వేడుకగా జరిగిన గురుపౌర్ణమి పూజలు

శ్వేతార్కలో వైభవంగా జరిగిన గురుపూర్ణిమ వేడుకలు

ఈ రోజు శ్వేతార్క గణపతి దేవాలయం భక్తులతో ఉదయం నుండి కిక్కిరిసిపోయింది. ఈ రోజు మంగళవారం,పూర్ణిమ,గురుపూర్ణిమ కావడంతో మరియు దేవాలయం లో దత్తాత్రేయ దేవాలయం,షిర్డీ సాయిబాబా దేవాలయం,సత్యనారాయణ దేవాలయం ఉండటం మరియు మంగళవారం గణపతి కి పూజలు కావడం తో భక్తుల సంఖ్య అధికమయ్యింది.
మరియు ఈ రోజున చంద్ర గ్రహణమ్ కావడంతో పగలు 3గంటలకే దేవాలయం మూసివేస్తారనడం తో భక్తులు విరివిగా వచ్చారు.
ఉదయం 6గంటలకు శ్వేతార్క గణపతికి సముద్ర జలం తో అభిషేకం జరిగింది. ఐనవోలు రాధాకృష్ణ శర్మ,సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబాకు,దత్తాత్రేయకు పాలాభిషేకం జరిగింది.
అనంతరం అలంకారం,హారతులు జరుపబడినవి. మహార్చనలో సాయికుమారి ఆలపించిన సాయిబాబా సంకీర్తనలు అలరించాయి. కార్యకర్తలు సులోచన శ్రీలత విజయకోటి బేబీ శకుంతల రమాదేవి రాజమోహన్ విజేందర్ పాల్గొన్నారు
అనంతరం భక్తులకు అన్నదానం జరుపబడింది.
దేవాలయ సిబ్బంది మేనేజర్ రవి సుధీర్ శ్రీనివాస్ మనిదీప్ దినేష్ గుణవతి ప్రదీప్ తదితరులు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూసారు.

చంద్రగ్రహణం సందర్బంగా ఈ రోజు సాయంత్రం 3గంటలకు దేవాలయమును మూసివేయడం జరిగింది.
తరిగి రేపు ఉదయం 6గంటలకు దేవాలయము తెరచి సంప్రోక్షన చేసి ధూప దీప నైవేద్యములు ఇచ్చి భక్తులకు దర్శనమును కలిపించ బడుతుంది. ఉదయం 8గంటలనుండి భక్తులకు అర్చనలు జరుప బడుతాయి

వ్రతం చేయు భక్తులు గ్రహణం వేళా పట్టించాల్సిన నియమాలు

౾౾ భక్తులు నిత్యా మంగళవారం ప్రదోషకాల (సాయంకాలము) పూజకు వచ్చు వారు మధ్యాహ్నం 12 గంటల పూజలో తమకు సూచించిన ప్రదక్షిణలు, వస్తువులతో మధ్యాహ్నం పూజలోనే పాల్గొని మీయొక్క వ్రతాన్ని భంగం కాకుండా పాల్గొనగలరు.

౾౾ గ్రహణం కారణంగా వ్రతం చేయు భక్తులు హరిద్రా గణపతి పై తప్పనిసరిగా గరిక పోచ వుంచాలి.

౾౾ గ్రహణం వేళా వ్రతం సమయంలో ఉపదేశించిన మంత్రమును పునశ్చరణ చేసుకోవాలి. ( గ్రహణం పట్టు స్నానం చేసి కనిసంగా 108 మార్లు జపం చేయాలి)

16న శ్వేతార్క గణపతి దేవాలయముల క్షేత్రం మూసివేత

2019 జులై 16 మంగళవారం రోజున చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా తెలంగాణ గణపతిగా భాసిల్లుతోన్న వరంగల్ అర్బన్ కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూల గణపతి దేవలయముల క్షేత్రం సాయంత్రం 4గంటల నుండి 17 బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, శుద్ధి పుణ్యాహవచనం, దేవతామూర్తుల నిత్య సేవల అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నటు క్షేత్ర వ్యవస్థాపకుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారు ప్రకటన చేశారు…

ఈరోజు లక్ష్మీకేశవ యోగం

*భక్తులకు మనవి*

ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి శుక్రవారం గా రావడం విశేషం

ఈ రోజు
*లక్మి కేశవ యోగం* కావున ఈ రోజున ఉపవాసం తో సాయంత్రం ప్రదోషకాల సమయమందు

లక్మినారాయణ దేవాలయంలో

ఆవునెయ్యితో 11దీపాలు వెలిగించి.కనకదారస్తోత్రం,విష్ణుసహస్రనామాపారాయణ చేసిన మంచిది.

వ్యాపారస్తులు తప్పక మీ గృహీమణులతో చేయించ గలరు

ఐ.అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

ఆషాఢంలో అష్టవినాయకయాత్ర

ఎవరైనా మాతో వస్తారా..?

సుమారుగా 7 లేదా 8 రోజులు పట్టవచ్చును

మనిషి ఒక్కంటికి సుమారు 10,200/-రూ:లుకావొచ్చును.

మంచి Ac బస్ లో ప్రయాణం

తుల్జాభావాని,పండరీపురం,అష్టవినాయక,భీమశంకర్,త్రయంబకం,షిర్డీ….లాంటి
*13 చోట్లకు వెళ్లి రావడం జరుగుతుంది*

ఒకపూట భోజనం,ఒకపూట టిఫ్ఫిన్
………………….

మీకు రావలనిపిస్తే..
మీరెందరు వస్తారో ముందుగానే చెప్పండి

*9347080055* కు ఫోన్ చేసి 2రోజుల్లో చెపితే మీకు సీటు రిజర్వ్ చేయవచ్చును.

ముందుగా పూర్తి డబ్బులు కట్టిన వారికి బస్ లో ముందు సీట్ ఇవ్వబడుతుంది.

ఇట్లు
ఐ.అనంత మల్లయ్య శర్మ
………………………………..
*ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితోపంచుకొందాం,*

…………………………

కనులు పోతే
భగవంతుణ్ణి చూడలేం
కాళ్ళు పోతే
యాత్రలు చేయలేం
చేతులు పోతే
భజన చేయలేం
నోరు పోతే
హరికీర్తన చేయలేం

ఈ నాటి మంగళవారం నరరూపగణపతి (అనగా గజమొఖం లేని గణపతి) దర్శించుకొన్నాం

నాటి ఈ మంగళవారం రోజునకు ఒక విశేషం…మేము .. ఈ రోజున*నరరూపగణపతి* ని (అనగా గజమొఖం లేని గణపతి) దర్శించుకొన్నాంఈ క్షేత్రాని కి ఒక విశేషం ఉంది. ఏమిటంటే… ఇక్కడ శ్రీ రామచంద్రుడు తన తండ్రి కి పిండములతో తర్పణము చేసిన చోటు. వాటి గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు శివలింగములను ప్రతిష్టించాడు

వైద్యేశ్వరుణ్ణి దర్శనం రోగాలను రాకుండా చేస్తుంది.

ఈ రోజు మంగళవారం అనగా కుజవారం కదా…

ఈ రోజు కుజదేవాలయంలో దీపాలువెలిగించి
వైద్యేశ్వరుణ్ణి దర్శించాం

ఇక్కడి దేవాలయ దర్శనం రోగాలను రాకుండా …
వచ్చి ఉన్న రోగాలు ఎక్కువ కాకుండా చేస్తుంది.

విజ్ఞరాజం భజే పాట చిత్రీకరణ

శ్వేతార్కా దేవాలయంలో సప్తస్వరి మ్యూజిక్ అకాడమీ హన్మకొండ వారి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నరాజం భజే కీర్తన అనే పాట చిత్రీకరణ జరిగినది.ఈ పాట చిత్రీకరణలో భక్తులు మరియు కార్యకర్తలు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఇట్లు
దేవాలయ మేనేజర్
ఎల్.రవి

భౌమ అమావాస్య నగదండం పూజలు

భౌమఅమావాస్య సందర్బంగా. ఈరోజు శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక నాగదండ పూజలు

జేష్ట అమావాస్య మంగళవారం రోజుగా కలసిరావడం విశేషంగా భావిస్తు…ఈ రోజున శ్రీ శ్వేతార్కగణపతి స్వామి వారి సన్నిధిలో భౌమ అమావాస్య పూజలను ప్రత్యేకంగా జరుపబదుచున్నవి.

భౌమ అమావాస్య అనగా మంగళవారం నాటి రోజున అమావాస్య కలసి వస్తే దానిని భౌమ అమావాస్య అని అంటారు. ఈ రోజున విశేషించి తెల్ల జిల్లేడు పూవులతో మరియు ఎర్రని మందార పువ్వులతో గణపతికిఆయుధమైన నాగదండమును పూజించిన, గణపతికి ప్రీతికరంగా 16 ప్రదక్షిణాలు చేసినా కోరిన కోరికలు నెరవేరుతాయి.

విశేషించి శ్వేతార్కగణపతి స్వామి వారి ఆభరణమైన నాగదండమునకు విశేష పూజలు జరిపిన సంతాన దోషాలు,రాహుకేతు సర్పదోషాలు పోతాయి.
అలాంటి వారు ఈ రోజున ప్రదోషకాలములో నాగ దండమును ఆరాధించినచో మంచిదని తెలుస్తుంది.

ఈ సందర్బంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు దేవాలయములో గల నాగదండమునకు ప్రత్యేక అలంకరణ , హారతి భజనలతో విశేష పూజా కైంకర్యాలు జరగనున్నవి.భక్తులు కొబ్బరికాయ, పూలు(తెలుపు,ఎరుపు), పూలమాలలు,శర్కర, బెల్లం తీసుకొనిరగలరు..గోత్రనామాలకు సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.

కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని,నాగదండమును దర్శనం చేసుకొని తరించగలరు.

ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app

ఇట్లు
దేవాలయ పరిపాలన నిర్వాహకులు

*ఐనవోలు సాయి కృష్ణ శర్మ*

తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి:

ఉదకం చందనం చక్రమ్‌ శంఖంచ తులసీదళమ్‌॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్‌॥
సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే

అంటే
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం – ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే ‘తీర్థం’ అంటారు.

అలాగే
భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌నరః
ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతేమమ॥
సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం
సర్వరోగాది శమనం సర్వపాప హరంభవేత్‌॥

అంటే
భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని , పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు.

భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు ‘అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి.

పరమాణుసమం తీర్థం
మహాపాతకనాశనం
తదైవాష్టగుణం పాపం
తద్భూమౌ పతితాయాది॥

అన్నారు .. అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలని సైతం నాశనం చెయ్యగలది. అటువంటి తీర్ధం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట.

వస్త్ర చతుర్గణీకృత్య పాణౌ పాణిం నిధామయ
పవిత్రం విష్ణు పాదామ్ము త్రిః పిభేద్బిన్దు వర్జితమ్‌॥

ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడిచేతిని పైన చెప్పిన విధంగా శంఖువు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చెయ్యకూడదు. అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి.

తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచం నొక్కిపట్టి ఉంచుతాం. అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కన్పిస్తుంది. శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్ధం పోసినట్టే అవుతుంది కదా !

అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది. అదేంటంటే. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది , అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ అవన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్ధం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఇంత విషయం ఉంది !