కనుల విందుగా శ్వేతార్కుడికి ఆజ్యభిషేకం

సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీశ్వేతార్కగణపతిస్వామివారికి విశేష పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించు చున్నాము ఉదయం ఐదున్నరకి సుప్రభాతం అనంతరం మంగళ ధ్వని 6:30 నిమిషాలకు శ్వేతార్క గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకము అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ 10:30 కి నిత్య సహస్ర మోదక హోమము అనంతరం అష్టోత్తర శతనామావళి మహా హారతి తీర్థప్రసాద వితరణ అన్నదానం జరిగింది తిరిగి సాయంత్రం 4:30 నిమిషాలకి దేవాలయం తెరచుట ఐదు గంటలకి దుర్వా మరియు లజ్జ లతో హవనము ఆరు గంటలకి విశేషంగా నెయ్యి తో అభిషేకం చేయడం జరిగింది అనంతరం అలంకరణ తుదుపరి స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగింపు అనంతరం సహస్ర నామావళి షోడశ పూజ తీర్థప్రసాద వితరణ అన్నదానం జరిగింది ఇందులో లో సబిత అనురాధ ఉమాదేవి శ్రీలత babby లక్ష్మి దేవి విజయలక్ష్మి మీ వీరేందర్ ర్ ఎండోమెంట్ సదానందం రాజ్ మోహన్ మరియు దేవాలయ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ సుదీర్ దేవాలయం పి ఆర్ ఓ మనీ శ్రీనివాస్ ప్రదీప్ దినేష్ గుణవతి శ్రావణి తదితరులు పాల్గొన్నారు అయినవోలు రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో లో ఈ పూజా కార్యక్రమాలు నిర్ణయించుకున్నాము ఇట్లు దేవాలయ మేనేజర్ రవి

శ్వేతార్క గణపతి క్షేత్రం చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా నిత్యా వార పూజలు మధ్యాహ్నం 3 గంటలవరకు పూజ నైమిత్యేకార్యక్రములు పూర్తి చేసి దేవాలయ క్షేత్రం ద్వారాలు మూసివేయడమైనది… తిరిగి 17 ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం దేవతామూర్తుల సంప్రోక్షణ అనంతరం తిరిగి నిత్యసేవలు భక్తులకు దర్శనములు కలవు.

వేడుకగా జరిగిన గురుపౌర్ణమి పూజలు

శ్వేతార్కలో వైభవంగా జరిగిన గురుపూర్ణిమ వేడుకలు

ఈ రోజు శ్వేతార్క గణపతి దేవాలయం భక్తులతో ఉదయం నుండి కిక్కిరిసిపోయింది. ఈ రోజు మంగళవారం,పూర్ణిమ,గురుపూర్ణిమ కావడంతో మరియు దేవాలయం లో దత్తాత్రేయ దేవాలయం,షిర్డీ సాయిబాబా దేవాలయం,సత్యనారాయణ దేవాలయం ఉండటం మరియు మంగళవారం గణపతి కి పూజలు కావడం తో భక్తుల సంఖ్య అధికమయ్యింది.
మరియు ఈ రోజున చంద్ర గ్రహణమ్ కావడంతో పగలు 3గంటలకే దేవాలయం మూసివేస్తారనడం తో భక్తులు విరివిగా వచ్చారు.
ఉదయం 6గంటలకు శ్వేతార్క గణపతికి సముద్ర జలం తో అభిషేకం జరిగింది. ఐనవోలు రాధాకృష్ణ శర్మ,సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబాకు,దత్తాత్రేయకు పాలాభిషేకం జరిగింది.
అనంతరం అలంకారం,హారతులు జరుపబడినవి. మహార్చనలో సాయికుమారి ఆలపించిన సాయిబాబా సంకీర్తనలు అలరించాయి. కార్యకర్తలు సులోచన శ్రీలత విజయకోటి బేబీ శకుంతల రమాదేవి రాజమోహన్ విజేందర్ పాల్గొన్నారు
అనంతరం భక్తులకు అన్నదానం జరుపబడింది.
దేవాలయ సిబ్బంది మేనేజర్ రవి సుధీర్ శ్రీనివాస్ మనిదీప్ దినేష్ గుణవతి ప్రదీప్ తదితరులు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూసారు.

చంద్రగ్రహణం సందర్బంగా ఈ రోజు సాయంత్రం 3గంటలకు దేవాలయమును మూసివేయడం జరిగింది.
తరిగి రేపు ఉదయం 6గంటలకు దేవాలయము తెరచి సంప్రోక్షన చేసి ధూప దీప నైవేద్యములు ఇచ్చి భక్తులకు దర్శనమును కలిపించ బడుతుంది. ఉదయం 8గంటలనుండి భక్తులకు అర్చనలు జరుప బడుతాయి

వ్రతం చేయు భక్తులు గ్రహణం వేళా పట్టించాల్సిన నియమాలు

౾౾ భక్తులు నిత్యా మంగళవారం ప్రదోషకాల (సాయంకాలము) పూజకు వచ్చు వారు మధ్యాహ్నం 12 గంటల పూజలో తమకు సూచించిన ప్రదక్షిణలు, వస్తువులతో మధ్యాహ్నం పూజలోనే పాల్గొని మీయొక్క వ్రతాన్ని భంగం కాకుండా పాల్గొనగలరు.

౾౾ గ్రహణం కారణంగా వ్రతం చేయు భక్తులు హరిద్రా గణపతి పై తప్పనిసరిగా గరిక పోచ వుంచాలి.

౾౾ గ్రహణం వేళా వ్రతం సమయంలో ఉపదేశించిన మంత్రమును పునశ్చరణ చేసుకోవాలి. ( గ్రహణం పట్టు స్నానం చేసి కనిసంగా 108 మార్లు జపం చేయాలి)

16న శ్వేతార్క గణపతి దేవాలయముల క్షేత్రం మూసివేత

2019 జులై 16 మంగళవారం రోజున చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా తెలంగాణ గణపతిగా భాసిల్లుతోన్న వరంగల్ అర్బన్ కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కమూల గణపతి దేవలయముల క్షేత్రం సాయంత్రం 4గంటల నుండి 17 బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, శుద్ధి పుణ్యాహవచనం, దేవతామూర్తుల నిత్య సేవల అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నటు క్షేత్ర వ్యవస్థాపకుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి గారు ప్రకటన చేశారు…

ఈరోజు లక్ష్మీకేశవ యోగం

*భక్తులకు మనవి*

ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి శుక్రవారం గా రావడం విశేషం

ఈ రోజు
*లక్మి కేశవ యోగం* కావున ఈ రోజున ఉపవాసం తో సాయంత్రం ప్రదోషకాల సమయమందు

లక్మినారాయణ దేవాలయంలో

ఆవునెయ్యితో 11దీపాలు వెలిగించి.కనకదారస్తోత్రం,విష్ణుసహస్రనామాపారాయణ చేసిన మంచిది.

వ్యాపారస్తులు తప్పక మీ గృహీమణులతో చేయించ గలరు

ఐ.అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

శ్వేతార్కాలో రేపు తొలి ఏకాదశి పూజలు

స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో రేపు తొలి ఏకాదశి సందర్బంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి క్షేత్రంలోని దేవతమూర్తలకు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు నిర్వయించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం తప్పక చేసుకొనగలరు. ఈ పూజ కార్యక్రమాలు ఐనవోలు.వెంకటేశ్వర్లు శర్మ గారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి.

ఇట్లు.
దేవాలయ మేనేజర్
ఎల్.రవి

ఆషాఢంలో అష్టవినాయకయాత్ర

ఎవరైనా మాతో వస్తారా..?

సుమారుగా 7 లేదా 8 రోజులు పట్టవచ్చును

మనిషి ఒక్కంటికి సుమారు 10,200/-రూ:లుకావొచ్చును.

మంచి Ac బస్ లో ప్రయాణం

తుల్జాభావాని,పండరీపురం,అష్టవినాయక,భీమశంకర్,త్రయంబకం,షిర్డీ….లాంటి
*13 చోట్లకు వెళ్లి రావడం జరుగుతుంది*

ఒకపూట భోజనం,ఒకపూట టిఫ్ఫిన్
………………….

మీకు రావలనిపిస్తే..
మీరెందరు వస్తారో ముందుగానే చెప్పండి

*9347080055* కు ఫోన్ చేసి 2రోజుల్లో చెపితే మీకు సీటు రిజర్వ్ చేయవచ్చును.

ముందుగా పూర్తి డబ్బులు కట్టిన వారికి బస్ లో ముందు సీట్ ఇవ్వబడుతుంది.

ఇట్లు
ఐ.అనంత మల్లయ్య శర్మ
………………………………..
*ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితోపంచుకొందాం,*

…………………………

కనులు పోతే
భగవంతుణ్ణి చూడలేం
కాళ్ళు పోతే
యాత్రలు చేయలేం
చేతులు పోతే
భజన చేయలేం
నోరు పోతే
హరికీర్తన చేయలేం

ఈ నాటి మంగళవారం నరరూపగణపతి (అనగా గజమొఖం లేని గణపతి) దర్శించుకొన్నాం

నాటి ఈ మంగళవారం రోజునకు ఒక విశేషం…మేము .. ఈ రోజున*నరరూపగణపతి* ని (అనగా గజమొఖం లేని గణపతి) దర్శించుకొన్నాంఈ క్షేత్రాని కి ఒక విశేషం ఉంది. ఏమిటంటే… ఇక్కడ శ్రీ రామచంద్రుడు తన తండ్రి కి పిండములతో తర్పణము చేసిన చోటు. వాటి గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు శివలింగములను ప్రతిష్టించాడు