శ్వేతార్కలో ఘనంగా కూర్మజయంతి పూజలు మరియు లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం

కాజీపేటలోని శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో కూర్మ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రత్యక్ష కుర్మా స్వామికి ప్రత్యేక పూజలు ప్రతి మంగళవారం మరియు పర్వదినముల యందు జరుగుతున్నవి. కూర్మ జయంతి పురస్కరించుకొని ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ,పుణ్యాహవాచనం ఆ తదుపరి వెంకటేశ్వరస్వామివారికి మరియు ప్రత్యక్ష కూర్మ దేవునికి పంచామృత,పంచవర్ణములతో విశేష అభిషేకము చేయడమైంది. అనంతరం ప్రత్యేక అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ జరిగింది. లక్ష్మీనారాయణ మూలమంత్ర సహిత నిత్య సహస్రమోదక గణపతి హోమం, సుదర్శన్ మూలమంత్ర హోమాలు జరిగాయి. ఉదయం 11 గంటలకు లక్ష్మీ నారాయణలకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు కాశి స్వాతి రమేష్ శర్మ లు భక్తులకు మహా అన్నదానం చేశారు. ఈనాటి కార్యక్రమాలు అయినవోలు అనంతమల్లయ్యశర్మ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయినవోలు రాధాకృష్ణశర్మ మరియు యల్లంభట్ల క్రాంతి కుమార్ శర్మ, యల్లంభట్ల రవీందర్ శర్మ,దయాకర్ స్వామిల నిర్వహణలో అభిషేక,పూజ,హోమ,కళ్యాణోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

ప్రారంభమైన కూర్మ జయంతి పూజలు ప్రత్యేక్ష ప్రసారం

వీడియో లింక్ ద్వారా వీక్షించగలరు

కుర్మా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు….. ముందుగా గణపతి పూజ పుణ్యాహవచనం…

Posted by Swetharka Ganapathi on Friday, June 28, 2019

రేపు శ్వేతార్కలో పద్మావతి వేంకటేశ్వరస్వామి వార్ల కళ్యాణోత్సవము

*ఆహ్వానం*

29.6.2019 శనివారం (రేపు) ఉదయం 8గంటల నుండి 12గంటల వరకు దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మశ్రీ కాశీ రమేష్ స్వాతి (హైద్రాబాద్)దంపతులచే కళ్యాణోత్సవ వేడుకలు జరుగనున్నాయి.
కావున కార్యకర్తలు ఉదయం 8గంటల వరకు సేవకు హాజరు కాగలరు.

*ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.*

ఈ వేడుకలో…
అభిషేకం
అర్చన
మహా హారతి
హోమం
కళ్యాణం
అన్నదానం
జరుగును.

ఇట్లు
దేవాలయ మేనేజ్మెంట్

20 జూన్ సంకష్టహరచవితి కదలిఫల అభిషేకం

20-06-2019 గురువారం నాడు సంకట హర చవితి

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో 20- 6-2019 నాడు గురువారం రోజున సంకష్టహారచతుర్ధిని పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారికి ఉదయం 6గంటలకి పంచామృత అభిషేకము అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ. ఉదయం 10 గంటలకి నిత్య సహస్రమోదక సహిత రుద్ర హోమము తదుపరి మహా హారతి అన్నదానము తిరిగి సాయంత్రం 5 గంటలకి దుర్వా మరియు లాజలతో సంకష్టహర హోమము అనంతరం కథలీ ఫలములచే(అరటి పండులతో) శ్వేతార్కమూలగణపతిస్వామివారికి అరటి పండులచే అభిషేకం చేయడం జరుగుతున్నది.. తదుపరి హారతి ఆశీర్వచనము తీర్థప్రసాద వితరణ మహా అన్నప్రసాద వితరణ జరుగును. కావున ఇట్టి విషయాన్ని గమనించి మరిన్ని పూర్తి వివరాలకు దేవాలయ సమాచార కేంద్రం నందు లేదా 9394810881 నాకు సంప్రదించగలరు. ఇట్టి విషఈ సమాచారమును మీయొక్క అన్ని మీడియా ప్రచారమాధ్యమలలో షేర్ చేయగలరు…

ఇట్లు
దేవాలయ మేనేజర్
రవి

శ్వేతార్క నమోనమః – మాజీ mp రాపోలు ఆనందభాస్కర్

10.6.2014 నాడు స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామివారికి అభిషేకం చేస్తున్న సమయంలో రెండు నేత్రములు తెరుచుకోవడం గోచరణ జరిగి 5 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. ఉ.6.30ని శ్రీస్వామివారికి పంచామృత,పంచవర్ణ, నవవిధఫలరసాభిషేకాలు మరియు అమర్నాథ జలాభిషేకము,నారికేళ హారతి అనంతరం శ్రీస్వామివారికి అభిషేకించిన జలాన్ని భక్తుల మీద సంప్రోక్షణ చేయడమైనది. తదుపరి అలంకరణ,అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన,షోడశ ఉపచారాలు పూజలు జరిగాయి.క్షేత్ర వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో నిత్యసహస్రమోదక సహిత రుద్ర,చతుర్వేద గణపతిసూక్త,శ్వేతార్కగణపతి మూలమంత్ర హవనము,పూర్ణాహుతి చేయడమైనది. అనంతరం భక్తులు మరియు దేవాలయ కార్యకర్తలుచే 108 సార్లు శ్వేతార్కగణపతిస్వామివారి మూలమంత్రము జపం చేయడం జరిగింది. సాయంకాల పూజల్లో భాగంగా శ్రీస్వామివారి ఆయుధమైన నాగదండమునకు విశేష పూజలు,తీర్థప్రసాద వితరణ,మహా అన్నదానము నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు సిద్దిపేట,కరీంనగర్,పెద్ద పెండ్యాల,జనగామ,పెద్దపల్లి,పరకాల,భూపాలపల్లి,కాగజ్ నగర్,గజ్వేల్,హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.దేవాలయ కార్యకర్తలు జయమ్మ,సుశీలబాయ్,అనురాధ,సాయికుమారి,బేబీ,గుణవతి,దినేష్ లు సేవలనందించారు. అన్నదాన కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ సుధీర్,పి ఆర్ ఓ మణి,శ్రీనివాస్,రాకేష్ శుక్ల,శ్రావని పాల్గొన్నారు. ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి మరియు సాయికృష్ణశర్మ ఆధ్వర్యంలో నేటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మరియు నేడు మాజీ రాజ్యసభ సభ్యులు బిజెపి నాయకులు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు దేవాలయానికి విచ్చేశారు వీరిని రాధాకృష్ణశర్మ,హరికృష్ణస్వామి, సాయికృష్ణశర్మలు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ దేవాలయంలో కొలువై ఉన్న 29 ఉపాలయాలను దర్శింపజేశారు అనంతరం శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామివారి వద్ద మొక్కులు చెల్లించుకొని,హారతి,తీర్థప్రసాద వితరణ తీసుకున్నారు. వీరిని ఆలయమర్యాదలతో చిత్రపటం,శేష వస్త్రముతో సత్కరించటం జరిగినది.

ఇట్లు దేవాలయ మేనేజర్ ఎల్ రవి

శ్వేతార్కగణపతి కళ్ళు తెరచి రేపటికి 5 సంవత్సరాలు పూర్తి, దేవాలయంలో రేపు మహా అన్నదానం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామివారు తమ యొక్క దివ్య నేత్రములు తెరచినట్టుగా గోచరమై రేపటికి 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా…దేవాలయం లో విశేష అభిషేక, పూజ,హోమ,అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయం వ్యక్తంగా ప్రకాశితమై లక్షలాది మంది భక్తుల ఇంటి ఇలవేల్పు దైవంగా భాసిల్లుతున్న శ్రీ శ్వేతార్కమూలగణపతిస్వామివారు జూన్ 10 2014 మంగళవారం నాడు పాలతో అభిషేకం చేస్తున్న క్రమంలో తమ యొక్క దివ్య నేత్రాలు ఒకటి తర్వాత ఒకటి తెరిచి భక్తులను చూస్తున్నట్టుగా గోచరించింది. ఈ సందర్బంగా శ్రీస్వామివారికి రేపు ఉదయం 7గంటలకు ప్రత్యేక పంచామృత ద్వాదశ వర్ణ వివిధ నదీ సముద్ర జలములతో మరియు అమర్నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురాబడిన జలములతో అభిషేకం జరగనున్నది. ఆ తర్వాత విశేష అలంకరణ గణపతి పూజ,పుణ్యాహవాచనం,చతుర్వేద గణపతి సూక్త మహాగణపతి హోమం,హారతి,తీర్థప్రసాద వితరణ మరియు *మహా అన్నదాన* వితరణ జరగనున్నది. కావున యావన్మంది భక్త మహాశయులందరూ శ్రీస్వామివారి యొక్క దివ్య దర్శనము తప్పకుండా చేసుకొని శ్వేతార్కమూలగణపతిస్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. రేపు ఉదయం 7 గంటల నుంచి అన్ని పూజా కైంకర్యాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. భక్తులు కొబ్బరికాయ,పూలు,గజమాలలు,పూలదండలు,వస్త్రములు అందించువారు ఉదయం 7 గంటల లోపల దేవాలయంలో అందించగలరు. పూర్తి వివరాలకై దేవాలయ సమాచార కేంద్రం లో సంప్రదించగలరు

ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా పంపించగలరు.

శ్రీ స్వామివారి కళ్ళు తెరచిన వీడియో యూట్యూబ్ లో చూడ వచ్చును.

ఈరోజు చాలా విశేషమైన రోజు

*ఈరోజు చాలా విశేషమైన రోజు*

ఎందుకంటే…

*** ఈరోజు సోమవతి అమావాస్య

*** ఈరోజు శనిజయంతి

*** ఈరోజు నాగదండ పూజ

ఈ రోజున రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి ఈశ్వరాభిషేకము,విష్ణు ఆరాధన ,ఆంజనేయ స్వామి పూజలను ఎవరైతే జరుపుతారో వారికి జాతక సంబంధమైన సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ పూజను చేసుకోవడానికి
*కాజీపేటలో శ్రీ భ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయం* మరియు *somidi లోని శివాలయము*
*డీజిల్ కాలనీలోని ఆంజనేయస్వామి* దేవాలయము *మెట్టుగుట్ట* అనుకూలముగా
ఉంటుంది.

ఈరోజు శని జయంతి
ఈ రోజున కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ జ్యేష్టాసమేత శని దేవునికి నువ్వుల నూనెను పోసి పూజ చేసిన విశేష ఫలితములు కలుగుతాయి. దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారికి కి ప్రదోషకాల పూజా చేసి ..యోగ ఆంజనేయస్వామివారికి ప్రదక్షిణలు చేసినచో చాలా విశేషము .

*ఈరోజు నాగ దండ పూజ*
ఈ రోజున సంతాన సంబంధమైనదోషములు, సర్ప దోషములు కాలసర్ప దోషము కలిగినవారు
నాగ నాగదండపూజలో పాల్గొన్న ఎడల జాతక సంబంధమైన నాగ దోషములు తొలగిపోవును.
పై నాగదండ పూజలను ఉపవాసముచేసి సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తే మంచిది.
వీలయితే ఈ రోజున పితృదేవతలకు ఆర్గ్యం ఇచ్చిన,తిలతర్పణలు చేసినా..బ్రాహ్మణుడికి బియ్యము,కూరలు లాంటి స్వయంపాక ద్రవ్యములు ఇచ్చిన మంచిది.

అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
కాజీపేట,శ్వేతార్క ఆలయం

ఘనంగా శ్వేతార్కలో శని త్రయోదశి పూజలు

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో శని త్రయోదశి వేళా శ్రీ జేష్ట సమేత శనీశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. జనగామ సిద్దిపేట హుజురాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కాలేశ్వరం భూపాలపల్లి పరకాల జమ్మికుంట సిరిసిల్ల వర్గల్ తదితర ప్రాంతాల నుంచి దేవాలయానికి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్ర వ్యవస్థాపకుడు అయినవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి గారి నేతృత్వంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా తైలాభిషేకాలు మరియు నల్ల నువ్వులు దొడ్డు ఉప్పు నల్ల వస్త్రముతో శనిప్రతిమను తయారు చేసి విశేష అభిషేకాలు పూజలు అనంతరం నమో నారాయణ త్రిపాట్టి ఆధ్వర్యంలో నిత్య సహస్రమోదక హోమము మరియు శనీశ్వర మూలమంత్ర హోమములు నిర్వహించి అనంతరం భక్తులందరికీ అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమంలో దేవాలయం అసిస్టెంట్ మేనేజర్ డి సుధీర్ కుమార్ దేవాలయ పి ఆర్ ఓ మణిదీప్ శ్రావణి సేవకులు అనురాధ గంజి భవాని ప్రదీపు దినేష్ గుణవతి తదితరులు పాల్గొన్నారు ఇట్లు దేవాలయ మేనేజర్ రవి.
ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని ప్రసార మాధ్యమాలలో షేర్ చేయగలరు..
t.me/swetharka