14.04.2019 శ్రీసీతారామ కళ్యాణమహోత్సవమునకు ఆహ్వానం

భక్తులకు ఆహ్వానం

*14.04.2019 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం*

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి గాంచిన వరంగల్ జిల్లా కాజీపేట శ్వేతార్కగణపతి క్షేత్రంలో కొలువైవున్న పట్టాభిషేక సీతా కోదండరాముల సన్నిధిలో ఉదయం 10.30 ని||లకు సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరుపుటకు నిర్ణయమైనది. కల్యాణోత్సవంలో పాల్గొను భక్తులు తప్పక సంప్రదాయ దుస్తుల్లో రాగలరు. కల్యాణోత్సవంలో కూర్చోను భక్త్తులు ముందుగా దేవాలయ సమాచార కేంద్రంలో తమ పేర్లను ఇప్పటి నుండే నమోదు చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం నాడు శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు భాషింగాలు పూలమాలలు మరియు అన్నదానమునకు సహకరించదలచిన.
భక్తులు పూర్తి వివరాల కొరకు సమాచార కేంద్రంలో లేదా 9394810881 ఫోన్ ద్వారా అయిన తెలుసుకోగలరు. ఫోన్ చేయు వారు దేవాలయ పని వేళల్లో ఫోన్ చెయ్యగలరు. ఇట్లు నిర్వాహకులు, దేవాలయ మేనేజ్మెంట్. శ్వేతార్క గణపతి క్షేత్రం కాజిపేట వరంగల్లు నగరం.www.swetharka.org