అమ్మా నాన్న లకు ధైర్యంగా ఉంటూ ప్రేమిస్తూ ఉండాలి.అత్తామామలయందు గౌరవంగా ఉండాలి. అన్నల యందు తోడుగా ఉండాలి,తమ్ములయందు బాధ్యతగా ఉండాలి.అక్కాబావలయందు మన్ననతో ఉండాలి. చెల్లె బావలయందు అన్యోన్యంగా ఉండాలి. భార్యభర్తలు ఇంకొకరికి ఆదర్శవంతులుగా ఉండాలి. అమ్మానాన్నలు పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉండాలి. గురుభక్తి,దైవబలం కలిగి ఉన్నవారు… అందరిలోనూ మంచివారై ఉంటారు. “”””””””””‘””'”””””””””””””””””””””””””””బాంధవ్యాలు పెంచుకొంటూ పోతుంటే బంధుత్వాలు,స్నేహాలు పెరుగుతూ పోతుంటాయి.*అనంతవచనం*

శ్వేతార్కాలో 6వ రోజు “దేవి నవరాత్రోత్సవ పూజలు”

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వయంభు శ్రీ శ్వేతార్క గణపతి దేవాలయంలో అమ్మవారిని 6వ రోజున కాత్యాయని దేవి గా అలంకరించి అర్చిచడం జరిగింది. కుమారి సుష్మ శ్రీ సుస్మిత శ్రీ అలంకరించిన అమ్మవారు భక్తులను విశేషంగా ఆకర్షించింది. దుర్గాదేవి యొక్క 6వ రూపమే కాత్యాయనిదేవి ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే సకల దృష్టి దోషాలు పోతాయని ఈ దేవిని ఆరాధన చేయడం వలన మంత్ర శక్తి కలుగుతుందని,ఉపాసనా బలం పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది. నిత్య చండీ హోమ కార్యక్రమం లో బ్రహ్మ శ్రీ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఇందులో మహారాజఫాషకులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ క్రాంతిశర్మ అయినవోలువెంకటేశ్వర్లు పుష్పలత ఆద్వర్యంలో అమ్మవారికి పూజలను నిర్వహించారు. దేవాలయ సిబ్బంది ఎల్ రవి, సుధీర్, శ్రీనివాస్, అచ్యుత్,మణిదీప్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీమతి మహతి,కల్యాణి ఆలపించిన హారతులు భక్తులను అలరించాయి. భక్తులు దేవాలయంలో బతుకమ్మ ఆట ఆడారు. పూజ అనంతరం భక్తులకు అన్నదానం జరుపబడింది.

ఇట్లు

అనంతమల్లయ్యసిద్ధాంతి

జీవితం లో కొన్ని మలుపులు వస్తుంటాయి.అలాంటప్పుడు.మంచినిర్ణయాలు తీసుకొంటారు.ఆ తీ సుకొనే నిర్ణయాలు సరైనవిగా ఉండాలి.మళ్లీమళ్లీ మార్చేవిగా ఉండరాదు.అప్పుడే జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశం ఉంటుంది.

అనంత వచనం 15.10.2018

తప్పని తెలిసినప్పుడు సరిదిద్దుకో..అంతేగాని తప్పుకు మరో తప్పును చేస్తూ కప్పిపుచ్చకు. అలా చేస్తే..నీవు కూర్చున్న చెట్టుకొమ్మను నీవే నరుక్కొంటున్నట్టుగా ఉంటుంది.
నిజం చెప్పలేని తప్పు ఎప్పుడైనా తప్పటడుగులే వేయిస్తుంది.
*అనంతవచనం*

Festivals

*ఘనంగా జరిగిన సరస్వతి మాత పూజలు*

స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం లో జరుపబడుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున అమ్మవారిని కాత్యాయని రూపములో అలంకరించి అర్చించడం జరిగింది. ఈ రోజున మూలా నక్షత్రము అయినందున దేవాలయం లో కొలువై ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక హరిద్ర ఉదకము తో అభిషేకము జరుపబడినది . అయినవోలు సాయి కృష్ణ శర్మ ఆనందశర్మ అభిషేకమును నిర్వహించారు. అనంతరం చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసము నిర్వహించడం జరిగింది. అమ్మవారిని ప్రత్యేకముగా అలంకరించడం జరిగింది. ఈరోజు నిత్య సహస్ర మోదక హోమము మరియు నిత్య చండీ హోమము జరుపబడినది. బ్రహ్మశ్రీ క్రాంతి శర్మ మరియు అయినవోలు రాధాకృష్ణశర్మ అమ్మవారి పారాయణము చేశారు .. బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుప బడినవి . కుమారి సుష్మ సుష్మిత లు అలంకరించిన అమ్మవారి రూపము భక్తులను విశేషంగా ఆకర్షించింది .మహతి శర్మ,కల్యాణి శర్మ,శారదా,సాయకుమారీ ఆలపించిన మంగళహారతులు భక్తులను మైమరపించాయి

ఇట్లు
అయినవోలు
అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి