శ్వేతార్క లో ఆగస్టు 15 రాఖీ పౌర్ణమి రోజు హయగ్రీవ స్వామి కి పూజలు

సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో ఆగస్టు 15 రాఖీ పౌర్ణమి మరియు హాయగ్రీవ జయంతి పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ హయగ్రీవ స్వామివారికి మరియు గణపతి, సంతోషిమాత, సుబ్రమణ్యస్వామివార్లకు విశేష అభిషేకాలు,హోమాలు ప్రత్యేక పూజలు మరియు అన్నదానాలు జరుగుతుంది. ఉదయం 7 గంటలకు హయగ్రీవస్వామివారికి పంచామృత పంచవర్ణ అభిషేకము అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ జరుగును. 10గంటలకు శ్రీహయగ్రీవ మూలమంత్ర హవనము మరియు నిత్య సహస్రమోదక గణపతి హవనము. 11 గంటలకు అన్ని దేవతామూర్తులకు అష్టోత్తర శతనామార్చన మరియు సహస్రనామార్చన మహా హారతి తీర్థప్రసాద వితరణ అనంతరం భక్తులందరికీ అన్నదానం జరుగనున్నాయి. భక్తులు తమ పిల్లలు చదువులో వెనుకబడిన వారు ఎవరైనా ఉన్నా మరియు మేధస్సు అభివృద్ధి కోసం హాయగ్రీవ స్వామి సన్నిధిలో జరుగు పూజా క్రతువులలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. *రాఖీ పౌర్ణమి* పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు *సంతోషిమాత* అమ్మవారి సన్నిధిలో *రక్షాబంధన పూజ* జరుగుతుంది. స్వయంగా సంతోషిమాత గణపతికి కుమారస్వామికి రాఖీలు కట్టి సోదరసోదరిమణుల అనుబంధాన్ని తెలిపిన విషయం తెలిసిందే ఇందునిమ్మితం భక్తులు ఉదయం నుండి 2 రక్షలు దేవాలయంలో అందించగలరు. పూజనంతరం రక్షలు తిరిగివ్వబడును. పూర్తి వివరాలకై దేవాలయ సమాచార కేంద్రం లేదా 9394810881 నాకు సంప్రదించగలరు