శ్వేతార్కలో 3వ రోజు బతుకమ్మ సంబరాలు ఆటపాటలు….శ్వేతార్క ఆలయ భక్తులు మరియు కాజిపేట వాసవి మహిళ క్లబ్ #swetharka #2019batukkama

https://m.facebook.com/story.php?story_fbid=1131850753668559&id=100005309344868&sfnsn=scwspmo&d=n&vh=i

శ్వేతార్కలో 2రోజు బతుకమ్మ సంబరాలు Streaming Live Now

https://m.facebook.com/story.php?story_fbid=1131099433743691&id=100005309344868&sfnsn=scwspmo&d=n&vh=i

స్థలం కాజిపేట శ్వేతార్క గణపతి క్షేత్రం

బతుకమ్మ సంబరాలు ప్రత్యేక్ష ప్రసారం

https://m.facebook.com/story.php?story_fbid=1130302067156761&id=100005309344868&sfnsn=scwspmo&d=n&vh=i

ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు… దేవి నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి

్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ఈరోజు అనగా 28-09-2019 శనివారం రోజున మహాలయ అమావాస్య సందర్భంగా అయినవోలు సాయి కృష్ణ శర్మ మరియు అయినవోలు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పితృ అర్చన తర్పణం విధిని జరుపబడింది. భక్తులు బియ్యం పప్పుదినుసులు కాయగూరలతో అర్చనలు జరిపించారు. పిత్రు అర్చనచేసిన భక్తులకు దేవాలయంలో తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి భక్తులనుద్దేశించి అమావాస్య తర్పణం యొక్క విశిష్టతను గురించి తెలపడం జరిగింది. మన భారతదేశ సనాతన సంప్రదాయంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పువ్వుకు పూజ చేసే ఆచారం ఉందని. అదే విధంగా పశువులకు పక్షులకు కూడా ఆరాధన చేసే సంప్రదాయం ఉందని పిత్రు అర్చనప్పుడు పక్షికి పూజ చేయడం పక్షికి ఆహారం ఇవ్వడం పిట్టకు పెట్టడం ఒక భాగమని, అదేవిధంగా దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించడం వల్ల విజయం కలుగుతుందనే విశ్వాసం ఉందని తెలుస్తుంది. మన సంప్రదాయంలో పక్షి ఆరాధన ఎంతో ముఖ్యమైనది అని గమనించవచ్చు.
మహాలయ అమావాస్య నాడు గతించిన పెద్ద వారంతా తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతార ని, వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతార ని. నిజానికి, ప్రతి మాసం లోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంద ని తెలిపారు. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంద ని. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తార ని తెలిపారు. .శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింద ని. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తార ని. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంద ని తెలిపారు. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనద ని, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంద ని, ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుం దని అన్నారు . ఎంసి
తదుపరి సాయంత్రం ఏడు గంటలకు శ్వేతార్కమూల గణపతి దేవాలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ పండుగను నిర్వహించారు ఈ బతుకమ్మ పండుగ లో స్త్రీలంతా కలిసి ఆటపాటలతో గౌరీ పూజ చేశారు ఈ వేడుకలను శ్వేతార్క ఛానల్ అనే యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.రేపు ఉదయం 9 గంటల నుంచి దేవీ నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మ నిర్వహణలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మశ్రీ అయినవోలు వెంకటేశ్వర శర్మ పుష్పలత దంపతులు ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భంగా దేవాలయం లో కొలువై ఉన్నటువంటి శ్రీలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ దేవి గాయత్రీ మాత అమ్మవార్లకు విశేష అభిషేకము అలంకారము అర్చన హారతి తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. చతుష్షష్టి పూజా విధానంతో పూజలు జరుపబడతాయి.ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కుమారి సుష్మా సుస్మిత అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయడం జరుగుతుంది. పూజ అనంతరం రేపు పగలు అన్నపూర్ణ భవన్లో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం కావాల్సిందిగా కోరుతున్నాంఇట్లు
ఎల్ .రవి
దేవాలయం మేనేజర్

అక్టోబర్ 1 మాధవానంద సరస్వతీ స్వామివారు విచ్చేయనున్నారు

*తోగుట స్వామివారి ఆగమనం*

అక్టోబర్ 1వ తేదీన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు సాయంత్రం 7 గంటలకు శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దేవాలయ దివ్యక్షేత్రమునకు విచ్చేయనున్నారు…

రంగంపేట లోని ఆశ్రమంలో 14 మాసాలుగా అకుంఠిత దీక్షను వహించి ( చాతుర్మాస్య దీక్షను ) పూర్తి చేసుకొన్న అనంతరం మొట్టమొదటి సారిగా కాజిపేట శ్రీ శ్వేతార్కగణపతి క్షేత్రమునకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేయబడుచున్నవి.

