గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ సోత్రం

🙏🙏🙏

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥
॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

శ్వేతార్కలో కేతు గ్రస్త సూర్యగ్రహణ అమావాస్య సందర్భంగా ప్రత్యేక నాగదండ పూజలు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ శివ కేశవుల క్షేత్రమైన 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక వాహన దంపత సమేత నవగ్రహ క్షేత్రమైన కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రములో

— ఈరోజు కేతు గ్రస్త సూర్య గ్రహణం మరియు గురు అమావాస్య సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ సంతాన నాగలింగేశ్వరస్వామివారికి విశేష రుద్రాభిషేకములు మరియు బిల్వార్చనలు ప్రత్యేకంగా శ్వేతార్కగణపతిస్వామివారి ఆభరణమైన నాగదండమునకు విశేష పూజలు జరుగనున్నాయి.

— ఇక్కడి శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు చెట్టులో స్వయంగా స్వామివారి ఆభరణామ్ స్వయంగా ప్రకృతి స్వరూపమైన అడవులలో లభించడం అర్కము అంటే సూర్యునికి సంబంధించినదై ఈరోజు సూర్యగ్రహణం కలసిరావడంతో ప్రత్యేకించి పూజలు నిర్వహించడం జరుగుతున్నది

— గురుదోషాలు,కుజదోషం, నాగ దోషములు కాలసర్ప దోషం జాతకంలోని గ్రహస్థితి ననుసరించి సంతాన దోషాలు,రాహుకేతు కాలసర్పదోషాలు పోతాయి.

— కోర్టు సమస్యలు చికాకులు దాంపత్య జీవితంలోని సమస్యల నుండి విముక్తికై ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.

౼౼ అలాంటి వారు ఈ రోజున ప్రదోషకాలములో నాగ దండమును ఆరాధించినచో మంచిదని తెలుస్తుంది.

౼౼ ఈ రోజున విశేషించి తెల్ల జిల్లేడు పూవులతో మరియు ఎర్రని మందార పువ్వులతో గణపతికి ఆయుధమైన నాగదండమును పూజించిన, గణపతికి ప్రీతికరంగా 16 ప్రదక్షిణాలు చేసినా కోరిన కోరికలు నెరవేరుతాయి.

౼౼ ఈ సందర్బంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు దేవాలయములో గల నాగదండమునకు ప్రత్యేక అలంకరణ , హారతి భజనలతో విశేష పూజా కైంకర్యాలు జరగనున్నవి. భక్తులు కొబ్బరికాయ, పూలు (తెలుపు,ఎరుపు), పూలమాలలు,శర్కర, బెల్లం తీసుకొనిరగలరు..

౼౼ ఈ పూజలో గోత్రనామాలు చదివించ దలచినవారు 101 ₹ 9347080055 నెంబర్నకు (gpay,phone pe,paytm) ద్వారా చెల్లించి మీ గోత్రనామలు చదివించుకోగలరు, గోత్రనామాలు 9394810881 నెంబర్కి వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేయగలరు

— మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.

— కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని, నాగదండమును దర్శనం చేసుకొని తరించగలరు.

ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు సమచారమునకుTelegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు.

ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app

ఇట్లు
దేవాలయ పరిపాలన నిర్వాహకులు

*ఐనవోలు సాయి కృష్ణ శర్మ*

9వ రోజు తిరుప్పావై live

https://m.facebook.com/story.php?story_fbid=1208349436018690&id=100005309344868&sfnsn=wiwspmo&extid=9gMxTBAx5aPoDWEf&d=n&vh=i

శ్వేతార్కాలో 2020 క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారు

2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆంగ్ల మాసముల క్యాలెండర్ను కాజిపేట శ్వేతార్కగణపతి దివ్య క్షేత్రంలో దేవాలయ ఆస్థాన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామివారి (రంగంపేట) కరకమలములచే క్యాలెండర్ ఆవిష్కరించబడినది. భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మరియు రంగంపేట మదనానంద సరస్వతీ క్షేత్ర ఆస్థాన సిద్ధాంతి, కాజీపేట శ్వేతార్కమూలగణపతి దేవాలయ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారిచే రచింపబడిన పంచాంగ గణిత తిథి వార నక్షత్రాలు మరియు రాబోయే శర్వారినామ సంవత్సర దినదర్శిని , తెలంగాణ రాష్ట్ర విద్వత్సభలో నిర్ణయించిన పండుగలను ఇందులో చేర్చబడినవి. అయినవోలు సాయికృష్ణ శర్మ కళ్యాణి దంపతులు శ్రీస్వామివారికి మొదటి క్యాలెండర్ అందించారు. ఈనాటి కార్యక్రమంలో భక్తులు దేవాలయ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు… ఇట్లు అయినవోలు సాయికృష్ణశర్మ దేవాలయ పరిపాలన నిర్వాహకులు

శ్వేతార్కలో భక్తుల సందడి… 1008 ఉండ్రాళ్ళతో పుష్యర్క యోగ సంకష్టహరచవితి అభిషేకం

ెలంగాణ గణపతిగా బాసికెక్కిన కాజిపేట శ్వేతార్కగణపతి ప్రకృతి స్వరూపంగా అర్క వృక్షజాతి సంతతికి చెందిన చెట్టు మూలం నుండి స్వయంగావెలిసిన గణపతి స్వామివారికి ఈరోజు చాలా ప్రీతికరమైనరోజు… ఈరోజు ఆదివారం పుష్యమి నక్షత్రం చవితి తిథి కావడం అన్ని కూడా గణపతి ప్రీతికరమైన అంశములు అవడం విశేషం. క్షిరాసాగర మధనంలో లక్ష్మీదేవి పుష్యమీ నక్షత్రంతో కూడుకొని రావడం ఆతరువాత గణపతి తెల్లజిల్లేడు చెట్టు పై శ్వేతర్కగణపతిగా రావడం జరిగింది అని పురాణాల్లో గమనించవచ్చు.

శ్వేతార్కగణపతి సన్నధిలో ఈరోజు గణపతి ప్రీతికరమైన సంకష్టహరచవితి కూడా ఈరోజే అవడం విశేషంగా తెలుపవచ్చు. వివిధ జిల్లా కేంద్రాలనుండివిచ్చేసిన భక్తులచే స్వయంగా తయారుచేసిన 1008 ఉండ్రాలతో గణపతికి అభిషేకం చేయడమైనది. ఇంట్లో చికాకులు, విఘ్న దోషాలు, జాతకదోషాలు, వాస్తు దోషాలు మరియు ఆరోగ్యం, చర్మ సంబంధిత రోగనిరోధక శక్తిని ప్రసాదించాలని కోరుతూ శ్వేతార్కగణపతికి ఈ అభిషేకం చేయడమైనది. తదుపరి ఉత్సవ మూర్తుల ఊరేగింపుగా ఆలయ పురవీధుల్లో నగరసంకిర్తన చేసి అనంతరం హారతి, మంత్రపుష్పం,భక్తులకు అన్నపూర్ణ భవనంలో అన్నదానం జరిగింది. కార్యకర్తలు శ్రీనివాస్,ప్రదీప్,శేషశై,అరుణ్,నమోనరాయణ,జయ్యమ్మ,అరుణ,పద్మ,గుణవతి,ఉమాదేవి,లక్ష్మి,శ్రీన్నమ్మ,రజిత మరికొందరు కార్యకర్తలు భక్తులకు అన్నప్రసాదా ఏర్పాట్లు చూసుకున్నారు.

గాజులు అందానికే కాదు… సౌభాగ్యాన్ని చిహ్నం…

గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి..
ఎరుపురంగు గాజులు శక్తిని..
నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని..
ఉదారంగు గాజులు స్వేచ్ఛ ని..
ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని..
పసుపు రంగు గాజులు సంతోషాన్ని..
నారింజ రంగు గాజులు విజయాన్ని.. తెల్లరంగు గాజులు ప్రశాంతతని..
నలుపురంగు గాజులు అధికారాన్ని..
ఇలా మట్టిగాజులు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునేమట్టిగాజులకి..
అందుకే సుమంగళి స్త్రీ లు తప్పానిసరిగా ధరిస్తారు.
ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా… ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది.
శెక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమ తో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం.
ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.
స్త్రీ వేసుకునే గాజులకి ఇంత విశిష్టత.
🌺🌺శుభ శుభోదయం మిత్రులందరికీ 🌺🌺

శ్వేతార్కాలో రేపు గీతజయంతి వేడుకలు

శ్రీ వికారి నామ సంవత్సరే,మార్గశిరమాసే,
హేమంతఋతువు,దక్షిణాయనే,శుక్లపక్షే
ఏకాదశినాడు కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి దివ్య క్షేత్రంలో కొలువైవున్న భామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం మరియు భాగవత్గీత పారాయణము తులసీ అర్చన జరుగును… లోకహితమై పరమాత్మ అర్జునిడికి దుష్టశిక్షణ శిష్టరక్షణాకై భాగవత్గీత ను ఉపదేశించారు. అలాంటి భాగవత్గీత లోని కొన్ని ముఖ్య అంశాలు జీవితంలో భాగవత్గీత యొక్క ఆవశ్యకత ఎంతవరకు అనే అంశాలపై కాజిపేట పట్టణ పురోహితులు ఐనవోలు వెంకటేశ్వర్లు శర్మ భక్తులను ఉదేశించి మాట్లాడతారు.. తదుపరి హారతి,తీర్థప్రసాదా వితరణ జరుగును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సామూహిక భాగవత్గీత పారాయణము లో పాల్గొని శ్రీస్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు …

ఇట్లు

ఎల్.రవి

దేవాలయ మేనేజర్

గీతా జయంతి విశిష్టత……

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.

ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.
గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది .
కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ప్రతి ఇంట్లో తప్పకుండా భాగవత్గీత పుస్తకం ఉంచుకొని, వారి పిల్లలకు అట్టి పవిత్ర గ్రంథ విశిష్టతను శ్లోకాలను నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము.

జ్యోతిర్లింగ శక్తిపీఠ అష్టవినాయక యాత్ర

జనవరి నెలలో జ్యోతిర్లింగ – శక్తిపీఠ – అష్ట వినాయక యాత్ర

ఈ యాత్రలో

తుల్జా భవాని – తుల్జాపూర్
పాండురంగ క్షేత్రం – పండలాపూర్,
8 వినాయకులు – అష్టవినాయక
ప్రముఖ జ్యోతిర్లింగాలలో కొన్ని – 5 జ్యోతిర్లింగాలు

ఇంకా
శిరిడి,శనిసింగనాపూర్, బాసర, ఇత్యాదియాత్రలు చేయబడుతున్నవి.

7 లేదా 8 రోజులు ప్రయాణం

ఏసీ బస్సులో ప్రయాణం

సీటు ఒక్కంటికి 10.200₹

ఒకపూట భోజనము – ఒక పూట టిఫిన్

ముందుగా పూర్తి డబ్బులు చెల్లించిన వారికి ముందు వరుసలో నుంచి సీట్లు కేటాయించడం జరుగుతుంది.

గమనిక

డిసెంబర్ 15వ తేదీ లోపున పూర్తి రుసుమును చెల్లించి సీటు రిజర్వు చేసుకోగలరు.

పూర్తి వివరాలకై
8686398004, 9542227807 లో సంప్రదించగలరు.

ఇట్లు
M K ట్రావెల్స్

15-12-2019 సంకష్టహర చవితి శ్వేతార్కాగణపతికి ఉండ్రాళ్ళతో అభిషేకం

*15.12.2019 ఆదివారం రోజున సంకష్టహరచవితి
శ్వేతార్కగణపతికి ఉండ్రాళ్ళు మరియుపంచామృతాభిషేకము*

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో 15-12-2019 ఆదివారం రోజున సంకటహరచవితిని పురస్కరించుకొని శ్రీశ్వేతార్కగణపతికి సా. 5 గం౹౹లకు దుర్వాహోమం మరియు సా. 6 గం౹౹లకు ఉండ్రాళ్ళు,పంచామృతాలతో విశేషాభిషేకం జరుగుతుంది. తదుపరి అర్చన హారతి తీర్థప్రసాదా వితరణ జరుగును. అన్నపూర్ణ భవనంలో భక్తులకు మహాన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. బయట నుండి తెచ్చు ఉండ్రాళ్ళు దేవాలయంలో నివేధించబడవు కావున భక్తులు తామే స్వయంగా దేవాలయంలో ఉండ్రాళ్ళు తయారు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడమైనది — భక్తులు ఇట్టి అవకాశం వినియోగించుకొని శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం.