శ్వేతార్కాలో 2020 క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారు

2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆంగ్ల మాసముల క్యాలెండర్ను కాజిపేట శ్వేతార్కగణపతి దివ్య క్షేత్రంలో దేవాలయ ఆస్థాన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారి (రంగంపేట) కరకమలములచే క్యాలెండర్ ఆవిష్కరించబడినది. భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మరియు రంగంపేట మదనానంద సరస్వతీ క్షేత్ర ఆస్థాన సిద్ధాంతి, కాజీపేట శ్వేతార్కమూలగణపతి దేవాలయ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారిచే రచింపబడిన పంచాంగ గణిత తిథి వార నక్షత్రాలు మరియు రాబోయే శర్వారినామ సంవత్సర దినదర్శిని , తెలంగాణ రాష్ట్ర విద్వత్సభలో నిర్ణయించిన పండుగలను ఇందులో చేర్చబడినవి. అయినవోలు సాయికృష్ణ శర్మ కళ్యాణి దంపతులు శ్రీస్వామివారికి మొదటి క్యాలెండర్ అందించారు. ఈనాటి కార్యక్రమంలో భక్తులు దేవాలయ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు… ఇట్లు అయినవోలు సాయికృష్ణశర్మ దేవాలయ పరిపాలన నిర్వాహకులు

శ్వేతార్కలో భక్తుల సందడి… 1008 ఉండ్రాళ్ళతో పుష్యర్క యోగ సంకష్టహరచవితి అభిషేకం

ెలంగాణ గణపతిగా బాసికెక్కిన కాజిపేట శ్వేతార్కగణపతి ప్రకృతి స్వరూపంగా అర్క వృక్షజాతి సంతతికి చెందిన చెట్టు మూలం నుండి స్వయంగావెలిసిన గణపతి స్వామివారికి ఈరోజు చాలా ప్రీతికరమైనరోజు… ఈరోజు ఆదివారం పుష్యమి నక్షత్రం చవితి తిథి కావడం అన్ని కూడా గణపతి ప్రీతికరమైన అంశములు అవడం విశేషం. క్షిరాసాగర మధనంలో లక్ష్మీదేవి పుష్యమీ నక్షత్రంతో కూడుకొని రావడం ఆతరువాత గణపతి తెల్లజిల్లేడు చెట్టు పై శ్వేతర్కగణపతిగా రావడం జరిగింది అని పురాణాల్లో గమనించవచ్చు.

శ్వేతార్కగణపతి సన్నధిలో ఈరోజు గణపతి ప్రీతికరమైన సంకష్టహరచవితి కూడా ఈరోజే అవడం విశేషంగా తెలుపవచ్చు. వివిధ జిల్లా కేంద్రాలనుండివిచ్చేసిన భక్తులచే స్వయంగా తయారుచేసిన 1008 ఉండ్రాలతో గణపతికి అభిషేకం చేయడమైనది. ఇంట్లో చికాకులు, విఘ్న దోషాలు, జాతకదోషాలు, వాస్తు దోషాలు మరియు ఆరోగ్యం, చర్మ సంబంధిత రోగనిరోధక శక్తిని ప్రసాదించాలని కోరుతూ శ్వేతార్కగణపతికి ఈ అభిషేకం చేయడమైనది. తదుపరి ఉత్సవ మూర్తుల ఊరేగింపుగా ఆలయ పురవీధుల్లో నగరసంకిర్తన చేసి అనంతరం హారతి, మంత్రపుష్పం,భక్తులకు అన్నపూర్ణ భవనంలో అన్నదానం జరిగింది. కార్యకర్తలు శ్రీనివాస్,ప్రదీప్,శేషశై,అరుణ్,నమోనరాయణ,జయ్యమ్మ,అరుణ,పద్మ,గుణవతి,ఉమాదేవి,లక్ష్మి,శ్రీన్నమ్మ,రజిత మరికొందరు కార్యకర్తలు భక్తులకు అన్నప్రసాదా ఏర్పాట్లు చూసుకున్నారు.