​ఫిబ్రవరి 12 తేదీ నాడు రధసప్తమి మీ ఇంట్లో ఇలా చేయండి

రధసప్తమి పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి – అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

“సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ”

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.
౧. ఈ జన్మలో చేసిన, ౨. జన్మాంతరాలలో చేసిన, ౩. మనస్సుతో, ౪. మాటతో, ౫. శరీరంతో, ౬. తెలిసీ, ౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.
చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక – అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు – పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి

నమస్తే సూర్యమండలే – అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. “దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం ” అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.
 ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.🌹
రథ సప్తమి రోజు స్నానం , పూజ , వ్రతం…….!!
మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది – పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా – రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ – ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ  శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానంచేయాలి.

సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగరె స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా , విపిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు. నది స్నానకి వెళ్ళే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్త గా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీలలొ తేలుకుంటూ ముందుకు సాగి వెల్లెలాగ సూర్యోదయ సమయాన స్నానం చేయాలి.
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా , భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము (ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ కింది శ్లోకాన్ని చదువుకోవాలి).
రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,

తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే

సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.
జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన  మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక! అని దీనర్ధం. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది.
రోగ నివారణ /సంతాన ప్రాప్తి కోసం – రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చుచేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని  ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా గ ఉండాలి . సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి .
వ్రత కధ
పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.
పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా
చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.

సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.
ఇంటి దగ్గర పూజ , నివేదన
ఈ రోజున సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగ ప్రదేశాన్ని గోమయం తో (ఆవు పేడ) సుద్ధి చేసి గోమయం తో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒక దాని పై ఒకటి అమర్చి వెలిగించి, ఆ పిడకల పొయ్యిమీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి, పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం,

బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధం గా చెక్ర పొంగలి వండుతారు. ఈ  పరమానాని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు.  వితరణ కూడా చిక్కుడు అకులోనే చేస్తారు.
పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధి కి సంకేతం. ఇంకో విషయం  ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు కాయల్ని వాడి కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి  సూర్యదేవుని రధంగా దానిని భావించి పూజ చేయాలి . (బంగారం తో అంటే ఈ కాలంలో కష్టం కదా .. )

రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.
సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. 
ఆ ఏడింటి పేర్లు తెలుసునా!
మొదటి కిరణం- సుషుమ్నం 

రెండవ కిరణం- హరి కేశు

మూడవ కిరణం- విశ్వ కర్మ

 నాల్గవ కిరణం- విశ్వ వ్యచ

ఐదవ కిరణం- సంపద్వసు 

ఆరవ కిరణం- అర్వాదము

ఏడవ కిరణం- స్వరాడ్వసు.
 సర్వేజనాస్సుఖినోభవంతు .

రథ సప్తమి రోజున ఈ ఒక్క పని చేయండి.

రథ సప్తమి

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. 

సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు.

స్నాన విధానం:
వ్రతచడామణిలో “బంగారు, వెండి, రాగి, ఇనుము, వీనిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో (నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, ఉప్పనూనె – వీనిలో ఏదో ఒకదానితో) దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికిగానీ, చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో వదలి, ఎవరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి.

సప్తమీవ్రతం:

రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి – మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి!

పంచాంగకర్తలు రధసప్తమిని ‘ సూర్యజయంతి ‘ అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈ రోజు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు ఏడవమనువు. సూర్యుడు వివస్వంతుడు. ఇతనికొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే). ఇతని మన్వంతరానికి రధసప్తమియే సంవత్సరాది – అనగా ఉగాది. మన్వంత రాదిపర్వదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు – మకర సంక్రాంతివలనే – పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కల్గించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:

రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.

 రుద్రాక్ష చెట్టు:

ఈ చెట్టు ఎక్కువగా ఉత్తరహిందూస్ధాన్లో వున్నాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీని భేధాలూ, ప్రభావాలూ జగద్విదితం. వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నానబెట్టి, ఆ నీళ్లు సేవిస్తే మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి. 

జిల్లేడు(అర్క):

శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ, బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.

రేగు చెట్టు:

(బదరీ) దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా తెలిసికొని ఉపయోగించాలి.)

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,

సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.

“సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం”- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

*మాఘప్రశస్తి:

మా+అఘ=పాపంలేనిది – పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా – రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే! 

రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం:

య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక! 

​రధసప్తమి రోజున ఈ దానం చేస్తే బాధలన్నీ బలాదూర్..

మాఘశుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథ సప్తమి రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు.
మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది.  సూర్యుడి జన్మతిధిని పురస్కరించుకొని కోణార్క్ దేవాలయంతో పాటు, అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం, తిరుపతి పుణ్యక్షేత్రాలలో…. రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా చేస్తారు. భూమి పైకి సూర్యకాంతులు ప్రసరించిన తొలి దినాన్ని రధ సప్తమిగా జరుపుకుంటారు. జీవ కోటికి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యకిరణాలను పూజస్తూ పవిత్ర స్నానాలు పూజలు ఆచరించటం రధ సప్తమి సంప్రదాయంగా వస్తోంది. రధ సప్తమి వేడుకని వైష్ణవాలయాలు సర్వాంగసుందరంగ ముస్తాబయ్యాయి. సూర్యుడి జన్మతిధిని పురస్కరించుకొని ఈ క్షేత్రంలో ఉత్సవాలు చేస్తారు. కోణార్క్ సూర్యనారాయణ ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
తిరుమలలో ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తారు. రధ సప్తమిని ఒక్క రోజుని బ్రహ్మోత్సవంగా భావిస్తారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు సాయంత్రం చంద్ర ప్రభవాహనసేవతో ముగుస్తుంది. చిన శేష, గరుడ, హనుమంత, కలప్పవ్రుక్ష, సర్వభూపాల ఇలా సప్తవాహనములపై తిరువీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. మొదట ఉత్తర మాడ వీధిలో ఉత్సవ మూర్తులని ఉంచుతారు. సూర్యోదయం కాగానే తొలికిరణాలు స్వామి వారి నుదుట నుండి నాభి పాదాలను తాకుతాయి.. ఆ వెంటనే వాహన సేవలు…మొదలవుతాయి…మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానఘట్టం. అత్యద్భుతంగా సాగుతుంది. అద్భుతాలకు నిలయమైన కోణార్క్ సూర్యదేవాలయంలో రధ సప్తమి రోజు మరిన్ని అద్భుతాలను భక్తులు చూడవచ్చు. ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు, 24 రేఖల చక్రంతో, ఏడు అశ్వాలతో లాగ బడిన రధం మీద ఉన్నట్టు కనిపిస్తుంది…. చక్రం సంవత్సరానికి ప్రతీక..
ఆరు ఆకులు ఆరు రుతువులకు ప్రతీక…

ఏడు అశ్వాలు…ఏడు కిరణాలకు ప్రతీక…

సూర్యుడు ఉదయం పూట….బ్రహ్మలాగ…

మధ్యాహ్నం పూట……..మహేశ్వరుడిలాగ

సాయంకాలం పూట….విష్ణువు లాగ భాసిల్లుతాడట.


ఇక రధ సప్తమి నాడు జరిగే పూజా విధానం గురించి… తెలుసుకుందాం….

రథసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను (రేగుపండ్లు కూడా) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలట.మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి వున్నాయి. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది..అందుకే వీటికి అర్క అని పేరు పెట్టారు. అది గుర్తుండాలనే రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేస్తారు. సప్త అశ్వములే సప్త స్వరములు, సప్త ఛందస్సులు, సప్త ఋషులు రథ సప్తమీ సూర్యారాధన- ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. తల స్నానం ముగించి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. 
రథ సప్తమినాడు స్త్రీలు గుమ్మం ముందు ‘రథం ముగ్గును’ వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యధాశక్తిగా పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం. ఈ రోజున చేసే స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి  చెంబులో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి… అంతా అయ్యాక..సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని..

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్….

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ అంటూ…

నమస్కరించుకొని విశ్రమించండి…

చంద్ర మంగళ రథ సప్తమి

ప్రతి సంవత్సరము వలే ఈ సంవత్సరం కూడా రథ   సప్తమి ఈ మాఘ మాసంలో 12-2-2019 న వస్తోంది.
ఈ రథ సప్తమికి ఒక విశిష్టత ఉంది.

*మేషరాశి సూర్యునికి ఉచ్చ స్ధానం.*
చంద్ర మంగళ రథ సప్తమి అంటే చంద్రుడు మంగళవారానికి అథిపతి ఐన అంగారకునితో(కుజుడు)   స్ధానంలో కలసి *భరణీ నక్షత్ర యోగంలో రావడం. ఇలా 30  సం.రాల ముందు వచ్చింది.* అనగా

*1989 ఫిబ్రవరి 12 వ తేదీన జరిగింది*
ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్.
*సూర్యుడు ఆరోగ్య కారకుడు. చంద్రుడు మనః కారకుడు*
మానసిక సుఖ శాంతులను ఇచ్చేవాడు చంద్రుడు.

కుజుడు యోగ కారకుడు

ఇంత విశేషమైన రోజు *ఈ అరుదైన చంద్ర మంగళ రథ సప్తమి.*
👉 *ఈ రోజు నుండి మేషరాశి,సింహరాశి, వృచ్చిక రాశి వరకు గొప్ప అవకాశములు కలగబోతున్నాయి.* 👈
మానవులు సమస్త మైన ఇబ్బందులను తొలగించు కోవడానికి

 రేపు *ఉదయం 8.30ని.నుండి 9.15ని.* వరకూ సూర్యుని వెలుగు పడే ప్రాంతములో  నిలబడి సూర్యుని ప్రార్థన చేయండి. 

*నిలబడ లేని వారు కుర్చీలో కూర్చుండి ఐననూ మౌనంగా ప్రార్ధన చేయండి*

సూర్య ద్వాదశ నామాలు..💐

1.ఓం మిత్రాయనమః

2.ఓం రవయేనమః

3.ఓం సూర్యాయనమః

4.ఓం భానువేనమః

5. ఓం ఖగాయనమః

6. ఓం పూష్ణేనమః

7. ఓం హిరణ్య గర్భాయనమః

8.ఓం మరీచయేనమః

9.ఓం ఆదిత్యా యనమః

10.ఓం సవిత్రేనమః

11. ఓం అర్కాయనమః

12. ఓం భాస్కరాయనమః

శ్రీ సూర్య భగవానుని 21 నామాలు.. ఏక వింశతి నామావళి..💐

1.వికర్తన 

2.వివశ్వన 

3.మార్తాండ 

4.భాస్కర 

5.రవి 

6.లోక ప్రకాశక 

7.శ్రీమాన్ 

8.లోక చక్షు

9.గ్రహేశ్వర 

10.లోక సాక్షి 

11.త్రిలోకేశ 

12.కర్త 

13.హర్త

14.తమిస్రహ 

15.తపన 

16.తాపన 

17.శుచి 

18.సప్తాశ్వ వాహన 

19.గభస్తి హస్త

20.బ్రహ్మ 

21.సర్వదేవ నమస్క్రుత .

ఓం నమః శివాయ..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!💐
                          💐శ్రీ మాత్రే నమః💐

శ్వేతార్కలో జ్ఞాన సరస్వతీ అనుగ్రహమును కోరుతూ సప్తమేధ గణ వ్రత పూజలు


​వరంగల్ అర్బన్ జిల్లాలోని తెలంగాణ గణపతిగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్ర నిలయంలో కొలువుదీరిన శ్రీ జ్ఞానముద్రసరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీపంచమి/మదన పంచమి అనగా శ్రీసరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశేష పూజలు నిర్వహించబడినవి. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పంచామృత, మేధా సూక్త, సరస్వతీ సూక్తములతో విశేష అభిషేకములు జరిగినవి. ఉ.9నుండి 1గం వరకు జరిగిన సామూహిక అక్షరాభ్యాస పూజలలో మరియు సప్తమేధ గణ వ్రతం, గణపతి నిత్యాసహస్రమోదక సప్తమేధ గణ, మేధాదక్షిణమూర్తి, సరస్వతీ మూలమంత్ర హోమము, భజనలు, సంగీత సేవల్లో మెదక్,హైదరాబాద్, మంచిర్యాల, వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మాజీ dcc చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శ్వేతార్క గణపతి స్వామివారిని దర్శించి పుట్టినరోజు వేడుకలను ఆలయంలో గల గణపతి కళాక్షేత్రంలో ప్రముఖుల,కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు ఆలయ మర్యాదలతో వారిని సత్కరించటం జరిగింది మరియు ఇందులో 52,53,54 division కార్పొరేటర్ లు జకులరామరవిందర్, ఎం స్వప్న చరణ్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాలయ అన్నపూర్ణ భవనంలో భక్తులకు అన్నప్రసాదా వితరణ జరిగింది. ఈరోజు పూజ కార్యక్రమంలో దేవాలయ వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ నేతృత్వంలో ఐనవోలు సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు టీ. హరికృష్ణ స్వామి, ఆనంద్ త్రిపాఠి,నరేషమిశ్రల సహాయంతో భక్తులకు విశేష పూజలు నిర్వహించారు. కార్యకర్తలు సుధీర్,మణి, స్వప్న,సుష్మిత,సాంబమూర్తి లు సేవలు అందించారు.

www.t.me/swetharka……Whatsapp: 9394810881

సరస్వతీదేవి మహిమను తెలిపే ఇతిహాసం. 

ఓం నమః శివాయ:

🌹

 సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

దుష్టశక్తులను సంహారం చేసి, సామాన్య ప్రజల కష్టాలను దూరం చేసే సరస్వతీదేవి మహిమలు ఎన్నో వున్నాయి.

అందులో భాగంగానే ఈమె మహిమను తెలిపే రామాయణ ఇతిహాసం గురించి తెలుసుకుందాం…
పూర్వం రామాయణ కాలంలో కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొందాలని కోరుకుంటాడు. ఎప్పటికీ జీవించే వుండి ప్రపంచాన్ని శాసించాలనే వరాన్ని పొందాలనుకుంటాడు.

దానికోసం అతడు బ్రహ్మదేవునుని సంతోషపరిచి, ఆ వరాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా కుంభకర్ణుడు కొన్ని వేల సంవత్సరాలవరకు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేయసాగాడు.
అయితే బ్రహ్మదేవుని మాత్రం అతనికి ఆ వరాన్ని ప్రసాదించడం ఇష్టం వుండదు. ఒకవేళ అటువంటి వరాన్ని ప్రసాదిస్తే.. మొత్తం ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని, ప్రతిఒక్కరిని హింసిస్తాడని బ్రహ్మదేవుడు అనుకుంటాడు.

దాంతో కుంభకర్ణుడు ఎంతకాలం తపస్సు చేసినా.. బ్రహ్మదేవుడు మాత్రం అతనికి ప్రత్యక్ష్యం కాడు.
అయినా పట్టువదలకుండా కుంభకర్ణుడు తపస్సు కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. బ్రహ్మదేవుడికి ఇక దిక్కు తోచ సరస్వతీదేవి దగ్గరకు వెళతాడు. కుంభకర్ణుని వరం గురించి ఆమెకు వివరిస్తాడు. ఆమెను యుక్తితో వేడుకుంటూ… ‘‘దేవి! కుంభకర్ణునికి అమరత్వ వరాన్ని ప్రసాదిస్తే వినాశనం సృష్టిస్తాడు. ఆ వరాన్ని పొందేందుకు అతను పట్టువీడకుండా తపస్సు చేస్తూనే వున్నాడు. అందుకు నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను. కాబట్టి లోకకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరుకునే సమయంలో అతని వాక్కును తారుమారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’’ అని అంటాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకుంటుంది.

వీరిద్దరి సంభాషణ ముగిని తరువాత బ్రహ్మదేవుడు, ఘోర తపస్సులో వున్న కుంభకర్ణుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ… ‘‘నాయనా కుంభకర్ణా! నువ్వు నీ ఘోర తపస్సుతో నన్ను ఎంతో సంతుష్టం పరిచావు. నీకు ఏ వరం కావాలన్నా కోరుకో’’ అని అంటాడు. దొరికిన అవకాశాన్ని చేజిక్కించుకోకూడదనే ఆనందంలో కుంభకర్ణుడు అమరత్వ వరాన్ని కోరుకోబోతుండగా.. సరస్వతీ దేవి అతని వాక్కును తారుమారు చేస్తుంది. దాంతో అతను అమరత్వ వరానికి బదులు నిద్రను కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు ‘‘తథాస్తు’’ అని నిద్రను ప్రసాదిస్తాడు. ఇలా ఈ విధంగా సరస్వతీదేవి, లోకకంటకుడై కుంభకర్ణుని శక్తులను అణచివేసి, లోకోపకారానికి ఎంతో సహాయం చేసింది.

🙏🙏🙏🙏🙏

విద్యాభ్యాసానికి ప్రారంభం – అక్షరాభ్యాసం

విద్యాభ్యాసానికి ప్రారంభం – అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. “అక్షరం ” అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ….అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా…” 
అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం! చదువుల తల్లి…అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతిజన్మదినo – మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే – శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత! చల్లని తల్లి! బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి…అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..వీరిలో మూడో శక్తులని, వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం. శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న…అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు,, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా

యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా

సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

సరస్వతీ నిత్య పూజా విధానము


శ్రీ సరస్వత్యై నమః
ఆదౌ హరిద్రా గణపతిం కృత్వా – నాగవల్లీ దళే నిక్షిప్త్య

ముందుగా పసుపు విఘ్నేశ్వరుని నిర్మించి – పూజా పీటము ముందు భాగాన ఒక తమలపాకు నందుంచుకొని పూజించ వలెను. అథ – హరిద్రా గణపతీ పూజా –
శ్రీ విఘ్నేశ్వర ప్రార్ధన

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే    ||
శ్రీ సరస్వతీ ప్రార్ధన

శ్లో|| యా కుందేందు తుషార హార ధవళా – యాశుభ్ర వస్త్రాన్వితా

యా వీణా వరదండ మండిత కరా – యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దే వై స్సదాపూజితా

సామాం  పాటు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా   ||
లాంచన మార్గం

శ్లో|| అపవిత్ర : పవిత్రో వా సర్వావస్థాంగ తోపివా

యస్మరే త్పుండ రీ కాక్షం సబాహ్యాంభ్యంతర స్శుచి:      ||

అనుకొని – రెండు చుక్కల జలము తలపై ప్రోక్షించు కొనవలెను. అనంతరం ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, నిమిత్తం పూజా ప్రదేశముల పవిత్రత కొరకు పుండరీక (విష్ణు) దేవుని కేశవ నామములతో ధ్యానించుచు ‘ స్వాహా ‘  మంత్రమును ముమ్మారు ఆచమింపవలెను.
ఆచమనం

ఓం కేశవాయ స్వాహ

      నారాయణాయ స్వాహ

      మాధవాయ స్వాహ

      గోవిందాయ నమః

  విష్ణవే నమః
            మధుసూదనాయ నమః

            త్రివిక్రమాయ నమః

            వామనాయ నమః

            శ్రీధరాయ నమః

            హృషీ కేశాయ నమః

            పద్మనాభాయ నమః

            దామోదరాయ నమః

            సంకర్షణాయ నమః

            వాసుదేవాయ నమః

            ప్రద్యుమ్నాయ నమః

            అనిరుద్దాయ నమః

            పురుషోత్తమాయ నమః

            అదోక్షజాయ నమః

            నారసింహాయ నమః

            అచ్యుతాయ నమః

            జనార్ధనాయ నమః

            ఉపేన్ద్రాయ నమః

            హరయే నమః

            శ్రీ కృష్ణాయ నమః

            శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః     ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)

భూశుద్ధి మంత్రము

ఆచమానంతరం  – భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము చదువుతూ – కొన్ని అక్షతలు – వాసన చూచి -వెనుకకు వేసుకోవలెను.   

మం|| ఉత్తిష్టంతు భూతపిశాచా| యేతే భూమి భారకాః

ఏతే షా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే    || 

ప్రాణాయామం

ఓం భూ : ఓం భువః ఓగ్ o సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ o సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్  ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్ – అను మంత్రమును నుచ్చరించుచు ప్రాణాయామము చేయవలెను.

పసుపు గణపతి పూజ

” ఓం – తత్పురుషాయ విద్మహే – వక్రతుండాయ ధీమహి తన్నోందంతీ ప్రచోదయాత్ ”

అనుచు పసుపు గణపతిని అభి మంత్రించి – క్రింది నామాష్టకములతో లఘు పూజ చేయవలెను.

నామష్టకం

ఓం అఖిలేశ్వరాయ నమః – అక్షతలు

ఓం అఖువాహనాయ నమః – పువ్వులు

ఓం ఇభవక్త్రాయ నమః – పసుపు

ఓం ఈశ పుత్రాయ నమః – కుంకుమ

ఓం ఉమా పుత్రాయ నమః పన్నీరు

ఓం ఊహాతీతాయ నమః గంధం

ఓం ఏకదంతాయ నమః  అక్షతలు

ఓం కుమారగురవే నమః  పువ్వులు

శ్రీ మహాగణాధిపతయే – సర్వసిద్ది ప్రదాయ నమః – అని పుష్పములతో కాని, తమలపాకుతో గాని – ఒక్క చుక్క నీరు చల్లి –  

నమస్కారమంత్రం

వాగీశాద్యా స్సుమనస స్సర్వార్ధానా ముపక్రమే

యం న త్వా కృత కృత్యాః స్యు: – తం నమామి గజాననం

అను మంత్రము చదువుచూ – పసుపు గణపతి ముందు తాంబూలము నుంచి నమస్కరించవలెను – కేశవ నామములతో ఆచమనము చేసి – ప్రాణాయామము మంత్ర  పూర్వకముగా సల్ప  —–

ఘంటా మంత్రము

ఆగమార్ధంతు దేవానాం | గమనార్ధం తు రాక్షసామ్

కురుఘంటా రవం తత్ర   | దేవ తాహ్వాన లాంఛనమ్.

(అని చెప్పుకొనుచు ఘంటము వాయించవలెను.)

సరస్వతీ స్మరణం

శ్లో|| నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమం

దేవీం సరస్వతీం చైవ – తతో జయము దీలయేత్

అని స్మరించి – సంకల్పము చెప్పుకోవలెను.

సంకల్పం:–       

అధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో ర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ……ప్రదేశే కృష్ణా గోదావర్యో ర్మధ్య దేశే శోభన గృహే- సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావ హారిక చాంద్ర మానేన ……సంవత్సరే ….ఆయనే ఋతౌ…… మాశే …… పక్షే ……తిదౌ …….వాసరే ……శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ శ్రీ మాన్ ……..గోత్రః ….. నామధేయః శ్రీ మతః గోత్రోద్భవస్య……నామ దేయస్య ధర్మ పత్నీ సమేతస్య  ( స్త్రీ లైనచో ఆయా స్థలములో ” శ్రీమతి: …….. గోత్రవతీ: ………. నామధేయవతీ,  శ్రీమత్యాః, గోత్రవత్యాః నామధేయవత్యాః ” అని చెప్పు కోవలెను)  మమ ధర్మార్ధ కామ మోక్ష చరుర్విధ ఫల పురుషార్ధ  సిద్ధ్యర్ధం……… సకల విద్యాపారంగత్త్వ సిద్ధ్యర్ధం ….. శ్రీ సరస్వతీ దేవీ ముద్దిశ్య శ్రీసరస్వతీ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ……..

            

కలశపూజ

కలశమును గంధ పుష్పాలతో అర్పించి, కలశంలో వాటిని వేసి కలశముపై చేయి ఉంచి  – ” ఆపోవా ఇదగ్౦ సర్వం, విస్వభూతాన్యాపః, ప్రాణాషఆపః, పశవః, ఆపః, అన్నమాపో అమృతమాపో సమ్రాడాపో, విరాడాపో, స్వరాజాపశ్చంధాగ్౦ ష్యాపో జ్యోతిగ్౦ ష్యాపో యజూగ్ ష్యా పస్స ర్వా ఇహ దేవతానాపో భూర్భువస్సువ రోమ్”

శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే

        సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు

        ……దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో

        దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య

అనుచు సమస్త నదీ తీర్థాలను సంభావిస్తూ కలశోదకం శ్రీసరస్వతీమాత పటము పైన తదితర పూజా ద్రవ్యాల పైన పవిత్రమగుటకు సంప్రోక్షించ (చల్ల) వలెను. పిదప ఓం – ఐం – హ్రీం – వద శ్రీసరస్వతీ  దేవతా స్థిరాభవతు – సుప్రసన్నా భవతు ‘ వరదాభవతు – అని చెప్పుకొని – దీపమును వెలిగించి  –

దీపపూజ
శ్లో|| దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాశ్చ దేహిమే

ఇతి దీపదేవతాభ్యో నమః – సకల పూజాపరి

పూర్ణం గంధాక్షత పుష్పాణి సమర్పయామి

అని అనుకొని – దీపమునకు – పువ్వులు, గంథము, అక్షతలు ఉంచి నమస్కరించవలెను. పిమ్మట మాతృకా న్యాసుదు లొనరించవలెను.

మాతృకాన్యాసము

అస్యశ్రీ మాతృకా మంత్రస్య బ్రహ్మఋషి: గాయత్రీ చందః, మాతృ శ్రీసరస్వతీ దేవతా, హల్ బీజాని, స్వరాః శక్తయః కీలకం మాతృకాన్యాసే వినియోగః అని చెప్పుకొని తిరిగి కరన్యాసము అనుకొనవలెను.

కరన్యాసము

ఓం అం, కం, ఖం, గం, ఘం, ఆం, జం, అమ్గుష్టాభ్యాం (బొటన వ్రేలు) నమః – ఓం ఇం, చం ఛం, జం ఝం, ఇం ఈం తర్జనీభ్యాం (చూపుడు వ్రేలు) నమః – ఓం ఉం, టం, టం, రం, డం, డం, ణం, ఊం మధ్యమాభ్యాం (నడిమి వ్రేలు) నమః –

ఓం ఏం, తం థం, దం ధం, నం, ఐం అనామికాభ్యాం (ఉంగరపు వ్రేలు) నమః – ఓం, ఓం పం, ఫం, బం భం, మం, ఓం కనిష్టికాభ్యాం (చిటికెన వ్రేలు) నమః ముద్రలు గురూపదేశముచే ప్రదర్శించిన శ్రీఘ్రసిద్ధి ఉండును.

ధ్యానం

శ్లో|| పుస్తకేతు యతోదేవీ క్రీడతే పరమార్ధతః

త త స్తత్ర ప్రకుర్వీత ధ్యాన మావాహనాదికమ్ ||

ధ్యాన మేవం ప్రకుర్వీత సాధకో విజితేంద్రి  యః

ప్రణవాసన మారూడం తదర్ధ త్వేన నిశ్చితాం   ||
శ్లో|| అంకుశం చాక్ష సూత్రంచ  పాశం వీణాంచ ధారిణీం

ముక్తాహార సమాయుక్తాం మొదరూపం మనోహరామ్

కృతేన దర్పణాఖ్యేన వస్త్రే ణో పరిభూషితాం

సుస్తనీం వేదవేద్యాం చ చంద్రార్ధ కృతశేఖరాం

జటాకలాప సముక్తాం పూర్ణ చంద్ర నిభాననాం

త్రిలోచనాం మహాదేవీం స్వర్ణ నూపుర ధారిణీం

కటకై స్స్వర్ణ రత్నాద్యై ర్ముక్తా వలయ భూషితాం

కంబుకంటీం సుతామ్రోష్టీం సర్వాభరణ భూషితాం

కేయూరై ర్మేఖలా ద్యైశ్చ ద్యో తయంతీం జగత్త్ర యం

శబ్ద బ్రహ్మత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః       ||

(ఓం ఐం సరస్వత్యై నమః – ధ్యాయామి – ధ్యానం సమర్పయామి: ఆవాహనం

ఆవాహనం

శ్లో|| అత్రాగచ్చా జగద్వంద్యే సర్వలోకైక పూజితే

మయా కృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీం

(ఓం ఐం సర్వాభరణ భూషితాయై నమః ఆవాహనం సమర్పయామి —– అమ్మవారిపై —– అక్షతలు వేయవలెను )

ఆసనం:

శ్లో|| అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం

ముక్తా మణ్యంచితం చారు సింహాసనం దదామ్యహం ||

(ఓం ఐం జగదీశ్వర్యై నమః ….. సింహాసనం సమర్పయామి ….. అమ్మవారి పాదములపై పుష్పమును ఉంచవలెను.)

పాద్యం

శ్లో|| గంధ పుష్పాక్ష తై స్సార్ధం శుద్ధ తోయేన సంయుతం

శుద్ధ స్పటిక తుల్యాంగీ పాద్యం తే ప్రతిగృహ్యతాం   ||

(ఓం ఐం స్పాటికాభాయై నమః, పాద్యం సమర్పయామి …… ఒక తమలపాకుతో జలమును సరస్వతిపై జల్లవలెను)

అర్ఘ్యం

శ్లో|| భక్తాభీష్ట ప్రదే దేవీ దేవదేవాది వందితే

ధాత్రుప్రియే జగద్ధాత్రీ దదామ్య ర్ఘ్యం గృహాణమే   ||

(ఓం ఐం ధాత్రుప్రియాయై నమః అర్ఘ్యం సమర్పయామి …… కొంచెం నీరు చేతిలోపోసుకొని పళ్ళెములో విడువవలెను.)

ఆచమనీయం

శ్లో|| పూర్ణ చంద్ర సమానాస్యౌ కోటి సూర్య సమప్రభే

భక్త్యాం సమర్పితం వాణీ, గృహాణాచ మనీయకం  ||

(ఓం ఐం వాగీశై నమః – ఆచమనం దదామి …… తమలపాకుతో గాని పువ్వుతో గాని కొంచెం నీరు చిలకవలెను.)

మధుపర్కం

శ్లో|| దధీక్షీర మధుఘ్రుత యుక్తం క్షీర రంభాఫలాడ్యం

సురుచిర మధుపర్కం గృహ్యాతాం దేవవంద్యే    ||

(ఓం ఐం భక్తా భీష్ట దాయిన్యై నమః మధుపర్కం గాని లేనిచో అక్షతలు గాని సమర్పించ వలెను.)

పంచామృతం

శ్లో|| దధిక్షీర ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం

పంచామృత స్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరీ    ||

(ఓం ఐం మహేశ్వర్యై నమః పంచామృత స్నానం సమర్పయామి …… ఒక పువ్వుతో పంచామృతమును చల్లవలెను.

స్నానం

శ్లో|| శుద్దోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధి పూర్వకం

సువర్ణ కలశానీతైర్నానా గంధ సువాసితై:   ||

ఓం ఐం సువర్ణ కవచాయై నమః శుద్దోదక స్నానం సమర్పయామి…… పువ్వుతో నీరు చిలుకరించవలెను .

వస్త్రం

శ్లో|| శుక్ల వస్త్ర ద్వయం దేవీ కోమలం కుటిలాలకే

మయి ప్రీత్యాత్వయా వాణీ బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతాం    ||

ఓం ఐం బ్రహ్మణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి ……. శక్తి యుంటే వస్త్రము లేకుంటే అక్షతలు సమర్పించాలి.

యజ్ఞోపవీతం

శ్లో|| శబ్ద బ్రహ్మత్మికే దేవీ – శబ్ద శాస్త్ర కృతాలయే

బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మ శక్రాది పూజితే

ఓం ఐం బ్రహ్మ శక్రాది పూజితాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి……. యజ్ఞోపవీతం లేదా అక్షతలు వేయవలెను.

ఆభరణం

శ్లో|| కటక మకుటహారై ర్నూపురై రంగదాద్యైనః

ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హారై:

కమలదళ విలాసే కామదేవం గృహీత్వా

ప్రకటిత కరుణార్ధ్రే భూషితే భూషణాని ||

ఓం ఐం కమలదళ విలాసిన్యై నమః సర్వాభరణాని  సమర్పయామి ……. అక్షతలు వేయవలెను.

గంధం

శ్లో|| చందనాగరు కస్తూరీ కర్పూరైద్యాది సంయుతం

గంధం గృహాణ వరదే దేవీ విధి పత్నీ నమోస్తుతే

ఓం ఐం విధిపత్నై నమః గంధం సమర్పయామి …… గంధం చిలకరించవలెను.

అక్షతలు

శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్వితాన్

గృహాణ వరదేదేవీ బ్రహ్మ పత్నీ శుభాత్మకాన్    ||

ఓం ఐం గీర్వాణ్యై నమః అక్షతాన్ సమర్పయామి…… అక్షతలు వేయవలెను.

పుష్పం

శ్లో|| మందారాది సుపుష్పైశ్చ తత్కాల తరు సంభవై:

కరివీరైర్మనోరమ్యై ర్వకులై : కేతకై శ్శుభై:

పున్నాగై ర్జాతికుసుమై ర్మందారైశ్చ సుశోభితై:

నీలోత్పలై : శుభై శ్చాన్యై స్తత్కాల తారు సంభవై:

కల్పితాని చ మాల్యాని గృహాణా మర వందితే

ఓం ఐం బ్రహ్మణ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి శక్తి యుంటే వస్త్రము లేకుంటే అక్షతలు సమర్పించాలి.
అథాంగ పూజ

(పసుపు, కుంకుమ, అక్షతలు, పూవులు చేతబట్టి సరస్వతిని స్మరిస్తూ ఆమె సర్వావయములను పూజించాలి)

ఓం బ్రహ్మాణ్యై  నమః పాదౌ పూజయామి

ఓం బ్రాహ్మణ మూర్తయే నమః గుల్పౌ పూజయామి

ఓం జగత్స్వరూపిణ్యై  నమః  జంఘౌ పూజయామి

ఓం జగదాద్యాయై నమః జానునీ పూజయామి

ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి

ఓం కమలభూమయే నమః కటిం పూజయామి

ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి

ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి

ఓం హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి

ఓం లోకమాత్రే నమః స్తన్యౌ పూజయామి

ఓం విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి

ఓం గానవిచక్షణాయై నమః కంటం పూజయామి

ఓం స్కందప్ర పూజ్యాయై నమః స్కంధౌ పూజయామి

ఓం ఘనబాహవే నమః బాహూ పూజయామి

ఓం పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి

ఓం శ్రోత్రియ బంధవే నమః శ్రోత్రే పూజయామి

ఓం వేద స్వరూపాయై నమః వక్త్రం పూజయామి

ఓం సువాసిన్యై నమః నాసికాం పూజయామి

ఓం బింబా సమానోష్ట్యై నమః ఓష్టాం పూజయామి

ఓం కమలచక్షుషే నమః నేత్రే పూజయామి

ఓం తిలదారిణ్యై నమః ఫాలం పూజయామి

ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి

ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి

ఓం శ్రీసరస్వత్యై నమః శిరః పూజయామి    

ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

(ఆ పిదప క్రింద ఇవ్వబడిన అష్టోత్తర శతనామములు గాని సహస్రనామములు గాని చదువుచూ యథాశక్తి  పూజించవలెను.

ఓం సరస్వ తైయ్య నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహమాయాయై నమః 

ఓం వర ప్రదాయై నమః

ఓం పద్మనిలయాయై నమః

ఓం పద్మా క్ష్రైయ నమః

ఓం పద్మవక్త్రాయై నమః

ఓం శివానుజాయై నమః

ఓం పుస్త కధ్రతే  నమః

ఓం జ్ఞాన సముద్రాయై నమః ||10 ||

ఓం రమాయై నమః

ఓం పరాయై నమః

ఓం కామర రూపాయై నమః

ఓం  మహా విద్యాయై నమః

ఓం మహాపాత కనాశిన్యై నమః

ఓం మహాశ్రయాయై నమః

ఓం మాలిన్యై  నమః

ఓం మహాభోగాయై నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహాభాగ్యాయై నమః || 20 ||

ఓం మహొత్సాహాయై నమః

ఓం దివ్యాంగాయై నమః

ఓం సురవందితాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాపాశాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహాంకుశాయై నమః

ఓం సీతాయై నమః  

ఓం విమలా యై నమః

ఓం విశ్వాయై నమః || 30 ||

ఓం విద్యున్మాలాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం చంద్రికాయ్యై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సురసాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దివ్యాలంకార భూషితాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః || 40 ||

ఓం వసుధాయ్యై  నమః

ఓం తీవ్రాయై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహా బలాయై నమః

ఓం భోగదాయై నమః

ఓం  భారత్యై నమః

ఓం భామాయై నమః

ఓం గోవిందాయై నమః

ఓం గోమత్యై నమః

ఓం శివాయై నమః

ఓం జటిలాయై నమః

ఓం వింధ్యవాసాయై నమః  

ఓం వింధ్యాచల విరాజితాయై నమః

ఓం చండి కాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మజ్ఞా నైకసాధ నాయై నమః

ఓం సౌదామాన్యై నమః

ఓం సుధా మూర్త్యై నమః

ఓం సుభద్రాయై నమః || 60 ||

ఓం సుర పూజితాయై నమః

ఓం సువాసిన్యై నమః

ఓం సునాసాయై నమః

ఓం వినిద్రాయై నమః

ఓం పద్మలోచనాయై నమః

ఓం విద్యా రూపాయై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం బ్రహ్మాజాయాయై నమః

ఓం మహా ఫలాయై నమః

ఓం త్రయీమూర్త్యై నమః || 70 ||

ఓం త్రికాలజ్ఞాయే నమః

ఓం త్రిగుణాయై నమః

ఓం శాస్త్ర రూపిణ్యై నమః

ఓం శుంభా సురప్రమదిన్యై నమః

ఓం శుభదాయై నమః

ఓం సర్వాత్మికాయై నమః

ఓం రక్త బీజనిహంత్ర్యై నమః

ఓం చాముండాయై నమః

ఓం అంబికాయై నమః

ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః || 80 ||

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః

ఓం సర్వదే వస్తుతాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం సురా సుర నమస్క్రతాయై నమః  

ఓం కాళ రాత్ర్యై నమః

ఓం కలాధారాయై నమః

ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః

ఓం వాగ్దేవ్యై నమః   

ఓం వరారోహాయై నమః

ఓం వారాహ్యై నమః || 90 ||

ఓం వారి జాసనాయై నమః

ఓం చిత్రాంబరాయై నమః

ఓం చిత్ర గంధా యై నమః

ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామప్రదాయై నమః

ఓం వంద్యాయై నమః

ఓం విద్యాధర సుపూజితాయై నమః  

ఓం శ్వేతాననాయై నమః

ఓం నీలభుజాయై నమః || 100 ||

ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః

ఓం చతురానన సామ్రాజ్యై నమః

ఓం రక్త మధ్యాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం హంసాసనాయై నమః

ఓం నీలంజంఘాయై నమః

ఓం శ్రీ ప్రదాయై నమః

ఓం బ్రహ్మవిష్ణు శివాత్మి కాయై నమః || 108 ||

            సరస్వత్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ధూపం

శ్లో|| దంశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం

ధూపం గృహాణ కళ్యాణీ భక్తిత్వం ప్రదిగ్రుహ్య తాం

ఓం ఐం విశ్వాయై నమః ధూపమాఘ్రాపయామి

అగరువత్తులుగాని సాంబ్రాణి కడ్డీలు గాని వెలిగించి తొలిధూపం అమ్మవారికి చూపాలి.
దీపం

శ్లో|| ఘ్రుతవర్తి సమాయుక్తం దీపితం దీపమంబికే

గృహాణ చిత్ స్వరూపిత్వం కమలాసన వల్లభే ||

ఓం ఐం కమలాసన వల్లాభాయై నమః దీపం దర్శయామి ….. దీపం వెలిగించి నమస్కరించాలి.
నైవేద్యం

అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టో పపాచితాన్

మృదులాన్ గుడ సమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్

కదళీ పన సామ్రాణిచ పక్వాని సు ఫలాని చ

కందమూల వ్యంజనాని సో పదంశం మనోహరం

అన్నం చతుర్విదోపేతం క్షీరాన్నం చ ఘ్రుతం దధి

శీతోదకంచ సుస్వాదు స్సు కర్పూరై రధి వాసితం

భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం
ఓం ఐం సరస్వత్యై నమః మహానైవేద్యం సమర్పయామి – అని నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ – ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి – ధీయోయోనః ప్రచోదయాత్ | ఓం స్వత్యంత్వర్తేన పరిషంచామి. అమృతమస్తు. అమ్రుతోపస్తర ణమసి
ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – ఉత్తరాపోశనం సమర్పయామి – హస్తౌ ప్రక్షాళ యామి – పాదౌ ప్రక్షాలయామి శుద్దాచమనీయం  సమర్పయామి.
తాంబూలం

శ్లో|| తాంబూలం చ స కర్పూరం పూగనాగ దళైర్యుతం

గృహాణ దేవదేవేశ తత్వ రూపీ నమోస్తుతే   ||

ఓం ఐం దేవదేవేశిత త్వరూపిణ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం

నీరాజనం గృహాణత్వం జగదానంద దాయినీ

జగత్తిమిర మార్తాండ మండలే తే నమోనమః

ఓం జగత్తిమిర మార్తాండ మండలాయై నమః నీరాజనం సమర్పయామి — అని కర్పూర నీరాజనం వెలిగించి ఒక్క చిన్న తమలపాకుతో నీరు జల్లి చూపవలెను.
మంత్రపుష్పం

జాతవేదసే సునవామసో మమరాతీ యతో విదహాతి వేదః

నమః పర్ణాతి దుర్గాణి విశ్వా నా వేవ సిన్ధుందురి తా త్యగ్ని:  

తామగ్ని వర్ణాంత పసాజ్వలన్తీం వైరోచ నీం కర్మలే షుజుష్టామ్ 

దుర్గాం దేవీ క్ శరణ మహం ప్రపద్యే సుతరసితర సే నమః

అగ్నేత్వం పార యానవ్యో అస్మాన్ద్స్వ స్తిభిరతి దుర్గాణి విశ్వా

పూశ్చ పృధ్వీ బహులాన ఉర్వీ భవాతో కాయ తనయాయ శంయో

విశ్వానినో దుర్గ హా జాత వేద స్సిన్దాంనావా దురితా తి పర్షి

అగ్నే అత్రివ న్మ న సా గృహ్ణా నో స్మాకం బాద్య వాతిత నూనామ్

పృత నాజిత గ్ సహమాన ముగ్ర మగ్నింగ్ హువేమ పరమాథ్స ధస్థాత్

సనః పర్ష ద తి దుర్గాణి విశ్వాక్షా మద్దేవో అతిదురితా ద్ద్యగ్ని:

ప్రత్నోషిక మీడ్యో అధ్వరేషు సనాచ్చహొ తానవ్య శ్చ సత్సి

స్వాంచాగ్నే తనువంపిప్రయ  స్వాస్మభ్యంచ సౌభగ మాయజస్య

గోభి జుష్ట మయుజో నిషిక్తం తవేన్ద్ర విష్టోర ను సంచ రేమ

నాక వ్య పృష్ట మభి సంపసానో వైష్ణవీం లోక ఇహ మాదయం తామ్

(ఓం ఐం శ్రీసరస్వతీ దేవ్యై నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి)
సాష్టాంగ నమస్కారం

శ్లో|| ఉరసా – శిరసా – దృష్ట్వా – మనసా వచసా తదా

పద్బాం కరాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే

ఓం శ్రీ సరస్వత్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారం

శ్రీ సరస్వతీ దేవికి 14 ప్రదక్షిణం చేయాలి. అప్పుడీ దిగువ మంత్రం 14  సార్లు జపించాలి.

పాశాంకుశ ధరా వాణీ వీణా పుస్తక ధారిణీ,

మమ వక్త్రే వసేన్నిత్యం దుగ్ద కుందేందు నిర్మలా

చతుర్దశ సు విద్యాసు రమతే యా సరస్వతీ

చతుర్ధశే షు లోకేషు సా మే వాచివ సేచ్చిరమ్

పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్తవత్సలే

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

ఓం ఐం సరస్వత్యై నమః ….. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
సర్వోపచార సమర్పణము

ఓం ఐం – సరస్వత్యై నమః ఛత్రం ధారయామి (అక్షతలు వేయవలెను)

ఓం ఐం – సరస్వత్యై నమః చామరౌ వీజయామి (అక్షతలు వేయవలెను)

ఓం ఐం – సరస్వత్యై నమః గీతం శ్రావయామి (అక్షతలు వేయవలెను)

ఓం ఐం – సరస్వత్యై నమః నృత్యం దర్శయామి (అక్షతలు వేయవలెను)

ఏవం విథ సమస్తరాజోపచార, దేవోపచార , శక్త్యోపచార , భక్త్యోపచార, సమస్తం సమర్పయామి
శ్లో|| యద్యద్ద్ర వ్య మా పూర్వంచ ప్రథివ్యా మతి దుర్గ భమ్

దేవ భూపార్హ భోగంచ తద్ద్రవ్యం దేవి సంగృహ్యతాం

అనుకొని అక్షతలు నీళ్ళు చల్లవలెను

పూజయందు మనకు తెలిసిగాని తెలియకగాని ఏమైనా లోపములు జరిగి వుండవచ్చు గనుక ….. ఆ అపరాధములు క్షమించుమని ఈ దిగువ విధంగా స్తుతించవలెను.

అపరాధ క్షమాపణలు

ఓం అపరాధ శతంకృత్వా జగదంబేతి చొచ్చరేత్

యాం, గతిం సమవాప్నోతి నత్దాం బ్రహ్మాద య స్సురాః

కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే

గ్రుహాణార్ఘ నం ఇమాంప్రీత్యా ప్రసీద పరేమేశ్వరి  ||

సర్వరూపమాయీ దేవీ సర్వందేవీ మయం జగత్

అతో హం విశ్వరూపా త్వాంన మామి పరమేశ్వరీ మ్

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్

పూర్ణం భవతు తత్సర్వం త్వత్ప్రసాదా న్మ హేశ్వరీ

యదత్ర పాటే జగదంబికే మయా

విసర్గ బింద్వక్ష ర హీన మీరితం

తదస్తు సంపూర్ణ తమం ప్రసాదతః

సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం

యన్మాతా బిందు బిందు ద్వితయ

పద పాద ద్వంద్వ వర్ణాది హీనం

భక్త్యా భక్త్యాను పూర్వం ప్రసభకృతి

వసాద్వ్యక్త  మవ్యక్త మంబ

మొహాద జ్ఞానతోవా పటి తమ పటితం సాంప్రతం తే స్త స్మిన్

తత్సర్వం సాంగ మాసాం భగవతి వరదే త్వత్ప్ర పాదాత్ప్ర సీద
ప్రసీద భాగవత్యంబ ప్రసీద భక్త వత్సలే ,

ప్రసాదం కురుమే దేవి దుర్గే దేవి నమోస్తుతే

ఓమ్ తత్ సత్ ఓమ్      ||

పూజవసాన వేళ పుష్పాంజలి సమర్పణం

దోసిలిలో పూలుంచుకుని

సరస్వత నమస్తుభ్యం వరదే భక్త వత్సలే

ఉపాయనం ప్రదాస్యామి విద్యావృద్ధిం కురుష్వమే

భారతీ ప్రతిగృహ్ణాతు – భారతీ వై దదాతి చ

భారతీ తారగోభాభ్యాం – భారత్యైతే నమోనమః

అని పూలు జల్లి నమస్కరించి……..

అనయా …. మయాక ….. త పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీసరస్వతీ సుప్రతీతా …. సుప్రసన్నా ….. వరదాభవంతు …. ఏతత్సర్వం సరస్వతీ దేవతార్పణ మస్తు …… (అని నీళ్ళు అక్షతలు పళ్ళెంలో వదలాలి)

       ఇతి శ్రీ సరస్వతీ నిత్య పూజా విధానం సంపూర్ణం

శ్వేతార్కలో సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక నాగదండ పూజలు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ శివ కేశవుల క్షేత్రమైన 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత సమేత నవగ్రహ క్షేత్రమైన కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రములో ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు మరియు బిల్వార్చనలు ప్రత్యేకంగా శ్వేతార్కగణపతిస్వామివారి ఆభరణమైన నాగదండమునకు విశేష పూజలు జరిగినాయి. నాగ దోషములు కాలసర్ప దోషం జాతకంలోని గ్రహస్థితి ననుసరించి రాహు కేతు దోషములు కోర్టు సమస్యలు చికాకులు దాంపత్య జీవితంలోని సమస్యల నుండి విముక్తికై ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. నేటి కార్యక్రమాలకు భక్తులు వివిధ జిల్లాల నుండి పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన వారు తదుపరి మహా అన్నదానం చేయడం జరిగింది. అయినవోలు వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో మరియు అయినవోలు సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో నేటి పూజలు జరిగాయి. ఇట్లు శ్వేతార్క దేవాలయం,9394810881 దేవాలయ ప్రతి సమచారమునకుTelegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.

రాజ గోపురం నిర్మాణానికి భక్తులు సహాకరించగలరు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని కాజిపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ యొక్క ప్రవేశ ద్వారం రాజ,గాలిగోపురనిర్మాణానికి తమవంతు సహాయముగా అనగా 25వేలు,50వేలు,ఒకలక్షగా ఎంతయినా లేదా సిమెంట్, ఇసుక, ఇనుప రాడు.. మీకు తోచినంతగా.. చెల్లించగలరు. లేదా మీకు తెలిసిన వారికేవరికయిన చెప్పి చెల్లింపచేయగలరు. రాజ గోపురం నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

ఇట్లు

శ్వేతార్క దేవాలయం,మేనేజ్మెంట్ విభాగం 9394810881

  • దేవాలయ ప్రతి సమచారము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంకుంటున్నారా అయితే…
  • Telegram : t.me/swetharka
  • Whatsapp : 9394810881 నకు add అని రిక్వెస్ట్ చేయగలరు…
  • లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.