నేటి అనంతవచనం

వయస్సులో ఉన్నప్పుడే నిరంతర శ్రమ చేస్తూ డబ్బు,పేరును బాగా సంపాదించాలి. వయస్సు దాటుతున్నప్పుడు దానాలు,ధర్మాలు,తీర్థ యాత్రలు చేయాలి. వయస్సు మీరిందని అనుకున్నప్పుడు దేవాలయాలలో సేవ చేయాలి. కానీ ఎప్పుడైనా సరే వీలును బట్టి పైవన్ని చేస్తూ.. మాతాపితృ భక్తిని,గురుభక్తిని, దైవభక్తిని,దేశభక్తి ని తప్పక కలిగి ఉండాలి.

*అనంతవచనం*

నేటి అనంతవచనం

కష్టకాలంలో భగవంతున్ని దూషిస్తున్నావంటే..ఇష్టకాలంలో దేవుడున్నాడనే కదా దాని అర్థం. 

మంచి చెడుల మాయయే ఈ జీవితం

*అనంత వచనం*

నేటి అనంతవచనం

అనుక్షణం కోపానికి వచ్చేవారు ప్రతిసారి అపజయాన్నే పొందుతారు. లేదా బానిసై పోతారు. చివరికి సమాజం లో అవహేళణకు గురవుతారు.కోపం అన్ని విషయాలకూ అనర్థదాయకమే అవుతుంది.

*అనంతవచనం*

​తప్పని తెలిసినప్పుడు సరిదిద్దుకో..అంతేగాని తప్పుకు మరో తప్పును చేస్తూ కప్పిపుచ్చకు. అలా చేస్తే..నీవు కూర్చున్న చెట్టుకొమ్మను నీవే నరుక్కొంటున్నట్టుగా ఉంటుంది. 

నిజం చెప్పలేని తప్పు ఎప్పుడైనా తప్పటడుగులే వేయిస్తుంది.

*అనంతవచనం*

అమ్మా నాన్న లకు ధైర్యంగా ఉంటూ ప్రేమిస్తూ ఉండాలి.అత్తామామలయందు గౌరవంగా ఉండాలి. అన్నల యందు తోడుగా ఉండాలి,తమ్ములయందు బాధ్యతగా ఉండాలి.అక్కాబావలయందు మన్ననతో ఉండాలి. చెల్లె బావలయందు అన్యోన్యంగా ఉండాలి. భార్యభర్తలు ఇంకొకరికి ఆదర్శవంతులుగా ఉండాలి. అమ్మానాన్నలు పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉండాలి. గురుభక్తి,దైవబలం కలిగి ఉన్నవారు… అందరిలోనూ మంచివారై ఉంటారు. “”””””””””‘””'”””””””””””””””””””””””””””బాంధవ్యాలు పెంచుకొంటూ పోతుంటే బంధుత్వాలు,స్నేహాలు పెరుగుతూ పోతుంటాయి.*అనంతవచనం*

జీవితం లో కొన్ని మలుపులు వస్తుంటాయి.అలాంటప్పుడు.మంచినిర్ణయాలు తీసుకొంటారు.ఆ తీ సుకొనే నిర్ణయాలు సరైనవిగా ఉండాలి.మళ్లీమళ్లీ మార్చేవిగా ఉండరాదు.అప్పుడే జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశం ఉంటుంది.

అనంత వచనం 15.10.2018

తప్పని తెలిసినప్పుడు సరిదిద్దుకో..అంతేగాని తప్పుకు మరో తప్పును చేస్తూ కప్పిపుచ్చకు. అలా చేస్తే..నీవు కూర్చున్న చెట్టుకొమ్మను నీవే నరుక్కొంటున్నట్టుగా ఉంటుంది.
నిజం చెప్పలేని తప్పు ఎప్పుడైనా తప్పటడుగులే వేయిస్తుంది.
*అనంతవచనం*