రేపు శ్వేతార్క గణపతికి సంకష్టహర చవితి సంధర్భంగా ఇక్షురసాభిషేకం

తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ అర్బన్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రంలో రేపు 22 ఏప్రిల్ సోమవారం రోజున సంకష్టహరచవితి పురస్కరించుకుని పార్వతీ తనయుడికి మహా ఇక్షురసాభిషేకం జరుగుతుంది. స్వయంవ్యక్తమైన శ్వేతార్కుడికి శ్రీఘ్రకార్యసిద్ది, సౌమాంగళ్యసిద్ధికి, ఎండ వేడి తపమునుండి దేశరాష్ట్రమంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గణపతికి ఈ అభిషేకం జరుగనుంది. గణపతికి ప్రీతికరమైన చెఱుకు రసం,కోబరికాయ, గరిక మరియు శర్కర తీసుకొని సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు దేవాలయంలో అందించగలరు. వివిధరాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు మహాన్నదానము జరుగును. *కార్యక్రమాల వివరాలు ఉదయం 7గంటలకు క్షిరాభిషేకం, 10గంటలకు నిత్యాసహస్రమోదక హోమం, సాయంత్రం 5గంటలకు దూర్వా లాజ హోమం, 6గంటలకు విశేష ఇక్షురసాభిషేకం అభిషేకం, 7 గంటలకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, 7.30 హారతి ,తీర్థప్రసాద వితరణ, 8.15 అన్నదానం కార్యక్రమములు జరుగును…

ఇట్లు

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్దాంతి

కోరిన కోర్కెలు తీర్చే క్షిప్రప్రసిద్ది లక్షలాదిమంది ఇంటి ఇలవేలుపు దైవంగా భాసిల్లుతోన్న ఇక్కడి శ్వేతార్కగణపతి స్వామివారు… www.swetharka.org..telegram:-t.me/swetharka, WhatsApp:-+91 9394810881

హనుమత్ విజయోత్సవమ్

స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో రేపు హనుమత్ విజయోత్సవం సందర్భంగా రేపు దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ యోగాంజనేయస్వామి వారికి పంచామృతాభిషేకాలు మరియు సహస్రధార అభిషేకాలు పానకం తో అభిషేకము మరియు వడమాల పూజలు లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము హనుమాన్ మూలమంత్ర హోమములు అనంతరం సహస్రనామార్చన వడపప్పు పానకం తో భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ అన్నదానం జరుగును పూర్తి వివరాలకు దేవాలయ సమాచార కేంద్రం లేదా దా 9 3 9 4 8 1 0 8 8 1 నాకు సంప్రదించగలరు ఇట్లు దేవాలయ మేనేజర్ రవి

14.04.2019 శ్రీసీతారామ కళ్యాణమహోత్సవమునకు ఆహ్వానం

భక్తులకు ఆహ్వానం

*14.04.2019 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం*

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి గాంచిన వరంగల్ జిల్లా కాజీపేట శ్వేతార్కగణపతి క్షేత్రంలో కొలువైవున్న పట్టాభిషేక సీతా కోదండరాముల సన్నిధిలో ఉదయం 10.30 ని||లకు సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరుపుటకు నిర్ణయమైనది. కల్యాణోత్సవంలో పాల్గొను భక్తులు తప్పక సంప్రదాయ దుస్తుల్లో రాగలరు. కల్యాణోత్సవంలో కూర్చోను భక్త్తులు ముందుగా దేవాలయ సమాచార కేంద్రంలో తమ పేర్లను ఇప్పటి నుండే నమోదు చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం నాడు శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు భాషింగాలు పూలమాలలు మరియు అన్నదానమునకు సహకరించదలచిన.
భక్తులు పూర్తి వివరాల కొరకు సమాచార కేంద్రంలో లేదా 9394810881 ఫోన్ ద్వారా అయిన తెలుసుకోగలరు. ఫోన్ చేయు వారు దేవాలయ పని వేళల్లో ఫోన్ చెయ్యగలరు. ఇట్లు నిర్వాహకులు, దేవాలయ మేనేజ్మెంట్. శ్వేతార్క గణపతి క్షేత్రం కాజిపేట వరంగల్లు నగరం.www.swetharka.org

భక్తులకు శ్రీవికారి నామ సంవత్సర ఉగాది శుభాకంక్షలు

తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట శ్వేతార్క మహా గణపతి సన్నిధిలో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీశ్వేతార్క గణపతి స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరుగనున్నయి.. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారికి విశేష పంచామృత, నది, సముద్ర జలాలతో అభిషేకం, 8గంటలకు మహాకాళ స్వరూపమైన పంచాంగమునకు విశేష పూజ. 8.30ని||లకు శ్రివికారి నామ సంవత్సరంలో దేశ,రాష్ట్ర వ్యవహారాలలోఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపుతూ క్షేత్ర వ్యవస్థాపకుడు పంచాంగ కర్త ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి గారిచే పంచాంగ శ్రవణం చేస్తారు. దేవాలయ ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ సీతా కోదండ రామాలయంలో 9 రోజులపాటు జరుగు చైత్ర వసంత నవరాత్రోత్సవముల సందర్భంగా రాముల వారికి 7.30 ని||లకు విశేష అభిషేకం, 9.30 ని||లకు గణపతి పూజ, పున్యాహవచనం,అంకురార్పణ ఉత్సవ పూజలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ రాములవారి సన్నిధిలో విశేష అర్చనలు,అష్టోత్తర సహస్రనమార్చన పూజలు, హనుమాన్ చాలీసా,సుందరకాండ పారాయణం జరుగనున్నాయి. భక్తులు ప్రతిరోజూ పులిహోర భోగమునకు, పూలదండలకు మరియు పూజలలో గోత్రనామాలు చదివించాలని అనుకునే వారు మరిన్ని వివరాలకు 9394810881నందు సంప్రదింగలరు.