అలవాటు ఉంటుంది. భోజనం పూర్తైన తర్వాత కూడా తిన్న ప్లేటు ముందు నుంచి కదలరు. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయడం పూర్తవ్వగానే అక్కడి నుంచి లేవాలని చెబుతున్నారు. అలానే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందటున్నారు. అదేవిధంగా భోజనం కూడా ఎక్కువ సేపు తినడం మంచిదికాదని చెబుతున్నారు.4. స్వీట్లు తినడం… భోజనం చేసిన తర్వాత చాలా మందికి స్వీట్, ఐస్ క్రీమ్, కేక్ లాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే… ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. వీటిలో కాలరీలు ఎక్కువ ఉంటాయి. దాంతో కొవ్వు కూడా బాగా పేరుకుపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.5.భారీ కసరత్తులు… బరువు త్వరగా తగ్గిపోవాలనే ఆత్రుతలో కొందరు తినగానే భారీ కసరత్తులు చేయడం మొదలుపెడతారు. వ్యాయామం చేయడం మంచిదే కానీ… తినగానే కసరత్తులు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. ఈ ఐదు నియమాలను గుర్తుపెట్టుకొని…వీటిని ఫాలో అయిపోతే..బరువు తగ్గడం చాలా సులభం అవుతుందని చెబుతున్నారు🌹🧖🌹

అరుదుగా వచ్చే శనిత్రయోదశి

ఈనెల 26వ తారీఖున *శని త్రయోదశి, ధన త్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి* అదే రోజున *మాసశివరాత్రి* మరియు నరకచతుర్ది కూడా అవుతున్నది. ఇటువంటి మహత్తరమైన రోజు చాలా అరుదుగా వస్తుంది.
ధన త్రయోదశి రోజు మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవుతాయని పెద్దలు అంటుంటారు. ఇటువంటి మహత్తరమైన రోజున శని త్రయోదశి సంభవించ డం చాలా అరుదు. ఈ రోజున శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అనేక మంచి ఫలితాన్ని పొందుతారు. కావున భక్తులు పై విషయమును గమనించగలరు.
*ఏల్నాటి శని గల
వృశ్చిక రాశి వారు
(విశాఖ 4వ పాదం
అనూరాధ 1 2 3 4 పాదాలు
జ్యేష్ట 1 2 3 4 పాదాలు)
ధనుస్సు రాశి వారు
(మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం)

మకర రాశి వారు
(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు)
*అష్టమ శని*. గల
వృషభ రాశి వారు
(కృత్తిక 2 3 4 పాదాలు
రోహిణి 1 2 3 4 పాదాలు
మృగశిర 1 2 పాదాలు) *అర్ధాష్టమ శని* గల
కన్యా రాశి వారు
(ఉత్తర 2 3 4 పాదాలు
హస్త 1 2 3 4 పాదాలు
చిత్త 1 2 పాదాలు)
పై రాశులు వారు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు.స్వయంభు శ్రీ శ్వేతార్క గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శనీశ్వర దేవాలయం లో రేపు ప్రత్యేక పూజలు జరుప బడుచున్నవి ఉదయం 10 గంటలకు శనీశ్వరునికి అభిషేకం అర్చన హారతి తీర్థప్రసాద వితరణ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శని పూజ లో పాల్గొనే భక్తులు ఉదయం 9 గంటల వరకు దేవాలయమునకు వచ్చి ఉండాలి. లేదా దేవాలయ ఫోన్ నెంబర్ 93 47080055 అనే నెంబర్లో సంప్రదించాలి
భక్తుల సౌకర్యార్థం పూజాద్రవ్యములు దేవాలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఇట్లు
అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

త్వరలో కాశీ యాత్ర

*కాశీ యాత్ర*

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం…. అని పురాణాల్లో చెప్పబడింది.
…..,………….,…

జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా కాశి యాత్ర చేయాలని ఉంది,
కాశి క్షేత్రం లో నివాసం చేసి రావాలని పెద్దలు చెబుతారు.
…………..,……….

*డిసెంబర్ 12వ తేదీ న కాశీ యాత్ర ప్రారంభం అవుతున్నది.*

కాశీ , అలహాబాద్, గయ, బుద్ధగయ, నైమిశారణ్యం, వింధ్యాచలం, అయోధ్య, సీతామడి, ఇత్యాది పుణ్యక్షేత్రాలతో కాశీ యాత్ర చేయడం జరుగుతుంది.

కాశి యాత్ర కు రాదలచిన వారు *ఈనెల 25వ తేదీ* లోపున తమ పేర్లను వ్రాయించు కోవాలి

రైలు మరియు బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది

ముందుగా ఎవరు రుసుము చెల్లిస్తే వారికి ముందు సీటు కేటాయించడం జరుగుతుంది.

మనిషి ఒక్కంటికి 11,800/. రూపాయలు
అగును

ఒక పూట భోజనము ఒక పూట ఫలహారం ఇవ్వడం జరుగుతుంది

సత్రంలో కిరాయిలు ఎవరిది వారే భరించుకోవాలి

11 రోజులు ప్రయాణం

రైలులో ఏసీ టు టైర్ లో ప్రయాణం చేయబడుతుంది.

పూర్తి వివరాలకై 7330436001,8686662329. నెంబర్లలో సంప్రదించగలరు