14 11 అనంతవచనం

మన విజయాలను మనం చెప్పుకోవడం కాకుండా..

మన విజయాలను ఎదుటి వారు చెబుతుంటే… మనకు మరింత బాధ్యతతెలుస్తుంది. 

*అనంతవచనం*

14.11.2018

12.11 అనంతవచనం

గతమెప్పుడు గుణపాఠం గాను,వర్తమానమెప్పుడు కర్తవ్య ప్రభోదనంగాను, భవిష్యత్తు ఎప్పుడూ ఉపకారం కొరకు గాను ఆలోచించి పయనించడమే 

ప్పుట్టిన రోజు పండుగ గా కావాలి.

*అనంతవచనం*

12.11.2018

13.11 అనంత వచనము

రోగిని రోగిలానే చూడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయడం వలన రోగి తొందరగా కోలుకోవడానికి తేలికవుతుంది. అలాగే ప్రయత్నం లో విఫలమైన వారిని మరింత ప్రేమతో ప్రోత్సహిస్తే వారికి ధైర్యం కలిగి విజయవంతులవుతారు.

*అనంతవచనం*

13.11.2018

తిరిగి శ్రీశ్వేతార్కగణపతిస్వామివారి సేవల్లో అనంతమల్లయ్య సిద్ధాంతి గారు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూల(మహా)గణపతి క్షేత్ర వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారు గత కొంత కాలం క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికి విధితమే ఇంకా ఆరోగ్యం నిలకడగా రావల్సివున్న స్వామివారూ ఇచ్చిన తన పునర్జన్మను శ్వేతార్కుడికి సేవల్లో తరించాలని తన 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయుష్య హోమము జరిపి నేటి మంగళవారం స్వామివారి అభిషేకముతో స్వామివారి సేవలో పాత్రులవుతున్నారు…

శ్వేతార్కాలో నేటి నుండి నిత్యా మంగళవార పూజ సమయాలలో మార్పులు

*ఈ రోజు నుండి పూజా సమయాలలో మార్పులు*
శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో జరుపబడే నిత్యమంగళవార పూజా సమయాలలో మార్పులు చేయడం జరిగింది.
ఉదయం 5.30ని.లకు

సుప్రభాతము

మంగళ వాయిద్య సేవ
ఉదయం 6.45ని.లకు

మంగళ స్నానము అభిషేకము ప్రారంభము
ఉదయం 7.15ని.లకు

బాలభోగా నివేదన
ఉదయం 7.20ని..లకు

అలంకార పూర్ణజలాభిషేకం

దివ్యహారతి,మార్జనము,

తెరవేయుట.
ఉదయం 8.20ని.లకు

అలంకారము,అర్చన,హారతి,తీర్థప్రసాదా వితరణ.
ఉదయం 8.45 నుండి 11.00గ.ల వరకు 

వరకు భక్తుల గోత్రనామాలచే అర్చనలు జరుపుట.
ఉదయం 9.30ని.లకు 

హోమము ప్రారంభము
పగలు 11.00గ.లకు 

తెర వేయుట
పగలు 11.10ని.లకు

వినాయకవ్రతములు 
పగలు 11.20ని.లకు

మహార్చన ప్రారంభం
పగలు 12.45ని.లకు

మహానివేదన
పగలు 12.30ని.ల నుండి

1.30 ని.ల వరకు అన్నదానం
పగలు 1.00గ.లకు

దేవాలయం మూసివేయుట
తిరిగి
సాయంత్రం 4గ.లకు

దేవాలయం తెరుచుట
సాయంత్రం 4.10ని.ల నుండి5.30ని.ల వరకు

భక్తుల గోత్రనామాలచే అర్చనలు జరుపుట.
సాయంత్రం 5.32ని.లకు తెరవేయుట
సాయంత్రం 4.45ని.లకు

శ్రీ స్వామి వారి కళ్యాణం
సాయంత్రం 5.55ని.లకు

తెర తీయుట
సాయంత్రం 6.00గ.లకు

అర్చన
సాయంత్రం 6.10ని.లకు

ప్రదోషకాల పూజ ఆరంభం
రాత్రి 7.15ని.లకు 

దర్బారు సేవ
రాత్రి 7.35ని.ల కు 

విభూది ప్రసాదవితరణ
రాత్రి 7.35ని.ల నుండి

అన్నదానము
రాత్రి 8.00గ.లకు

దేవాలయము మూసి వేయుట
—–ఈ మార్పులు వచ్చే ఫిబ్రవరి 2019 వరకు అమలులో ఉంటాయి.
—–చలికాలం అయినందున భక్తుల సౌకర్యార్థము ఈ మార్పు చేయబడింది.
——-సమయ పాలనను. ఆచరించ గలరు.
—–సిబ్బందికి,కార్యకర్తలకు

భక్తులు సహకరించి గలరు.
ఇట్లు

ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

దేవాలయ వ్యవస్థాపకులు

www.swetharka.org

రేపే నాగుల చవితి

*నాగుల చవితిని పురస్కరించుకుని శ్వేతార్కలో ప్రత్యేక పూజలు*
తెలంగాణ గణపతిగా ప్రసిద్ది చెందిన వరంగల్ జిల్లాలోని కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రంలో కొలువైవున *సంతననాగలింగేశ్వర స్వామివారికి మరియు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు*

 ప్రత్యేక అభిషేకాలు,అర్చనాది పూజలు జరుగనున్నాయి… ఉదయం 5.30ని నుండి 10వరకు పంచామృత బిల్వదళా ఏకవార రుద్రాభిషేకాలు..రుద్రాక్రమార్చనాధులు ప్రత్యేకంగా సంతానం కోరువారు,సంతానలో చికాకులు,కుజరిష్ఠ దోష నివారణ పూజలు జరుగును…. సాయంత్రం 6.30ని ల నుండి శివ సహస్రనామ పారాయణములు కార్తీక ఆకాశ దీపసమారాధనలు, కార్తీక పురాణ పఠనం జరుగును…భక్తలు పూర్తి వివరాలకు మరియు పూజలలో పాల్గొనువారు 9394810881నందు సంప్రదించగలరు…
*_”నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా?*_
🕉🐍🕉🐍🕉🐍🕉🐍🕉🐍🕉
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
_*”నాగుల చవితి పూజా విధానం*_
నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు *నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను* పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో *“ఓం నాగేంద్రస్వామినే నమః”* అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.
నాగుల చవితి నాడు పఠించవలసినవి
శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ II కరావలంబ స్తోత్రము

🙏🙏🙏🙏🙏🙏🙏

దేవునికి సమీపమున

దేవునికి సమీపమున నివసించే విధానమే ఉపవాసం. అంతేగాని

అచేతనంగా ఉన్న శరీరాన్ని మరింత బలహీన పర్చుకోవడానికి కాదు

*అనంతవచనం*

కార్తీక దామోదర అష్టోత్తర నామాలు

కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే దీనికి చిలుకు ద్వాదశీ అని పేరు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగర శయనుడైన శ్రీమహావిష్ణువు మేల్కొని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీ సమేతంగా తులసివనానికి తరలివస్తాడని ప్రతీతి. తులసి పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుని కుమార్తె. ఆమెను జలంధరుడు అనే రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశారు. జలంధరుడు ఈశ్వర అంశ సంభూతుడు. సముద్రపుత్రుడు కావడం వలన దేవతలు సముద్రుని నుండి వశపరచుకున్న కౌస్తుభమణి, కామధేనువు, కల్పతరువు మొదలైన వాటిని తనకు ఇవ్వవలసిందిగా ఇంద్రుడిని జలంధరుడు కోరాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోవడంతో ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు జలంధరుడు. జలంధరుడి భార్య ఎవరిని చూసి తన భర్త అని మోసపోతుందో అతని చేతులలోనే సంహరించబడతాడు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు జలంధరుడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని పొందిన శ్రీమహావిష్ణువు, జలంధరుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. అది తెలుసుకున్న జలంధరుడి భార్య శ్రీమహావిష్ణువును శిలగా మారిపొమ్మని శపించింది. అందుకు విష్ణువు తులసికి నీవు ఎప్పటికీ మొక్కగానే ఉంటావు మానుకావని ప్రతిశాపం ఇచ్చాడట. అదే సాలగ్రామ శిల పూజలో ఉండటానికి కారణం అని కథనం.  కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారు. ద్వాదశి రోజున చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన పత్తిని కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని పురాణ వచనం. ఉసిరిచెట్టు విష్ణు స్వరూపం కాగా, తులసి లక్ష్మీస్వరూపం. ద్వాదశి రోజున తులసి – దామోదర వ్రతం చేస్తారు (ఉసిరి చెట్టుకి – తులసి చెట్టుకి). ఈ కళ్యాణం చేస్తే శ్రీలక్ష్మీనారాయణుల వివాహం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినవారికి శ్రీమహావిష్ణు కృప కలుగుతుంది. తులసివనంలో శ్రీకృష్ణుని విగ్రహం దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది, అంత్యంలో వైకుంఠానికి చేరుకుంటారు. తులసి వనంలో విష్ణువును పూజించనివారికి పూర్వపుణ్యాలు నశించి నరకలోకానికి వెళతారు, కోటిజన్మల పాటు పాపిగా పుడతాడు. తులసివనంలో విష్ణువును పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం కంటే మహామహా పాపాలు నశించి పుణ్యాలు పొందుతారని పురాణం చెపుతుంది. తులసివనంలో వెలుగుతున్న దీపాల మధ్య ఉన్న శ్రీమహావిష్ణువు (ఉసిరిచెట్టు)ను దర్శించి నమస్కరిస్తే వారి కోరికలు వెంటనే తీరుతాయి. ఈ రోజున దీప దానం చేయడం అత్యుత్తమం. 

                        తులసి సమేత కార్తీక దామోదర వ్రతకల్పః


(కార్తీకమాసం నెలపొడుగునా ఈ వ్రతం ఆచరించే శక్తిలేనివారు కనీసం కార్తీక శుద్ధ చతుర్థశి నాడు అయినా, ఉద్యానవనంలో ఆచరించడం శ్రేష్ఠం)
తులసిని స్థాపించి, దాని చుట్టూ తోరణాలు – నాలుగు ద్వారాలు – పుష్ప వింజామరలతో ఉన్నటువంటి చక్కటి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాలుగు దారాలతో – సుశీల, పుణ్యశీల, జయ, విజయులు అనే నాలుగు ద్వారపాలకులని మట్టితో నిర్మించి వాళ్ళని ప్రత్యేకంగా పూజించాలి. ఆయా మండలాలలో పంచలోక పాలకులని, అష్టదిక్పాలకులని, నవగ్రహాలని ఆరాధించాలి. తులసి ముందర సర్వతోభద్రం అనే రంగుల ముగ్గును వేసి, దానిమీద ప్రతిష్ట చెయ్యాలి. తరువాత తులసీధాత్రీ లక్ష్మీ సమేతంగా విష్ణువును ప్రతిష్టించాలి. బంగారు లేదా రజిత విగ్రహాలలో శ్రీహరిని ఆవాహన చేసి ఆరాధించాలి.


ధ్యానం :


శ్లో     దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్మాన్యధాః కరే !
    చక్ర మూర్థ్వకరేవామంగదా తస్యాన్యదః కరే !
    దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుం !!
    ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయనమః, ధ్యాయామి, 
ధ్యానం సమర్పయామి (పువ్వు ఉంచాలి)


మంత్రం:   ఓం సహస్ర శీర్షాపురుష !! సహా స్రాక్ష, స్సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్యా అత్యతిష్టద్దశాంగుళం !! ఓం తులసీ … కార్తీకదామోదరాయనమః ఆవాహయామి (పువ్వు ఉంచాలి)


మంత్రం:   పురుషయే వేదగ్ం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నే నాతిరోహితి, ఓం శ్రీ తులసీ … దామోదరాయనమః, ఆసనం సమర్పయామి (అక్షింతలు ఉంచాలి)


మంత్రం:  ఏకావానస్యమహిమా అతోజ్యా యాగ్ంశ్చపూరుషః పాదోస్య విశ్వాచూతాన త్రిపాదస్యామృతం దివి:! ఓం తులసీ … నమః పాద్యం సమర్పయామి (నీరు చిలకరించాలి) మః త్రిపాదూద్వై ఉదైత్పురుషః పాదోస్యేహాభావాత్పునః తతోవిశ్వజ్వ్యక్రా మత్ సాశనానశనే అభి!! ఓం శ్రీ తులసి … నమః, అర్ఘ్యం సమర్పయామి (నీరు చిలకరించాలి)


మంత్రం:     తస్మాద్విరాడజాయత విరాజో ఆధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మధోపురః! ఓం శ్రీ … నమః ఆచమనీయం సమర్పయామి (నీరు చిలకరించాలి)


మంత్రం:    ఓం యత్పురుషేన హవిషా దేవాయజ్ఞమతన్వత నసంతో ఆస్యాసీదాజ్యం గ్రీష్మయిధ్మ శరద్ధవి:!! ఓం శ్రీ … నమః, స్నాపయామి (నీరు చిలకరించాలి)[శక్తిగలవారు పంచామృత స్నానాలు చేసుకోవచ్చు


మంత్రం:    ఓం సప్తాస్యాస స్పరిధయః త్రిస్సప్తసమిదః క్రుతాదేవా యద్యజ్ఞం తన్వానా !! అదిధ్నస్పురుశం పశుం ! ఓం శ్రీ … నమః వస్త్రయుగ్మం సమర్పయామి (వస్త్రముల సమర్పణ)


మంత్రం:    యజ్ఞం బర్హిషి ప్రోక్షస్ పురుషం జాతమగ్రతః తేనదేవా అయజంత సాధ్యారుషయశ్చయే!! ఓం శ్రీ .. నమః యజ్ఞోపవీతం సమర్పయామి (యజ్ఞోపవీతం సమర్పణ)


మంత్రం:    తస్మాద్యజ్డాత్సర్వ హుతః సంభృతం వృషరాజ్యం పశూగ్ంస్తాగ్ శ్చక్రే వాయవ్యానరణ్యాన్ గ్రామాశ్చయే!! ఓం శ్రీ … నమః చందనం సమర్పయామి (గంధం చిలకరించాలి) 


మంత్రం:   తస్మాద్యజ్ఞస్త స్మదపాయత !! ఓం శ్రీ … నమః ఆభరణాన్ సమర్పయామి (ఆభరణాలు (అలంకారములు) సమర్పించాలి)


మంత్రం:     తసాదశ్వా అజాయంత యేకే జోభయాదతః గావోహిజిజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః !! ఓం శ్రీ … నమః పుష్పాణి సమర్పయామి (పువ్వు ఉంచాలి)


అథాంగపూజ :


ఓం సాదావంత కేశాయనమః – పాదౌ పూజయామి, నివృత్తనిమేషాది కాలాత్మనే జంఘే, విశ్వరూపాయ నమః జామనీ, జగన్నాథాయనమః గుహ్యం, పద్మనాభాయనమః నాభిం కుక్షిస్థాభిలనిష్పపాయనమః కుక్షిం, లక్ష్మీవిలసద్వక్షసేనమః వక్షం, చక్రాది హస్తాయనమః హాస్తౌన్, కంబుకంఠాయనమః కంఠం, చంద్రాముజాయనమః ముఖం, వాచస్వత్ యేనమః వక్త్రం, కేశవాయనమః నాసికం నారాయణాయనమః నేత్రౌ, గోవిందాయనమః శ్రోత్రే, నిగమశి రోగమ్యాయనమః శిరః, సర్వేశ్వరాయనమః సర్వాణ్యంగాని, ఓం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయనమః అథాంగపూజాం సమర్పయామి 


శ్రీ దామోదర అష్టోత్తర శతనామావళీ


ఓం విష్ణవే నమః 
ఓం లక్ష్మీపతయే నమః

ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రాహ్మణే నమః
ఓం జగన్నాథాయ నమః 
ఓం వాసుదేవాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయనమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మధురాపతయే నమః
ఓం తార్ క్ష్య వాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞరూపాయనమః 
ఓం చక్రరూపాయ నమః
ఓం గధాధరాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతలవాసాయ నమః
ఓం సముద్ర మధనాయ నమః
ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్దనాయ నమః
ఓం శ్రీకారాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం చతుర్భుజాయనమః 
ఓం పాంచజన్యాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం పాజ్గిశార్ ణ యే నమః
ఓం జనార్థనాయ నమః
ఓం పీతాంభరధరాయ నమః
ఓం టేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం లోచనాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోఢరూపాయ నమః
ఓం హృకేశాయ నమః
ఓం వాఘనాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హాలినే నమః
ఓం కలికినే నమః

ఓం హర్యాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం దేవదేవాయ నమః

ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం ధ్రువాయ నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్నుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం వక్సాకౌస్తుభధరాయ నమః
ఓం మురారాతయే నమః
ఓం అథోక్ష్జాయా నమః
ఓం ఋషిభాయ నమః
ఓం మొహినీరూపధరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృదివ్యే నమః
ఓం క్షీరాబ్ధిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అనసూయ నమః
ఓం సూర్యమండల మధ్యగాయ నమః
ఓం అనాదిమధ్యాంత నమః
ఓం భగవతే నమః
ఓం రహితాయ నమః
ఓం శంకర ప్రియాయ నమః

ఓం నీలతనవే నమః
ఓం ధరామరాయ నమః
ఓం వేదత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరథీజన్మభూమినే నమః
ఓం పాదపద్మాయ నమః
ఓం సతాం ప్రభవే నమః
ఓం సంభవే నమః
ఓం విభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః
ఓం జగత్కారణాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం దశావతారాయ నమః
ఓం శాంతాత్మనే నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః
ఓం శ్రీతులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః

శ్వేతార్కలో  ఆరంభమైన కార్తీక మాసోత్సవాలు


కార్తీక మాస సందర్భంగా శ్వేతర్కమూల గణపతి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగ లింగేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అభిషేకములను నిర్వహించారు. ఉదయం 6గంటలకు రుద్రాభిషేకం జరిపి భక్తులకు విశేష దర్శనము ఇవ్వబడింది. ఇందులో శివుడికి పంచామృతములతో,పంచవర్ణోదకములతో,సహస్రధారాలతో అభిషేకము జరిగింది. ఇందులో ఇనవూలు సాయి కృష్ణ శర్మ కల్యాణి దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం జరిపిన ఆకాశదీప ఆరంభ పూజలో మరియు కార్తీకపురాణ పఠనం జరుపబడింది.

ఈ నెల్లాళ్ళు ప్రతి సాయంత్రం 6.30ని.లకు ఆకాశదీపారాధన,పురాణ పఠనం జరుగుతుంది

ఇట్లు

ఐనవోలు వెంకటేశ్వర్లు శర్మ

దేవాలయ వ్యవస్థాపక ఛైర్మెన్

భగవంతుడిచ్చిన పునర్జీవనం–భగవంతుడికే నా సేవ అంకితం

తిరుపతిలో ప్రముఖ ఆసుపత్రి లో చూపించుకొని ..వస్తుండగా మార్గమధ్యలో కూడా అస్వస్థత కలిగింది. హుటాహుటిన ఒంగోలు లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ కావడం-చికిత్స-డిస్చార్జి అన్ని అయిపోయాయి.

ఆలోచించా..


మాలధారణ చేసి నిత్యజపం చేయాలి..భగవత్ స్మరణ తోనే అన్ని పోవాలి. (పోయిందని చెప్పిన ఈ శరీరం లోకి పునర్జీవుడుగా చేసి ఆత్మను భగవంతుడు ఇంకా ఉంచాడు కదా.. ) 

వెంటనే పూర్వాలోచనను అనుసరించి అక్కడున్న కేశవపట్నం బీచ్ కి వెళ్లి సముద్ర స్నానం చేసి మొదటి మాలను ధరించి పునీతుడనై, త్రోవలోనే బెజవాడలో కృష్ణమ్మ నదీ స్నానం చేసి రెండవ మాలను ధరించి కనకదుర్గ అమ్మ అనుగ్రహ జపబలం తో శక్తిని పొంది.మూడవ మాలను మా గురుదేవులు ఒజ్జల రాధాకృష్ణ శర్మ సిద్ధాంతి గారు తపస్సు చేసిన కోటిలింగాల రేవులో గోదావరి నదీ స్నానం చేసి మాల ధారణతో పూర్ణ శక్తిని పొందడం జరిగింది.

త్వరలో… మళ్లీ  పూజ,సాధన,జపం,భక్తులకు మునుపటి వలె కలువడం చేయాలని నిర్ణయించుకొన్నాను.
దీనికి ముందుగా పరమహంసపరివ్రజాకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి అనుగ్రహం తో,శ్రీశ్రీశ్రీమధుసూధనానంద సరస్వతి స్వామివారి అనుగ్రహం తో అమ్మా నాన్నలు,పెద్దల,ఆశీస్సులతో

శ్వేతార్కుడి సన్నిధిలో *మహా మృత్యుంజయ హోమము,అన్నసమారాధన* చేసుకోని మళ్ళీ నా జీవన యాత్రను ఆరంభం చేసుకోవాలని ఆశిస్తున్నాను.

ఇది భగవంతుడి ఆజ్ఞగా భావిస్తు….

 నా బంధువులు,కార్యకర్తలు,భక్తులు,అభిమానులు అందరూ కూడా చెప్పిన రోజున హోమం నందు పాల్గొని. 

నాకు ప్రోత్సాహాన్ని అందించగలరు.
ఇట్లుఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

Telegram: t.me/swetharka

Facebook : facebook.com/swetharka