అక్టోబర్ 1వ తేదీన
సాయంత్రం 6.00 గంటలకు శ్రీ స్వామీజీ వారు కాజీపేట చేరుకుంటారు
బాపూజీ నగర్ నుంచి వారికి ఘన స్వాగత యాత్ర ప్రారంభమవుతుంది.

సాయంత్రం 7 .30 నిముషాలకు దేవాలయంలో శ్రీ స్వామీజీ వారికి పాద పూజ జరుపబడుతుంది. కావున
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు.

స్వాగత యాత్రలో భక్తులు హారతులతో, ర్యాలీగా(వాహనాలతో) స్వామీజీ వారిని ఆహ్వానించుటకు పాల్గొనగలరు..

వివరాలకు 9347080055 నందు సంప్రదించగలరు

#మాధవానంద #madhavananda #సరస్వతీ #saraswathi #రంగంపేట #తోగ్గుట

రేపటి నుండి సా.6.30 నుండి బతుకమ్మ ఆటపాటలు

కార్యకర్తలకు భక్తులకు మనవిరేపటినుండి సద్దుల బతుకమ్మ పండుగ వరకు ప్రతి రోజు శ్వేతార్కమూల గణపతి దేవాలయ ప్రాంగణం లో బతుకమ్మ పండుగ జరుపబడుతుంది. ఇందులో మహిళలు ఆటపాటలతో బతుకమ్మ ని పూజిస్తారు. కావున బతుకమ్మ పండుగ లో పాల్గొనే వారంతా సాయంత్రం 6 గంటల వరకు దేవాలయానికి రాగలరుఇట్లు
మేనేజ్మెంట్
శ్వేతార్క ఆలయం

దేవి నవరాత్రి ఉత్సవాలు

*దేవీ నవరాత్రి ఉత్సవ వేడుకలు*

స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ సరస్వతి సంతోషిమాత, అన్నపూర్ణ మాత, గాయత్రి మాత అమ్మవార్లకు *దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా* ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అమ్మవార్లకు అలంకారము అర్చన హారతి తీర్థప్రసాద వితరణ ఉంటుంది. గాయత్రి మాత అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి కలశస్థాపన చేసి పదిరోజులపాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుపబడతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బ్రహ్మశ్రీ త్రి గుల్ల శ్రీనివాస శర్మ మరియు ఎల్లంబట్ల క్రాంతి శర్మ ఆధ్వర్యంలో చతుషష్టి పూ జ విధానంతో పూజా కార్యక్రమాలు జరపబడతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కార్యకర్తలు, భక్తులచే అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణలు జరుపబడతాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు *శ్రీ దేవి మహత్యం* గురించి ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అమ్మవార్లకు విశేష పూజ, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ప్రతిరోజు తాటికొండసుష్మ, సుస్మిత తలచే అమ్మవార్లకు ప్రత్యేక అలంకారములు జరుపబడతాయి. అదేవిధంగా ప్రతి రోజు అమ్మవార్లకు వివిధ రకముల నివేదనలు జరుపబడతాయి .ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే గోత్రనామాలు చదివించడానికి. పది రోజులకు గాను వెయ్యి నూట పదహార్లు చెల్లించవచ్చు. 2116 చెల్లించిన వారికి అమ్మవారి యొక్క ప్రసాదమును చిత్రపటమును అందించబడును. 3116 చెల్లించిన వారికి అమ్మవారి యొక్క నాలుగు రకముల ప్రసాదములు మరియు చిత్రపటం ప్రసాదంగా అందించబడును. 4116 చెల్లించిన వారికి అమ్మవారి సన్నిధిలో ఒకరోజు స్వయంగా అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వారికి భోజన ప్రసాదము మరియు చండీ హోమం నందు పాల్గొనుటకు అవకాశం కల్పించ బడుతుంది. కేవలం చండీ హోమము నందు గోత్రనామాలు చదివించి కోవాలి అనుకునేవారు 516 లు లేదా చండీ హోమమునందు స్వయంగా కూర్చోవాలి అనుకునేవారు 3116 చెల్లించాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించి పూజా రుసుమును చెల్లించి
పూజా కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాము.
ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు
జరుపబడతాయి. కావున భక్తులు గమనించగలరు

జై గణేశా
జై మాతాజీ