శ్వేతార్కలో మహాశివరాత్రి వేడుకలు


తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీసంతాన నాగలింగేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకములు జరుపబడును ఉదయం 7గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరుపబడును మరియు ఉదయం 7 గంటల నుండి భక్తులచే సామూహిక అభిషేకములు బిల్వార్చనలు జరుపబడును. పగలు ఒంటిగంటకు ప్రత్యేక అభిషేకము సహస్ర నామార్చన జరుపబడును. సాయంత్రం 6 గంటలకు రుద్రాభిషేకము, రాత్రి 10 గంటల నుండి జాగారం సందర్భంగా ప్రత్యేక సాహితి కదంబ కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమము తెల్లవారుజామున నాలుగు గంటల వరకు జరుగును.  లింగోద్భవ సమయమునందు శివునికి భక్తులచే స్వయముగా బిల్వదళ పూజలు జరుపబడును. శ్రవణా నక్షత్రం సోమవారం రోజున మహాశివరాత్రి పండుగ రావడం చాలా అరుదుగా చెప్పవచ్చు. దీనిని సిద్ధ శివరాత్రి అని కూడా పిలుస్తారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఈ కలయిక వస్తుందని తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరు శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే చాలా విశేషము. ఈ శివరాత్రికి కొత్తగా ఉపవాసము జాగారం ఆరంభించే వారికి చాలా మంచిది కాబట్టి భక్తులు ఈ విశేషాన్ని ఉపయోగించుకొని శివరాత్రి పండుగను జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. ఇట్లు అనంత మల్లయ్య సిద్ధాంతి

శ్రీవికారి నామ సూర్యసిద్ధాంత త్రిపురారివారి పంచాంగం ఆవిష్కరణ జరిగింది

శ్రీ వికారి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఈరోజు స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. శ్రీ వికారినామ సంవత్సరంలో జరగబోయే మంచిచెడుల గురించి ఈ పంచాంగము నందు పేర్కొనడం జరిగిందని సభకు అధ్యక్షత వహించిన పంచాంగ కర్త భద్రకాళి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్వేతార్కగణపతి ఆలయ వ్యవస్థాపకులు మరియు విద్వత్సభ  ఉపాధ్యక్షులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ   సిద్దాంతి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్వేతార్క గణపతి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ,బాసర దేవస్థానం సామవేద పండితులు నవీన్ శర్మ,మరియు త్రిగుళ్లశ్రీనివాస శర్మ, కందికోట శ్రీనివాస్ శర్మ, యల్లంభట్ల రవీందర్ శర్మ ,సందుగుల సాయి శర్మ , అడ్లూరు శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామవేద పండితులు నవీన్ శర్మ పంచాంగం ఆవిష్కరిస్తూ వరంగల్ భద్రకాళీ దేవస్థానం పంచాంగము ఎంతో ప్రాచుర్యమును పొందినదని హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జనగామ హుస్నాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో వేలాది మంది పంచాంగ అభిమానులు ఉన్నారని తెలియజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అయినవోలు రాధాకృష్ణ శర్మ అయినవోలు సాయి కృష్ణ శర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. పంచాంగం కావలసిన వారు శ్వేతార్క గణపతి క్షేత్రంలో, భద్రకాళి దేవస్థానంలో లభ్యమవును.