ఈరోజు చాలా విశేషమైన రోజు

*ఈరోజు చాలా విశేషమైన రోజు*

ఎందుకంటే…

*** ఈరోజు సోమవతి అమావాస్య

*** ఈరోజు శనిజయంతి

*** ఈరోజు నాగదండ పూజ

ఈ రోజున రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి ఈశ్వరాభిషేకము,విష్ణు ఆరాధన ,ఆంజనేయ స్వామి పూజలను ఎవరైతే జరుపుతారో వారికి జాతక సంబంధమైన సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ పూజను చేసుకోవడానికి
*కాజీపేటలో శ్రీ భ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయం* మరియు *somidi లోని శివాలయము*
*డీజిల్ కాలనీలోని ఆంజనేయస్వామి* దేవాలయము *మెట్టుగుట్ట* అనుకూలముగా
ఉంటుంది.

ఈరోజు శని జయంతి
ఈ రోజున కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ జ్యేష్టాసమేత శని దేవునికి నువ్వుల నూనెను పోసి పూజ చేసిన విశేష ఫలితములు కలుగుతాయి. దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారికి కి ప్రదోషకాల పూజా చేసి ..యోగ ఆంజనేయస్వామివారికి ప్రదక్షిణలు చేసినచో చాలా విశేషము .

*ఈరోజు నాగ దండ పూజ*
ఈ రోజున సంతాన సంబంధమైనదోషములు, సర్ప దోషములు కాలసర్ప దోషము కలిగినవారు
నాగ నాగదండపూజలో పాల్గొన్న ఎడల జాతక సంబంధమైన నాగ దోషములు తొలగిపోవును.
పై నాగదండ పూజలను ఉపవాసముచేసి సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తే మంచిది.
వీలయితే ఈ రోజున పితృదేవతలకు ఆర్గ్యం ఇచ్చిన,తిలతర్పణలు చేసినా..బ్రాహ్మణుడికి బియ్యము,కూరలు లాంటి స్వయంపాక ద్రవ్యములు ఇచ్చిన మంచిది.

అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
కాజీపేట,శ్వేతార్క ఆలయం