భగవంతుని సన్నిధిలో కార్యకర్తగా సేవ చేయుటకు ఆహ్వానం

ఈనెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 12 వ తేదీ వరకు జరుపబడు *శ్రీశ్వేతార్క గణపతి స్వామి వారి* నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ పూజల రోజులలో… మీరు కార్యకర్తగా సేవను అందించా దలిచారా..
అయితే…
మీరు మీ సేవలను అందించు వివరములను సమాచార కేంద్రం లో తెలుప కోరుచున్నాము.

అనగా ఈ 16 రోజులు మీరు ఏ సమయం నుండి ఏ సమయం వరకు సేవకు రాగలరో తెలపాలి.

మీ పేరు
మీ వాట్సాప్ నెంబర్
మీ ఇంటి అడ్రస్
మీరు గుడికి వచ్చే సమయం

ఇత్యాదివి
రిజిస్టర్లో రాయగలరు.

ఇట్లు
అయ్యగారు శ్వేతార్కగణపతి దేవాలయం
కాజీపేట
506003
5.8.19

గణపతిదీక్ష -మాలధారణ చేయువారికి సూచన

గణపతిదీక్ష ..మాలధారణ చేయువారు చాలామంది మాకు ఫోన్ చేయు చున్నారు
*ముఖ్యముగా గమనింప దగిన విషయము ఏమనగా*
మాలధారణ చేయువారు కాజీపేట కే రావలసిన అవసరము లేదు. మీరు మీ సమీపంలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయంనకు వెళ్లి అక్కడి పూజారి తో (రుద్రాక్ష,స్పటిక)మాలలు వేయించుకొన వచ్చును.

మరియు అక్కడి పూజారి చేతనే మాలవిసర్జన-దీక్షా విరమణ చేసుకొనవచ్చును.

మాలలకు అభిషేకము చేయించుకొని సిద్ధి బుద్ధి సహిత హరిద్రాగణపతి కి పూజ చేసి దీక్ష వస్త్రమును ధరించి మాలలు వేసుకోవలెను.
పూర్తి వివరాలకై దేవాలయ వెబ్సైట్లో నియమాలు చూడగలరు
*www.swetharka.org*

ఇట్లు
ఎల్ . రవి
గురుస్వామి
9347080055

శ్వేతార్కలో ప్రారంభమైన గణపతి మండల దీక్షలు

తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట శ్వేతార్కగణపతి క్షేత్రంలో 2019 శ్వేతార్కగణపతి నవరాత్రి ఉత్సవ ౼ కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా 41 రోజుల మండల దీక్షలు ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది భక్తులు దేవాలయానికి చేరుకొని గణపతి మండలదీక్ష ధారణ చేసి ఉన్నారు. ఈ సంవత్సరం భక్తులు ఇంకా గణపతి మాల తీసుకోవాలనుకునే వారు 21 రోజుల,16 రోజుల,11రోజుల గణపతి దీక్షలు తీసుకొనవచ్చును. మరిన్ని పూర్తి వివరాలకు www.swetharka.org వెబ్సైట్ ద్వారా గానీ లేదా దేవాలయ సమాచార కేంద్రంలో నియమాలు మరియు పూర్తి వివరాలు తెలుసుకోగలరు. సంప్రదించండి 9394810881,9347080055