యోగాంజనేయవరాయ హారిమర్కటమర్కటయా నమః

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి క్షేత్రంలో హనుమత్ జయంతి పురస్కరించుకొని క్షేత్రంలో కొలువుదీరి ఉన్న శ్రీయోగాన్జనేయ స్వామి సన్నిధిలో ఈరోజు మన్యుసూక్త పారాయణము హనుమాన్ చాలీసా పారాయణము అష్టోత్తర సహస్రనామార్చన విశేష హారతులు తీర్థప్రసాద వితరణ జరిగినాయి.. అయినవోలు సాయికృష్ణశర్మ గారి ఆధ్వర్యంలో మహాగణపతి రుద్ర నమక చమక పురుష సూక్త సహిత ఏకాదశ మన్యు సూక్త, సుందరకాండ సహిత శ్రీరామ మంత్రములతో హోమం జరిగింది. 30 మంది జంటలతో ఈరోజు హోమం జరిగింది సుదూర ప్రాంతాల నుండి నల్గొండ సిద్దిపేట హైదరాబాద్ మేడ్చల్ కరీంనగర్ నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్షేత్రంలోని అన్నపూర్ణ భవనంలో భక్తులకు మహా అన్నదాన వితరణ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవాలయ సిబ్బంది మరియు కార్యకర్తలు అర్చకులు మిశ్రా నమో నారాయణ హరికృష్ణ స్వామి దయాకర స్వామి మేనేజర్ రవి అసిస్టెంట్ మేనేజర్ సుధీర్ కుమార్ ఆర్ పి ఆర్ వో మని సేవకులు శ్రీనివాస్ ప్రదీప్ దినేష్ భవాని గుణవతి శ్రావణి అనురాధ సుస్మిత చంద్ర సదానందం భక్తులకు సేవలను అందించారు ఇట్లు ఎల్ రవి మేనేజర్

శ్వేతార్క గణపతి క్షేత్రంలో యోగాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు

29 మే బుధవారం రోజున 29 దేవతామూర్తులతో కొలువుదీరి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న శ్రీయోగాంజనేయస్వామి సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు. హనుమజ్జయంతి పూజలను పురస్కరించుకొని ఉదయం 6 గం శ్రీయోగాంజనేయస్వామివారికి పంచామృతములతో, సింధూర లేపనంతో మరియు పానకంతో శ్రీస్వామివారికి విశేష అభిషేకం చేయడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు వడమాల పూజ తమలపాకుల అలంకరణ, కదలీఫల పూజ, మన్యుసూక్త పారాయణ సహిత అష్టోత్తర సహస్రనామార్చన పూజలు జరుగును. ఉదయం 11గం. ఏకాదశ మన్యుసూక్త హోమము జరుగును. ఈ హోమం చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విద్యావృద్ది, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, బుద్ధిర్బలం యశో ధైర్యం, కార్యసాధన, శృంఖల బంధ విమోచనం, కార్య రక్షణ, మన సంకల్పాలు, నవగ్రహ దోషాలు పోయి అన్ని కార్యలలో యోగాన్ని పొందగలరు. సాయంత్రం 7.30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము శ్వేతార్క గోపికా బృందంవారిచే జరుగును. కావున భక్తులు తప్పనిసరిగా ఈ హనుమజ్జయంతి రోజున ఏదో ఒక వేళ తప్పనిసరిగా యోగాంజనేయస్వామి యొక్క దర్శనం చేసుకొని మీయొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి పొంది హనుమంతుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ పరమేశ్వరుడు శ్రీరామచంద్రులవారి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కాగలరు. మరిన్ని వివరాలకై 8686398004,9394810881 నెంబర్నకు ఫోన్ చేయగలరు. శ్రీస్వామివారి సన్నిధిలో జరుగు హనుమజ్జయంతి పూజలకై భక్తులు కేవలం 251 రూపాయలు చెల్లించి అన్ని పూజలలో గోత్రనామాలు చదివించుకోనవచ్చును. ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అన్ని గ్రూపులకు పేజీలకు share చేయగలరు.

సంకష్టహరచవితి పురస్కరించుకుని శ్వేతార్క గణపతికి 340 లీటర్ల మామిడి ఫలరసాభిషేకం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో సంకష్టహర చతుర్ధి పురస్కరించుకొని శ్రీస్వామివారికి భక్తులచే సేకరించిన 340లీటర్ల మామిడి ఫలరసాభిషేకం చేయడమైనది. పూజకి వరంగల్ జిల్లా మెయిన్ జిల్లా జడ్జి రవీందర్ దంపతులు, టాస్క్ ఫోర్స్ C I గణేష్ దంపతులు, వరంగల్ జిల్లా D P R O శంకర్ పల్లవి దంపత్ సమేతంగా దేవాలయానికి విచ్చేశారు..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయడమైనది.

వైశాఖ మాసంలో మామిడి రసంతో గణపతికి అభిషేకం చేయడం వలన శరీర వేడిని, మరియు ఆరోగ్య సంబంధించిన వ్యాధులనుండి ఉపశమనం పొందవచ్చని దేవాలయ వ్యవస్థాపకుడు ఐనవోలు అనంతమల్లయ్య గారు దేవాలయ చరిత్ర మరియు మామిడి ఫలరసాభిషేకం ప్రాశస్త్యమును భక్తులనుదేశించి వివరించారు. అంతకు పూర్వం ఐనవోలు రాధాకృష్ణ శర్మ గారు 21మంది జంటలతో సంకష్టహరచవితి దూర్వా లాజ హోమం చేశారు.. అభిషేకం అనంతరం భక్తులకు శ్రీస్వామివారికి అభిషేకం చేసిన మామిడి రసాన్ని వితరణ చేయడమైనది.. దేవాలయం లోని అన్నపూర్ణ భవనంలో నేటి అభిషేకమునకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల్ల భక్తులకు అణా ప్రసాద వితరణ చేయడమైనది.

పూజారులు సాయికృష్ణ శర్మ,నమోనరాయణ, మిశ్రా మరియు దేవాలయ మేనేజర్ రవి,ప్రదీప్,దినేష్,దేవాలయ pro మణి కార్యకర్తలు పాల్గొన్నారు..

ఈ సమాచారమును మీయొక్క అన్ని మీడియా ప్రచారమాధ్యమలలో షేర్ చేయగలరు…

రేపు సంకష్టహరచవితి శ్వేతార్క గణపతికి మామిడిఫలరాసభిషేకం

స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో 22 5 2019 నాడు బుధవారం రోజున సంకష్టహారచతుర్ధిని పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారికి ఉదయం 6గంటలకి పంచామృత అభిషేకము అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ. ఉదయం 10 గంటలకి నిత్య సహస్రమోదక సహిత రుద్ర హోమము తదుపరి మహా హారతి అన్నదానము తిరిగి సాయంత్రం 5 గంటలకి దుర్వా మరియు లాజలతో సంకష్టహర హోమము అనంతరం 208 కిలోల మామిడి పళ్ళ రసంతో శ్వేతార్కమూలగణపతిస్వామివారికి చూతఫలరసాభిషేకం చేయడం జరుగుతున్నది.. తదుపరి హారతి ఆశీర్వచనము తీర్థప్రసాద వితరణ మహా అన్నప్రసాద వితరణ జరుగును. కావున ఇట్టి విషయాన్ని గమనించి మరిన్ని పూర్తి వివరాలకు దేవాలయ సమాచార కేంద్రం నందు లేదా 9394810881 నాకు సంప్రదించగలరు. ఇట్టి విషఈ సమాచారమును మీయొక్క అన్ని మీడియా ప్రచారమాధ్యమలలో షేర్ చేయగలరు…

ఇట్లు
దేవాలయ మేనేజర్
రవి

2019 శ్వేతార్క గణపతి నవరాత్రోత్సవా కళ్యాణోత్సవ వేడుకలకు సహకరించగలరు

ఈ సమాచారమును మీయొక్క అన్ని మీడియా ప్రచారమాధ్యమలలో షేర్ చేయగలరు…

Sample book pages

*భక్తులకుమనవి*

*(వ్యాపారస్తులకు ప్రచార అవకాశం)*

ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు…
16 రోజుల పాటుగా జరుగబోవు
శ్రీ శ్వేతార్కగణపతి స్వామి వారి నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ *36పేజీల ఆహ్వానపత్రిక (book let)కు*
మీ *వ్యాపార ప్రకటన*
ను ఇవ్వదల్చిన ఎడల తొందరగా 9347080055 నెంబర్ నకు ఫోన్ చేయ గలరు.
*కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం కలదు.*
కావున ముందుగా రిజర్వ్ చేసుకోగలరు.
*9347080055*
…………………..
మల్టీ కలర్ ఇన్నర్ పేజీ
……………………….
ఫుల్ పేజీ…8.000₹
ఆఫ్ పేజీ…4.000₹
క్వాటర్ పేజీ…2.000₹

గణపతి ముందు గుంజీళ్లు తీయడం వెనుక ఉన్నఒక పురాణ కథ

విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది.
ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!
వినాయకుని ముందు గుంజీళ్ళు తీయటం వెనుక ఉన్న ఆరోగ్య/ఆధ్యాత్మిక రహస్యం:
వినాయకుడు మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి… మన శరీరం మొత్తం మూలాధారచక్రంతోనే ముడి పడి ఉంది… ఇది సరిగ్గా మనం కూర్చున్నపుడు వెన్నెముక కు క్రిందిభాగంలో చివరగా ఉంటుందన్న మాట. గుంజీళ్ళు తీసేటపుడు ఈ చక్రం చైతన్యవంతమై మనలోని ఆధ్యాత్మిక పురోగతి వృద్ధి అవుతుంది…
గుంజీళ్ళు తీసేటపుడు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోతెలుస్తుంది… సాధారణంగా మన నాసికం(ముక్కు)లోని రెండు రంధ్రాల నుండి ఒకేసారి గాలి పీల్చటం కానీ వదలటం కానీ చేయం.. ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం.. కనీసం మనకు అవగాహన కూడా ఉండదు.. ఒకసారి కావాలంటే మీ నాసికరంధ్రాలదగ్గర చేతి వేలు ఉంచుకుని పరీక్షించండి.. ఇది మీకు అర్థం అవుతుంది..
అయితే ఈ గుంజీళ్ళు తీసిన తర్వాత నాసిక లోని రెండు రంధ్రాలు మన శ్వాసక్రియకు ఉపయోగపడడం మనం గమనించవచ్చు.. అందుకే గుంజీళ్ళు తీయడమనేది ఒకరకంగా ప్రాణాయామ శక్తిని పొందడానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతిది దోహదంచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…

2019 శ్వేతార్క గణపతి దీక్షలు

*ముందస్తు సమాచారం*

*గణపతి దీక్షా తేదీలు*

ఆగస్టు 28 నుండి
సెప్టెంబర్ 12 వరకు
శ్రీశ్వేతార్కగణపతి స్వామి వారి నవరాత్రోత్సవ కళ్యాణోత్సవములు

*………..దీక్షలు……..*

02.8.2019 శుక్రవారం నుండి 42రోజుల మండల దీక్ష ఆరంభం

22.8.2019 గురువారం నుండి 21రోజుల అర్థమండలదీక్ష ఆరంభం

27.8.2019 మంగళవారం నుండి 16రోజుల షోడశ దీక్ష ఆరంభం

1.9.2019 ఆదివారం నుండి 11రోజుల ఏకాదశ దీక్ష ఆరంభం

12.9.2019 రోజున దీక్షవిరమణ

…………………………..

సెప్టెంబర్ 2 వినాయకచవితి పండుగ
సెప్టెంబర్ 3 ఋషిపంచమీ
సెప్టెంబర్ 4 సూర్యషష్టి
సెప్టెంబర్ 6 జ్యేష్టాష్టమీ
సెప్టెంబర్ 10 వామన జయంతి
సెప్టెంబర్ 11 ఉత్సవగణపతి నిమజ్జనం
సెప్టెంబర్
12 దీక్షవిరమణలు

ఇట్లు

శ్వేతార్కమూలగణపతి దేవాలయం
కాజీపేట
మీ వద్ద ఉన్న అన్ని గ్రూపులలో ఈ విషయాన్ని పోస్ట్ చేయగలరు

రేపు నృసింహ జయంతి ప్రత్యేక పూజలు

స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో రేపు నరసింహ జయంతి సందర్భంగా మన దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ ప్రహలాద నరసింహ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతున్నది కావున భక్తులు శక్తిగా రేపు ఉదయం ఏడు గంటల లోపు పానకం అభిషేకం చేయడం జరుగుతున్నది అనంతరం అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ ఉదయం పది గంటలకి నరసింహ మూలమంత్ర నరసింహ స్వామి మూల మంత్రం తో హవనం చేయడం జరుగుతున్నది అనంతరం భక్తులకు అందరికీ ఆశీర్వచనం అన్నదానం కూడా ఉంటుంది అలాగే దేవాలయ సమాచార కేంద్రం లేదా 93 94 810 8 81 సంప్రదించగలరు ఇట్లు దేవాలయ మేనేజర్ రవి