దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.
ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.
చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.🌻
భోజనం తర్వాత అస్సలు చేయకూడని పనులు🥀👍🥀భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే… డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది.బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తిండి పూర్తిగా తగ్గించేయడం, గంటల తరబడి వ్యాయామం చేయడం లాంటివి ఎన్నో చేస్తారు. అయితే… ఎన్ని చేసినా చాలమంది బరువు మాత్రం తగ్గరు. దానికి కారణం మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తే… బరువు తగ్గడం కష్టమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనమూ చూద్దాం..1. నిద్ర… కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఓ చిన్న కునుకు వేస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. నిద్ర కూడా అంతే త్వరగా పడుతుంది. దీంతో చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే.. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అరగకపోవడంతోపాటు… ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్యాలరీలు కరగడం లాంటివి కూడా జరగవని చెబుతున్నారు.2.చల్లటి నీరు… చాలా మంది భోజనం మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి భోజనం చేసిన వెంటనే మంచినీరు తాగుతారు. ఈ రెండు అలవాట్లు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక చల్లటి నీరు తాగడం మాత్రం ఇంకా ప్రమాదమంటున్నారు. భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే… డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది. భోజనం పూర్తైన 15 నిమిషాల తర్వాత మంచినీరు తాగడం ఉత్తమం.3.ఎక్కువ సేపు కూర్చోవడం… కొందరికో అలవాటు ఉంటుంది. భోజనం పూర్తైన తర్వాత కూడా తిన్న ప్లేటు ముందు నుంచి కదలరు. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయడం పూర్తవ్వగానే అక్కడి నుంచి లేవాలని చెబుతున్నారు. అలానే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందటున్నారు. అదేవిధంగా భోజనం కూడా ఎక్కువ సేపు తినడం మంచిదికాదని చెబుతున్నారు.4. స్వీట్లు తినడం… భోజనం చేసిన తర్వాత చాలా మందికి స్వీట్, ఐస్ క్రీమ్, కేక్ లాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే… ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. వీటిలో కాలరీలు ఎక్కువ ఉంటాయి. దాంతో కొవ్వు కూడా బాగా పేరుకుపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.5.భారీ కసరత్తులు… బరువు త్వరగా తగ్గిపోవాలనే ఆత్రుతలో కొందరు తినగానే భారీ కసరత్తులు చేయడం మొదలుపెడతారు. వ్యాయామం చేయడం మంచిదే కానీ… తినగానే కసరత్తులు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. ఈ ఐదు నియమాలను గుర్తుపెట్టుకొని…వీటిని ఫాలో అయిపోతే..బరువు తగ్గడం చాలా సులభం అవుతుందని చెబుతున్నారు🌹🧖🌹

అరుదుగా వచ్చే శనిత్రయోదశి

ఈనెల 26వ తారీఖున *శని త్రయోదశి, ధన త్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి* అదే రోజున *మాసశివరాత్రి* మరియు నరకచతుర్ది కూడా అవుతున్నది. ఇటువంటి మహత్తరమైన రోజు చాలా అరుదుగా వస్తుంది.
ధన త్రయోదశి రోజు మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవుతాయని పెద్దలు అంటుంటారు. ఇటువంటి మహత్తరమైన రోజున శని త్రయోదశి సంభవించ డం చాలా అరుదు. ఈ రోజున శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అనేక మంచి ఫలితాన్ని పొందుతారు. కావున భక్తులు పై విషయమును గమనించగలరు.
*ఏల్నాటి శని గల
వృశ్చిక రాశి వారు
(విశాఖ 4వ పాదం
అనూరాధ 1 2 3 4 పాదాలు
జ్యేష్ట 1 2 3 4 పాదాలు)
ధనుస్సు రాశి వారు
(మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం)

మకర రాశి వారు
(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు)
*అష్టమ శని*. గల
వృషభ రాశి వారు
(కృత్తిక 2 3 4 పాదాలు
రోహిణి 1 2 3 4 పాదాలు
మృగశిర 1 2 పాదాలు) *అర్ధాష్టమ శని* గల
కన్యా రాశి వారు
(ఉత్తర 2 3 4 పాదాలు
హస్త 1 2 3 4 పాదాలు
చిత్త 1 2 పాదాలు)
పై రాశులు వారు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు.స్వయంభు శ్రీ శ్వేతార్క గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శనీశ్వర దేవాలయం లో రేపు ప్రత్యేక పూజలు జరుప బడుచున్నవి ఉదయం 10 గంటలకు శనీశ్వరునికి అభిషేకం అర్చన హారతి తీర్థప్రసాద వితరణ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శని పూజ లో పాల్గొనే భక్తులు ఉదయం 9 గంటల వరకు దేవాలయమునకు వచ్చి ఉండాలి. లేదా దేవాలయ ఫోన్ నెంబర్ 93 47080055 అనే నెంబర్లో సంప్రదించాలి
భక్తుల సౌకర్యార్థం పూజాద్రవ్యములు దేవాలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఇట్లు
అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

త్వరలో కాశీ యాత్ర

*కాశీ యాత్ర*

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం…. అని పురాణాల్లో చెప్పబడింది.
…..,………….,…

జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా కాశి యాత్ర చేయాలని ఉంది,
కాశి క్షేత్రం లో నివాసం చేసి రావాలని పెద్దలు చెబుతారు.
…………..,……….

*డిసెంబర్ 12వ తేదీ న కాశీ యాత్ర ప్రారంభం అవుతున్నది.*

కాశీ , అలహాబాద్, గయ, బుద్ధగయ, నైమిశారణ్యం, వింధ్యాచలం, అయోధ్య, సీతామడి, ఇత్యాది పుణ్యక్షేత్రాలతో కాశీ యాత్ర చేయడం జరుగుతుంది.

కాశి యాత్ర కు రాదలచిన వారు *ఈనెల 25వ తేదీ* లోపున తమ పేర్లను వ్రాయించు కోవాలి

రైలు మరియు బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది

ముందుగా ఎవరు రుసుము చెల్లిస్తే వారికి ముందు సీటు కేటాయించడం జరుగుతుంది.

మనిషి ఒక్కంటికి 11,800/. రూపాయలు
అగును

ఒక పూట భోజనము ఒక పూట ఫలహారం ఇవ్వడం జరుగుతుంది

సత్రంలో కిరాయిలు ఎవరిది వారే భరించుకోవాలి

11 రోజులు ప్రయాణం

రైలులో ఏసీ టు టైర్ లో ప్రయాణం చేయబడుతుంది.

పూర్తి వివరాలకై 7330436001,8686662329. నెంబర్లలో సంప్రదించగలరు

December 17 నుండి అస్తవినాయక యాత్ర

*అష్టవినాయకయాత్ర*
*** డిసెంబర్ 17వ తేదీన యాత్ర ప్రారంభం ***

సుమారుగా 7 లేదా 8 రోజులు పట్టవచ్చును

మనిషి ఒక్కంటికి సుమారు 10,200/-రూ:లు.

మంచి Ac బస్ లో ప్రయాణం

తుల్జాభావాని,పండరీపురం,అష్టవినాయక,భీమశంకర్,త్రయంబకం,షిర్డీ….లాంటి
*13 చోట్లకు వెళ్లి రావడం జరుగుతుంది*

ఒకపూట భోజనం,ఒకపూట టిఫ్ఫిన్ ఇవ్వబడుతుంది
………………….

ముందుగా పూర్తి డబ్బులు కట్టిన వారికి బస్ లో ముందు సీట్ ఇవ్వబడుతుంది.

