రేపు శ్వేతార్క గణపతికి సంకష్టహర చవితి సంధర్భంగా ఇక్షురసాభిషేకం

తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ అర్బన్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రంలో రేపు 22 ఏప్రిల్ సోమవారం రోజున సంకష్టహరచవితి పురస్కరించుకుని పార్వతీ తనయుడికి మహా ఇక్షురసాభిషేకం జరుగుతుంది. స్వయంవ్యక్తమైన శ్వేతార్కుడికి శ్రీఘ్రకార్యసిద్ది, సౌమాంగళ్యసిద్ధికి, ఎండ వేడి తపమునుండి దేశరాష్ట్రమంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గణపతికి ఈ అభిషేకం జరుగనుంది. గణపతికి ప్రీతికరమైన చెఱుకు రసం,కోబరికాయ, గరిక మరియు శర్కర తీసుకొని సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు దేవాలయంలో అందించగలరు. వివిధరాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు మహాన్నదానము జరుగును. *కార్యక్రమాల వివరాలు ఉదయం 7గంటలకు క్షిరాభిషేకం, 10గంటలకు నిత్యాసహస్రమోదక హోమం, సాయంత్రం 5గంటలకు దూర్వా లాజ హోమం, 6గంటలకు విశేష ఇక్షురసాభిషేకం అభిషేకం, 7 గంటలకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, 7.30 హారతి ,తీర్థప్రసాద వితరణ, 8.15 అన్నదానం కార్యక్రమములు జరుగును…

ఇట్లు

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్దాంతి

కోరిన కోర్కెలు తీర్చే క్షిప్రప్రసిద్ది లక్షలాదిమంది ఇంటి ఇలవేలుపు దైవంగా భాసిల్లుతోన్న ఇక్కడి శ్వేతార్కగణపతి స్వామివారు… www.swetharka.org..telegram:-t.me/swetharka, WhatsApp:-+91 9394810881