చదువులకు ఆదిదేవుడు హయగ్రీవ స్వామి వారికి ప్రత్యేక పూజలు

ివకేశవ సన్నిధానమైన తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న కాజీపేట శ్వేతార్కమూలగణపతి స్వామివారి దివ్య క్షేత్రములో కొలువై ఉన్న హాయగ్రీవ స్వామివారికి హాయగ్రీవ జయంతి పురస్కరించుకుని శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఏడు గంటలకు పంచామృత విశేష అభిషేకం జరిగింది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క విద్య అభివృద్ధి వారి యొక్క మేధస్సు సన్మార్గంలో ధర్మసంస్థాపణకై అభివృద్ధిని కాంక్షిస్తూ ఉదయం 10 గంటలకు అయినవోలు రాధాకృష్ణశర్మ నేతృత్వంలో విశేష హోమ కార్యక్రమాలు జరిగాయి. ఆదిదేవుడు చదువులకు ఆదిదేవతాః మూర్తిగా హయగ్రీవ స్వామివారు వేదాల పరిరక్షణ, ధర్మ సంస్థాపన కొరకు వేదాలను, ఉపనిషత్తులను రక్షించి అందరికీ కూడా అందించిన జ్ఞాన సంపద కథలను గుర్తుతెచ్చుకుంటూ అందరికీ కూడా మేధస్సు అభివృద్ధి చెందుతూ వారు చేసే టువంటి అన్ని కార్యక్రమాలలో ధర్మస్థాపన ధర్మ పరిరక్షణకై ప్రతి కార్యక్రమం కూడా ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది. అయినవోలు సాయికృష్ణ శర్మ నేతృత్వంలో ప్రత్యేకంగా విద్యార్థులతో పూజలు జరిపారు. సరస్వతి మాత గురువైన హయగ్రీవస్వామివారి సన్నిధిలో జరిగిన పూజలలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నూతన యజ్ఞోపవిత ధారణలు

శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దివ్యక్షేత్రంలో శ్రీ గాయత్రీ అమ్మవారి సన్నిధిలో బ్రాహ్మణోత్తములుచే మరియు నూతనంగా ఉపనయనం జరిగిన వారికి నూతన యజ్ఞోపవీత ధారణ పూజలు జరిగినవి. వీరిచే విశేష గాయత్రీ మంత్ర జప యజ్ఞం కూడా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అనేకమంది బ్రాహ్మణోత్తములు పాల్గొని గాయత్రి మంత్ర జపసాధన మరియు నూతన యజ్ఞోపవీత పూజలలో విశేషించి పాల్గొన్నారు.