వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కూడరై పూజలు


స్వయంభు శ్రీ శ్వేతార్కగణపతి దేవాలయం లో కొలువు తీరిన శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజున ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఉదయం ఏడు గంటలకు కుడారి ఉత్సవమును వైభవంగా జరుపబడినది. 108దొప్పలలో ప్రత్యేకంగా తయారు చేసిన గూడారపుపొంగలిని నివేదన చేసి పూజించారు.ఈ కార్యక్రమములో దేవాలయ రాజ పోషకులు హరిపురం రవీంద్రనాథ్ సునంద దంపతులు పాల్గొన్నారు. మరియు దేవాలయ కార్యకర్తలు శ్రీనమ్మ,సుజాత,లతాశ్రీ ,ఉమ,రాజకుమార్, కల్పన, సౌజన్య,జయమ్మ,వనజ తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి గోవింద నామములు విష్ణు సహస్రనామ పారాయణము సామూహికంగా జరిపారు. శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక తులసిమాలలతో అలంకారం చేశారు . హరిస్వామి మరియు దేవాలయం అర్చకులు ఈ పూజల్లో పాల్గొన్నారు .
ఇట్లు
టంటం దయాకరస్వామి
దేవాలయపూజా కార్యక్రమ నిర్వాహకులు

13.01.2020 సంకష్టహరచవితి శ్వేతార్కగణపతికి విభూది మరియు బిల్వపత్రాలతో అభిషేకం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో 13.01.2020 సోమవారం రోజున సంకష్టహరచవితిని పురస్కరించుకొని శ్రీశ్వేతార్కగణపతికి సా. 5 గం౹౹లకు దుర్వాహోమం మరియు సా. 6 గం౹౹లకు విభూది మరియు బిల్వపత్రాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. రాత్రి 6.45 ని౹౹లకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, రాత్రి 7.10 ని౹౹లకు అర్చన,హారతి, తీర్థప్రసాద వితరణ, రాత్రి 8గంటలకు మహాన్నదానము జరుగానున్నాయని ఆలయ వేద పండితులు ప్రకటించారు. భక్తులు అభిషేకమునకు సాయంత్రం 5గంటల లోపున పూలు,పూలమాలలు, పసుపు, కొబ్బరికాయలు,విభూది మరియు బిల్వపత్రాలను తీసుకురావాల్సిందిగా సూచించారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు.
–శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం.
౼౼ ఈ పూజలో గోత్రనామాలు చదివించ దలచినవారు (అభిషేకం-101₹,దుర్వా మరియు లాజహోమము-251₹,అర్చన-51₹) 9347080055 నెంబర్నకు (gpay,phone pe,paytm) ద్వారా చెల్లించి మీ గోత్రనామలు చదివించుకోగలరు, గోత్రనామాలు 9394810881 నెంబర్కి వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేయగలరు.
— మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.
— కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని, నాగదండమును దర్శనం చేసుకొని తరించగలరు.
ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు సమచారమునకుTelegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.

ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app
ఇట్లు దేవాలయ పరిపాలన నిర్వాహకులు

*ఐనవోలు సాయి కృష్ణ శర్మ*