ఇట్లు
MK Travels
Phn:9542227807
Near swetharkamula ganapathi temple,vishnupuri kazipet

………………………………..
*ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితోపంచుకొందాం,*

…………………………

కనులు పోతే
భగవంతుణ్ణి చూడలేం
కాళ్ళు పోతే
యాత్రలు చేయలేం
చేతులు పోతే
భజన చేయలేం
నోరు పోతే
హరికీర్తన చేయలేం

శ్వేతార్క గణపతికి సప్తవర్ణభిషేకం ప్రత్యేక్ష ప్రసారం

https://m.facebook.com/swetharka.ganapathi/videos/1145912635595704/?sfnsn=scwspmo&d=n&vh=i

రైతుల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు ఈ నెల 17 సంకష్టహర చవితి రోజున జరుగును

*ఈ నెల 17 న*
*సంకట హర చవితి*

*శ్రీ స్వామి వారికి*
*సప్త వర్ణాభిషేకం*

*రైతుల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు*

స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం లో ఈ నెల 17 వ తేదీ గురువారం రోజున సంకష్టహరచతుర్థి పూజలు జరుపబడుచున్నవి.
ఇటీ వల కురిసిన వర్షాలు రైతులకు కల్పతరువుగా మారి మంచి ఆరోగ్యకరమైన పంటలు చేతి కి రావాలని కోరుతూ.. దేశానికి వెన్నెముక అయిన రైతు క్షేమాన్ని కోరుతూ
శ్రీ స్వామి వారికి వరుణ దేవుడి మూల మంత్రములతో
సప్త వర్ణాలతో అభిషేకము జరిపబడుచున్నది.

ఉరుములు,పిడుగులు రాకుండా ప్రజా మరియు పశు రక్షణ కలగాలని ఇంద్ర చాప వర్ణముతో ఈ అభిషేకము జరుపబడుచున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమము యందు పాల్గొని రైతు క్షేమాన్ని కొరుటకు రావలసిందిగా కోరుతున్నాము.

*ఆ రోజు పూజా సమయములు.*

ఉదయం 7 గంటలకు పాలాభిషేకం,
8 గంటలకు అలంకార దర్శనము,
9 గంటలకు గణేశ మూల మంత్రములచే నిత్య సహస్ర మోదక హోమము. 12 గంటల నుండి దూర ప్రదేశములు నుండి వచ్చు భక్తులకు అన్న దానం,

సాయంత్రం 5 గంటలకు దూర్వా హోమము,
6 గంటలకు సప్తవర్ణాభిషేకము. 7 గంటలకు శ్రీ స్వామి వారి ఉత్సవ విగ్రహములు ఊరేగింపు.

అనంతరం అర్చన, హారతి,తీర్థ ప్రసాదాల వితరణ

అనంతరం అన్నపూర్ణ భవన్ లో అన్నదానము జరుపబడును.

కావునభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన గలరు.

ఇట్లు

ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
మీడియా మిత్రులకు మనవి

లైవ్ ప్రోగ్రాం కొరకుసాయంత్రం 6 గంటల వరకు దేవాలయం లో ఉండాలి.6.30 కి లైవ్ స్టార్ట్ చేసుకోవచ్చును 7 వరకు.

ఆనంద సాధన

మనిషికి ఆనందం తనంతటతానుగా ఉబికి వచ్చినప్పుడే బాగా తెలుస్తోందిగాని, స్వయంగా దాన్ని కొనితెచ్చుకొనే నైపుణ్యం అలవడటం లేదు. వచ్చినప్పుడల్లా ఉల్లాసంగా ఎగిరి గంతులు వేయడం, తక్కిన సమయాల్లో దానికోసం బేలగా ఎదురుచూపులు చూడటంలోనే జీవితం గడచిపోతోంది. తనలోని ఆనంద జన్యువుల ఆచూకీని కనుగొనడంలో మనిషి విఫలం అవుతున్నాడు. ఆనందానికి దూరం అవుతున్నాడు. ఎదురయ్యే ప్రతి అంశంలో ఆనందానికి దారిచూపే అవకాశాలను కాదని, దుఃఖానికి కారణమయ్యే మూలాలను గమనించడం అలవాటు చేసుకున్నాడు. ఈ తరహా ప్రతికూల ధోరణి కారణంగా జీవితంలో ఆస్వాదన దృష్టి మందగిస్తోంది. ఫలితంగా ఎక్కువ సమయం దుఃఖంతోనే సావాసం చేస్తూ, మానవ జీవనమంతా దుఃఖమయమేనంటూ తీర్మానిస్తున్నాడు.

