భోజనంలో రకాలు

మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.
*సత్వగుణ ప్రధానుల భోజనం*


ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||
ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.
*రజోగుణ ప్రధానుల భోజనం*
కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |

ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||
ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.
*తమోగుణ ప్రధానుల భోజనం*
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |

ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||
ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.
ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.
ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు “తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు” అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. “నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి” అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.
భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి. అవి చెప్పిన నియమాల ప్రకారం తల మీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని పాగా చుట్టుకుని భుజిచకూడదు. భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు. తోలు మీద కూర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతికి ధరించి కానీ భుజించకూడదు. 
అన్నంతోపాటు పూరీ, రొట్టెల్లాంటివి కలుపుకుని తినకూడదు. పగిలిన పళ్లేల్లో భుజించకూడదు. కలసి భోజనం చేయాల్సిన సందర్భాల్లో వారు తన కోసం నిరీక్షించేలా చేయకూడదు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు ముందస్తుగానే ముగించి ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు. బజారులో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు. పడవలో భుజించరాదని ‘ఆపస్తంబ’ మహర్షి రాశారు. మంచం మీద కూర్చుని తినరాదని చెప్పింది ‘యమస్మృతి’. అలాగే చాపమీద కూర్చుని కూడా భుజించకూడదు. అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్లన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని ‘బ్రహ్మపురాణం’ పేర్కొంది. 
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి బయటకు తీసి తిరిగి తినరాదు. ఆవు నెయ్యితో తడపకుండా ఆహారాన్ని తినకూడదు. విక్రయాన్నం తినకూడదని ‘శంఖలిఖితస్మృతి’ శాసించింది. మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది. ప్రశాంతచిత్తంతో భుజించాలి. భుజించేటప్పుడు కామక్రోధాదులు, హింసావైరాల వంటి వాటికి మనసులో చోటుండకూడదు. భుజించేటప్పుడు మాట్లాడకూడదు. అయితే, ముద్దముద్దకూ ‘భగవన్నామం’ చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు. వండిన అన్నం నుంచి ఒక ముద్ద తీసి, నేయి వేసి, ‘యజ్ఞేశ్వార్పణం’ అంటూ మండే పొయ్యిలో వేయాలనే నియమముంది. భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి. దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి. అలాగే కుక్కలకు కూడా న్నం పెట్టాలి. మొదటగా ప్రాణులకు పెట్టే భుజించాలి. అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి. సన్యాసులకూ, సాధువులకూ ఆహారమివ్వాలి. పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథలకు, దీనులకు భోజనం పెట్టాలి. ఆకలే అర్హత. ఆకలిగొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్థు ధర్మం.

అంగరకసంకష్టహరచతుర్థి పురస్కరించుకుని జైజై గణేశా నామ స్మరణతో కిక్కిరిసిన భక్తులతో జనసంద్రమైన శ్వేతార్కగణపతి క్షేత్రం

తెలంగాణ గణపతిగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ఏకైక స్వయంభు గణపతిదేవాలయ క్షేత్రమై శివ కేశవులకు నిలయంగా ఉండి 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ దేవాలయ క్షేత్రంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజిపేట విష్ణుపురిలో వెలసిన స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవలయముల క్షేత్రంలో 25 డిసెంబర్ 2018 నాటి రోజున  ఉదయం 5.30ని౹౹ల నుండి వేలాది మంది భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకొనుటకు విచ్చేసారు.

నిత్య మంగళవారం పూజలతో పాటుగా సంకష్టహర చవితి పూజలు వైభవోపేతంగా జరిగాయి.. ఉదయం 5.30 ని౹౹ల నుండి పంచామృత,పంచవర్ణ, సహస్రధారభిషేక సేవలు, ఉ.10 గం౹౹ల నుండి నిత్యా సహస్రమోదక రుద్ర పంచంసూక్త నవగ్రహ హోమములు మధ్యాహ్నం 12 గం౹౹లకు శ్రీస్వామివారికి ప్రీతిగా సంగీత,గాత్ర సహిత సహస్రనామార్చన సేవలు జరిగాయి. తిరిగి సాయంత్రం 4గం౹౹లకు సిద్ది బుద్ధి సమేత శ్రీగణపతిస్వామి కి కళ్యాణోత్సవం, సా.5గం౹౹లకు దూర్వా, లాజ హోమము మరియు నిత్య మంగళవార ప్రదోషకాలపూజ, సాయంత్రం 6.20ని౹౹ల నుండి శ్వేతార్క గణపతి స్వామివారికి *438 లీటర్ల తేనేతోమహామధురాభిషేకము* ను జరుపబడింది.ఈ పూజకు వివిధ రాష్ట్రాల నుంచి భారిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు తమ మహత్భాగ్యంగా జైజై గణేశా అనే నామస్మరణతో  శ్రీస్వామివారిని బంగారువర్ణములో దర్శనమును చేసుకొని మధురానుభూతిని పొందినారు…తదుపరి భక్తులకు తేనెప్రసాదమును వితరణ చేయడం జరిగింది. శ్వేతార్కాగణపతి స్వామివారికి జరిపిన తేనె అభిషేక ఫలిత విశేషాలను భక్తులకు తెలియజేసి హారతి,తీర్థప్రసాదాలు అందచేయబడింది. మరియు నిన్నటి రోజున 4000మందికి వరకు మహా అన్నదానం జరుపడమైనది…

శాంతాకారం – శ్లోకంలోని అద్భుత భావన

ఓం శ్రీ మాత్రేః నమః

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!
ఇందులో సృష్టిక్రమం..

సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..

ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
శాంతాకారం

సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.

శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.

అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.

శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.
భుజగ శయనం

భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.

ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు. 

కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.
పద్మనాభం

సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం. 

దానికి నాభి (కేంద్రం) విష్ణువే. 

అందుకే ఆయన ‘పద్మనాభుడు’.
సురేశం

విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు, 

విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.

నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు 

(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.

ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.

అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు. 
విశ్వాధారం

కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు. 

సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.

కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’. 

అలల ‘ఆకారం’  అంతా జలమే. 

జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..

విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.
గగన సదృశం

ఇది ఎలా సంభవం?

ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది. 

సమస్తమూ ఆకాశము నందే ఉన్నది. 

అదేవిధంగా ఆకాశంతో సహా, 

సమస్త విశ్వమూ ఎవరియందు, 

ఎవరిచే వ్యాప్తమై ఉందో, 

అతడే పరమాత్మ. 

అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది. 

ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది. 
మేఘవర్ణం

నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..

తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.

ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.
శుభాంగం

మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది. 

అందుకే అది నీలమేఘశ్యామం.

ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే. 

కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు. 

తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు. 

అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.

లక్ష్మీ_కాంతం

ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి. 

ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి, 

ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది. 

అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’. 

కమల_నయనం

ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.

కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.

యోగిహృద్యానగమ్యం

ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు. 

యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు. 

ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.

వందే విష్ణుం  భవ భయహరం

విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.

ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.

సర్వలోకైకనాథమ్

సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.

14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.

ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.

ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని, 

ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా, 

మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.
అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే, 

దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని, 

సులభంగా అందుకోగలం.
ఇలా విశ్లేషిస్తే – ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవచ్చు.

కార్తీక మాసశివరాత్రి పురస్కరించుకుని సంతాన నాగలింగేశ్వర స్వామివారికి అన్నాభిషేకం మరియు సుగంధ ద్రవ్య కలశాభిషేకం

శివకేశవుల పవిత్రమాసమైన కార్తీకమాసంలో మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు 29 దేవతామూర్తులతో శివ కేశవుల నిలయంగా కాజీపేట తెలంగాణ గణపతిగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లా కాజీపేటలోని సుప్రసిద్ధ క్షేత్రమైన స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దివ్యక్షేత్రంలో కొలువుదీరిన సంతాన ప్రదాత శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి సకల కార్య సిద్దికి, ఐహిక వాంఛల సిద్ధి కొరకు, సర్వ గ్రహ దోష నివారణకై,  ప్రత్యేక  సుగంధ ద్రవ్యములతో కలశాభిషేకం మరియు అన్నాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకములు తదుపరి 10 గంటల నుండి రుద్ర నమక చమక పంచసూక్తాలు మరియు పాశుపత హోమములు విశేషంగా జరిగినాయి. ఇందులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రులైన వారు. మాస శివరాత్రి  పురస్కరించుకొని సాయంత్రం 7 గంటల నుండి రుద్రక్రమర్చన,కార్తీక పురాణమ్, దీప సమారాధన , సహస్రదీపాలంకరణ సేవ మరియు ధాత్రి నారాయణ పూజలు , శివ భజనలు విశేషించి జరిగాయి. 

 కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్వేతార్కాలో ప్రత్యేక పూజలు అభిషేకాలు సత్యనారాయణ స్వామి వ్రతములు

శివకేశవుల మాసమైన కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణలోనే ప్రధాన  గణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లా కాజిపేటలోని స్వయంభు శ్రీశ్వేతర్కమూలగణపతి దేవాలయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఉదయం 5.30 శ్వేతార్కగణపతి సుప్రభాత సేవ, 6గంటల నుండి 11 గంటల వరకు శివ రుద్రాభిషేకాలు, తదుపరి అర్చనాధులు, ఉదయం 11నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగును. సాయంత్రం6 గంటలకు రుద్రక్రమార్చన రాత్రి 7 గంటలకు కార్తీక పురాణ పఠనం ఆకాశదీపారాధన సహస్ర దీపాలంకరణ విశేష పూజలు నిర్వహిస్తారు. భక్తులు కార్తీక దానములు,బ్రాహ్మణ సాహిత్య దానములు దేవాలయ సన్నిధిలో స్వీకరించబడును… భక్తులు అభిషేకము జరిపించుకొనువారు పంచామృతములు, కోబరికాయలు,దీప సామగ్రి మరియు వ్రతం చేయువారు సామగ్రి ఇత్యాదివి తామే తెచ్చుకోవాలి. *తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.* భక్తులు రేపటి పూజల్లో పాల్గొనువారు కనిసంగా ఒక గంట ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9394810881 నందు సంప్రదించగలరు. ఇట్లు దేవాలయ నిర్వాహకులు…..  www.swetharka.org

23నే కార్తీక పౌర్ణమి శివాభిషేకములు, సత్యనారాయణ స్వామి వ్రతములు

గమనిక :- కార్తీకపౌర్ణిమి రేపు అనగా శుక్రవారము జోలాతోరణం🌹
🌕 కార్తీక పౌర్ణమి🌕

తేదీ:- 22/11/18 నాడు ఉదయం:-12:30 నుండి

తేదీ:-23/11/18

ఉదయం:-11:34 వరకు పౌర్ణమి తిధి ఉండటం వలన.

🔥కృత్తిక దీపారాధన  జ్వాలాతోరణం కేదారేశ్వర వ్రతాలు పౌర్ణమి ఉపవాసాలు అంటే చంద్రదర్శనం తో చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ 22వ తేదీ గురువారం నాడు చెయ్యాలి🔥

పౌర్ణమి సత్యనారాయణ వ్రతాలు దాన ధర్మాలు రుద్రాభిషేకాలు 23వ తేదీ శుక్రవారం నాడు చేసుకోవాలి .

కార్తీక పౌర్ణమి విశిష్టత: పురాణ ప్రాశస్త్యం.. త్రిపుర పూర్ణిమ పేరు వెనుక!
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాంసం .
అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.
‘శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున , కావున మానవాళికి వారిద్దరిని కోలిచి తరింస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ‘ప్రాశస్త్యం’ కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.
సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ఈరోజు (పౌర్ణమి)దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి.

ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి.
శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి.
వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది.
ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా… పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను
పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు.
ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.

ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం.
ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది.
ఈ రోజున స్త్రీల కోరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి . పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతాయి . ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం.
శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.
*నేడు ప్రత్యేకంగా చేయవలసినవి :*
దైవ దర్శనం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది.

ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందండి. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి, జైశ్రీమన్నారాయణ.
గమనిక  -॥॥కార్తీకపౌర్ణిమి రేపు అనగా శుక్రవారము జోలాతోరణం🌹

18 11 అనంతవచనం

ఏ పని చెప్పినా… రాదనకు,కాదనకు.

ఆలోచించు, ప్రయత్నించు, ఆచరించు.

 అప్పుడు నీకన్ని పనులు వచ్చి తీరుతాయి.

*అనంతవచనం*

11.11 అనంతవచనం

ఒక మాట అనేప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అన్న మాట అబద్ధమని తెలిస్తే మనమే సిగ్గు పడాల్సి వస్తుంది.

*అనంతవచనం*

11.11.2018

15 11 అనంతవచనం

చెల్లిపోయిన కాలం గురించి ఆలోచించకు. వచ్చే వర్ధమాన కాలం గురించి జాగ్రతపడు. రేపటి పని గురించి ఈ రోజే ఆలోచించేవారు చాలా కాలాన్నిసంపాదించుకోగలరు

*అనంతవచనం*

15.11.2018

11.11 అనంతవచనం

ఒక మాట అనేప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అన్న మాట అబద్ధమని తెలిస్తే మనమే సిగ్గు పడాల్సి వస్తుంది.

*అనంతవచనం*

11.11.2018