శ్వేతార్క గణపతిని దర్శించిన Masterji Group of Institution Chairman గారు సంగం రెడ్డి  సుందర్ రాజ్ యాదవ్

స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దర్శనం నిమిత్తమై Masterji Group of Institution Chairman గారు సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు దేవాలయానికి దంపత సమేతంగా విచ్చేశారు వీరిని దేవాలయ మర్యాదలతో స్వాగతం పలికి దేవాలయం లో కొలువై ఉన్న అన్ని దేవతామూర్తులను దర్శించుకుని అనంతరం శ్వేతార్క గణపతి సన్నిధానంలో శ్వేతార్క అర్చనలో పూజ చేసుకొని స్వామివారి శేషవస్త్రం తీర్థప్రసాదములు చిత్రపటాన్ని అందించడం జరిగింది వీరిని అయినవోలు రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ శర్మ వేద మంత్రాలతో మంత్రోచ్ఛారణ చేశారు ఇట్లు దేవాలయ మేనేజర్

శ్వేతార్కలో ఉచిత హెల్త్ క్యాంప్

స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం దివ్య క్షేత్రం లో నేడు శ్రీ స్వామివారి 21వ వసంతోత్సవ లో భాగంగా నేడు నాలుగవ రోజు ఈ రోజు స్వామివారి సన్నిధానంలో లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంచు రీ కార్తీక్ ఆధ్వర్యంలో హెల్త్ చెక్ అప్ ఉచిత వైద్య శిబిరం అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి గారు ప్రారంభం చేయడం జరిగింది.వందలాది మంది భక్తులకు పరీక్షలు చేయించిన అనంతరం కార్యదర్శి చిదర శ్రీలత ఉచితంగా మందులు పంపిణీ చేసినారు చార్టర్ అధ్యక్షురాలు అంచూరి విజయలక్ష్మి కోశాధికారి కుందా రమాదేవి పాల్గొన్నారు