పుట్టినప్పటినుంచి మనసును రకరకాలుగా ప్రభావితం చేసే… సరిగ్గా చెప్పాలంటే- కట్టడి చేస్తూ వచ్చే విషయాలు కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. పుట్టిన ఇల్లు, పెరిగిన వాతావరణం, పెంపకం, జాతి, దేశం… వంటి అంశాలకు సంబంధించి సమాజం నూరిపోసే ఎన్నో ఆలోచనలు పసిమనసులపై బలమైన ముద్రలు వేస్తాయి. ఆ అభిప్రాయాలకు మనల్ని నిబద్ధుల్ని చేస్తాయి. స్వయంగా తానే ఏర్పరచుకొనే ఈ అంతరాలవల్లే భేదభావాలు ఏర్పడతాయి… దూరాలు పెరుగుతాయి.

ఈ విభజన నిజానికి ప్రకృతి సహజం కాదు- మనిషి నైజం. దృష్టిదోషమే తప్ప ఇది సృష్టిదోషం కాదు. మనిషిని ఆనందాన్నుంచి దూరం చేసే ముఖ్యమైన అంశాల్లో ఈ తేడాల గురించి పట్టింపు ఒకటి. ఉన్నది ఉన్నట్టుగా కాక, ప్రతిదాన్నీ తన పూర్వ అభిప్రాయాలకు అనుగుణంగా స్వీకరించడమే- మనిషి దుఃఖానికి ప్రధాన కారణమంటారు ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. దీన్ని సంకుచిత ధోరణిగాను, పాక్షిక దృష్టిగాను ఆయన అభివర్ణించారు.

స్థిర, దూర అభిప్రాయాల రంగుటద్దాల్లోంచి పరికించడమే అలవాటైన మనసుకు దేనిలోనూ నిజస్వరూపం గోచరించదు. సత్యం స్ఫురించదు. స్ఫురించింది మనసుకు రుచించదు. భేదభావం, శత్రుత్వాలే మిగిలిపోతాయి. పూర్వ వాసనలను పూర్తిగా ఖాళీచేస్తేగాని, మనసుకు స్వచ్ఛమైన సాక్షీభూత స్థితి అలవడదు. అసలు చూపు సిద్ధించదు. అంతవరకూ దుఃఖమూ తప్పదు.

‘తరచుగాను, స్థిరంగాను వెంటాడే దుఃఖం నుంచి తేరుకొని మనసు సాక్షీభూత స్థితికి చేరుకోవాలంటే ఉన్నది ఒక్కటే దారి’ అని స్పష్టం చేశారు కృష్ణమూర్తి. ‘దుఃఖం నుంచి పారిపోవద్దు. తప్పించుకోవాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు. పలాయనం దేనికీ పరిష్కారం కాదు. పారిపోయే ప్రయత్నాల్లో ప్రత్యామ్నాయాల వెదుకులాటలో మనసు మరింత బలహీనమవుతుంది. దుఃఖం పెరిగిపోతుంది. కాబట్టి ఘర్షణ విరమించి, దుఃఖాన్ని అంగీకరించాలి. మనిషి దానిలో నిలవాలి. పూర్తిగా అనుభవించాలి. ప్రతి దుఃఖానుభవం మంచి పాఠం నేర్పడానికే వస్తుంది. ఏదోఒక ఆనందమార్గాన్ని పరిచయం చేయడానికే వస్తుంది. కనుక తప్పించుకొనే ఆలోచన వద్దు’ అని కృష్ణమూర్తి బోధించారు.
దీని అర్థం- ప్రతి దానిలో దుఃఖాన్ని వెతికి పట్టుకొమ్మని, దొరకగానే ఆలింగనం చేసుకొమ్మనీ కాదు. దుఃఖాన్ని స్వాగతించమని కాదు ఆయన అంటున్నది- అది సంభవించినప్పుడు అంగీకరించమని! దుఃఖ అనుభవాన్ని పూర్తి చేయమని చెబుతున్నాడాయన. మనిషి దుఃఖంలో స్థిరంగా నిలిచినప్పుడు యావచ్ఛక్తీ దుఃఖంమీద కేంద్రీకృతమై దాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. అదీ అసలు విషయం. దుఃఖ విమోచనమే ఆనందానికి సుప్రభాత గీతం.

