వైద్యేశ్వరుణ్ణి దర్శనం రోగాలను రాకుండా చేస్తుంది.

ఈ రోజు మంగళవారం అనగా కుజవారం కదా…

ఈ రోజు కుజదేవాలయంలో దీపాలువెలిగించి
వైద్యేశ్వరుణ్ణి దర్శించాం

ఇక్కడి దేవాలయ దర్శనం రోగాలను రాకుండా …
వచ్చి ఉన్న రోగాలు ఎక్కువ కాకుండా చేస్తుంది.

విజ్ఞరాజం భజే పాట చిత్రీకరణ

శ్వేతార్కా దేవాలయంలో సప్తస్వరి మ్యూజిక్ అకాడమీ హన్మకొండ వారి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నరాజం భజే కీర్తన అనే పాట చిత్రీకరణ జరిగినది.ఈ పాట చిత్రీకరణలో భక్తులు మరియు కార్యకర్తలు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఇట్లు
దేవాలయ మేనేజర్
ఎల్.రవి

శ్వేతార్కా దేవాలయంలో ఘనంగా జరిగిన కుమార షష్టి పూజలు — మేనేజర్ ఎల్.రవి

స్వయంభూ శ్రీ శ్వేతార్కా మూల గణపతి దేవాలయంలో ఈరోజు కుమార షష్టి సందర్బంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక మైన పూజ కార్యక్రమాలు నిర్వయించడం జరిగింది.ఈ పూజ కార్యక్రమాలు నమో నారాయణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయి.ఈ పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు మరియు కార్యకర్తలు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఇట్లు
దేవాలయ మేనేజర్
ఎల్.రవి

భౌమ అమావాస్య నగదండం పూజలు

భౌమఅమావాస్య సందర్బంగా. ఈరోజు శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక నాగదండ పూజలు

జేష్ట అమావాస్య మంగళవారం రోజుగా కలసిరావడం విశేషంగా భావిస్తు…ఈ రోజున శ్రీ శ్వేతార్కగణపతి స్వామి వారి సన్నిధిలో భౌమ అమావాస్య పూజలను ప్రత్యేకంగా జరుపబదుచున్నవి.

భౌమ అమావాస్య అనగా మంగళవారం నాటి రోజున అమావాస్య కలసి వస్తే దానిని భౌమ అమావాస్య అని అంటారు. ఈ రోజున విశేషించి తెల్ల జిల్లేడు పూవులతో మరియు ఎర్రని మందార పువ్వులతో గణపతికిఆయుధమైన నాగదండమును పూజించిన, గణపతికి ప్రీతికరంగా 16 ప్రదక్షిణాలు చేసినా కోరిన కోరికలు నెరవేరుతాయి.

విశేషించి శ్వేతార్కగణపతి స్వామి వారి ఆభరణమైన నాగదండమునకు విశేష పూజలు జరిపిన సంతాన దోషాలు,రాహుకేతు సర్పదోషాలు పోతాయి.
అలాంటి వారు ఈ రోజున ప్రదోషకాలములో నాగ దండమును ఆరాధించినచో మంచిదని తెలుస్తుంది.

ఈ సందర్బంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు దేవాలయములో గల నాగదండమునకు ప్రత్యేక అలంకరణ , హారతి భజనలతో విశేష పూజా కైంకర్యాలు జరగనున్నవి.భక్తులు కొబ్బరికాయ, పూలు(తెలుపు,ఎరుపు), పూలమాలలు,శర్కర, బెల్లం తీసుకొనిరగలరు..గోత్రనామాలకు సమాచార కేంద్రంలో సంప్రదించగలరు.

కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని,నాగదండమును దర్శనం చేసుకొని తరించగలరు.

ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు ఆండ్రియాడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనగలరు. https://play.google.com/store/apps/details?id=com.swetharka.app

ఇట్లు
దేవాలయ పరిపాలన నిర్వాహకులు

*ఐనవోలు సాయి కృష్ణ శర్మ*

*దూరప్రయాణాలు – పూర్ణిమ, అమావాస్య, గ్రహణం*

పూర్ణిమ, అమావాస్య రోజుల్లో, గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. చంద్రుడు మనః కారకుడు, పూర్ణిమ, అమావాస్య తిధుల్లో మనసు చంచలంగా, గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. గమనిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ ఈ తిధుల్లోనూ, మంగళవారం నాడు అధికంగా జరుగుతాయి. మనకు సూర్యోదయం ప్రధానం. వారం మొదలయ్యేది రాత్రి 12.00 గంటలకు కాదు, సూర్యోదయంతో, అలాగే ముగుసేది కూడా రాత్రి 12.00 కాదు, మరునాడు సూర్యోదయానికి ముగుస్తుంది. మనకు అర్ధరాత్రితో సంబంధంలేదు. సూర్యోదయంతోనే రోజును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని గమనించి చూడండి, అధికశాతం పూర్ణిమ, అమావాస్య, గ్రహణం, మంగళవారం ఘడియాల్లోనే జరిగాయి. రాత్రి సమయం, తెల్లవారుఝామున అధికంగా జరుగుతున్నాయి. కనుక ఇటువంటి తిధుల్లో దూరప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ||

జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః | అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||

భావం: నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!

రేపు మనకు సూర్య గ్రహణం ప్రభావం ఉండదు

సంపూర్ణ సూర్య గ్రహణం 02-07-2019 మంగళవారం కలదు. ఇది మన దేశ ంలో కనబడదు. మనము పాటించనవసరము లేదు.
పాక్షిక చంద్ర గ్రహణం 16/07/2019 మంగళవారం రాత్రి అనగా సూర్యోదయం 17/07/2019 బుధవారం 01:32:35 am(IST) to 04:29:50 am ఉత్తరాషాడ నక్షత్రమందు. ఇది మనదేశంలో కనబడుతోంది.

తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి:

ఉదకం చందనం చక్రమ్‌ శంఖంచ తులసీదళమ్‌॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్‌॥
సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే

అంటే
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం – ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే ‘తీర్థం’ అంటారు.

అలాగే
భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌నరః
ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతేమమ॥
సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం
సర్వరోగాది శమనం సర్వపాప హరంభవేత్‌॥

అంటే
భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని , పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు.

భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు ‘అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి.

పరమాణుసమం తీర్థం
మహాపాతకనాశనం
తదైవాష్టగుణం పాపం
తద్భూమౌ పతితాయాది॥

అన్నారు .. అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలని సైతం నాశనం చెయ్యగలది. అటువంటి తీర్ధం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట.

వస్త్ర చతుర్గణీకృత్య పాణౌ పాణిం నిధామయ
పవిత్రం విష్ణు పాదామ్ము త్రిః పిభేద్బిన్దు వర్జితమ్‌॥

ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడిచేతిని పైన చెప్పిన విధంగా శంఖువు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చెయ్యకూడదు. అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి.

తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచం నొక్కిపట్టి ఉంచుతాం. అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కన్పిస్తుంది. శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్ధం పోసినట్టే అవుతుంది కదా !

అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది. అదేంటంటే. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది , అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ అవన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్ధం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఇంత విషయం ఉంది !