21వ వసంతోత్సవ ప్రారంభ పూజలలో వరంగల్ మేయర్ ప్రత్యేక పూజలు

శ్వేతార్క గణపతి దివ్య క్షేత్రంలో 21వ వసంతోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు మొదటి రోజు కార్యక్రమాలను వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అందుకు ముందు ఉదయం 6 నుండే విశేషంగా 108 కడువల ఆవు పాలతో శ్రీస్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిగింది. గణపతి పూజ ,పుణ్యాహవచనం, నాంది పూజలు మాతృక పూజలతో ఉత్సవ పూజలు ప్రారంభమైంది. ఈనాటి కార్యక్రమానికి మత్స్య అతిథిగా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీందర్ శర్మ హాజరయ్యాముఖ్య గమనిక
ఉత్సవా కార్యక్రమంలో భాగంగా రేపు 7.5.19 మంగళవారం ఉదయం 6.30ని లకు పరమహంస పరివ్రాజకచర్య శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతీ స్వామి శిషులు శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే శ్వేతార్కగణపతి స్వామివారికి ప్రత్యేక అష్టోత్తర నది, సముద్ర జలోదాకాభిషేకం, లక్ష గరిక ప్రత్యేక పూజలు జరుగును..