దీపావళినోములు .. వివరణ

*దీపావళినోములు .. వివరణ*

శ్రీ వికారి నామ సంవత్సరంలో వచ్చే దీపావళి పండుగకు సంబంధించిన వివరములు ఈ క్రింది విధంగా తెలుస్తున్నాయి.

అక్టోబర్ 27వ తేదీ ఆదివారం రోజున చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉండి తదుపరి అమావాస్య తిథి ప్రారంభం అవుతున్న కారణంచేత ఆ రోజుననే నరకచతుర్దశి (అనగా తెల్లవారుజామున మంగళహారతులు ఇచ్చుకోవాలి) మరియు రాత్రి సమయంలో అమావాస్య తిథి ఉన్న కారణం చేత ఆ రోజున నే దీపావళి పండుగను మరియు ధనలక్ష్మి పూజలను ఆచరించాలి. 28వ తేదీ సోమవారం రోజున అమావాస్య తిథి ఉదయం 9 గంటల 31 నిమిషాల వరకు మరియు స్వాతి నక్షత్రం రాత్రి2:54 వరకు ఉన్న కారణం చేత నూతనంగా కేదార వ్రతం ప్రారంభం చేసుకునేవారు సోమవారం నాడు కేదార వ్రతం చేసుకొని గురువారం నాడు నోము ఎత్తుకోవాలి.
పుట్టు బుధవారం ఆచారం ఉన్నందున గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. అయితే గురువారం రోజున దేవుని ఎత్తుకునే వారు ఉదయం 6.50 లోపున లేదా ఉదయం 8.26 నిముషాల తర్వాత దేవుని ఎత్తుకోవాలి. ఈ సంవత్సరము స్వాతి నక్షత్రము మరియు అమావాస్య తిథి సూర్యోదయంలో కలిసి ఉన్న కారణం చేత కొత్త నోములు ఆచరించుకోవచ్చు.

పాత నోములు గల వారు
సోమవారం నాడు రాత్రి నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తు కొనవ లెను.కొందరి మతమున మంగళవారం మరియు పుట్టు బుధవారం దేవుని ఎత్తుకోడానికి అంగీకరించరు. కావున గురువారం నాడే దేవుని ఎత్తుకొన వలెను.
అమావాస్య రాత్రి తో సంబంధం లేని వారు కూడా బుధవారం నా డే కేదార నోము నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సింది గా తెలియజేస్తున్నాను.

ఇట్లు

అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
భద్రకాళి దేవస్థానం ఆస్థాన
సిద్ధాంతి. వరంగల్

దసరా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామి వారి దివ్య క్షేత్రంలో జరుపబడుతున్న శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమంలో భాగంగా

రేపటి పూజా కార్యక్రమాల సమయాలు

ఉదయం 6 గంటలకు శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామివారికి పంచామృత అభిషేకము ఉదయం 9గంటలకు దేవి నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా కలశ ఉద్వాసన పూజా కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం ,పగలు 12 గంటలకు సంగీత గాత్ర సహిత మహా అర్చన జరుపబడుతుంది.
ఉదయం 8 గంటల నుంచి 1గంటల వరకు వాహన పూజలు జరుపబడతాయి
సాయంత్రం నాలుగు గంటలకుసిద్ధి బుద్ధి సమేతంగా శ్రీ స్వామివారికి కళ్యాణమహోత్సవం సాయంత్రం 5 గంటలకు నిత్య అర్చన, 6 గంటలకు ప్రదోషకాల పూజ జరుపబడుతుంది 7 గంటలకు శమీపూజ జరపడం జరుగుతుంది. 8 గంటల 15 నిమిషాలకు దర్బార్ సేవ జరుపబడుతుంది 9:00 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం

ఇట్లు
అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి