శ్వేతార్కలో జ్ఞాన సరస్వతీ అనుగ్రహమును కోరుతూ సప్తమేధ గణ వ్రత పూజలు


​వరంగల్ అర్బన్ జిల్లాలోని తెలంగాణ గణపతిగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్ర నిలయంలో కొలువుదీరిన శ్రీ జ్ఞానముద్రసరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీపంచమి/మదన పంచమి అనగా శ్రీసరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశేష పూజలు నిర్వహించబడినవి. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పంచామృత, మేధా సూక్త, సరస్వతీ సూక్తములతో విశేష అభిషేకములు జరిగినవి. ఉ.9నుండి 1గం వరకు జరిగిన సామూహిక అక్షరాభ్యాస పూజలలో మరియు సప్తమేధ గణ వ్రతం, గణపతి నిత్యాసహస్రమోదక సప్తమేధ గణ, మేధాదక్షిణమూర్తి, సరస్వతీ మూలమంత్ర హోమము, భజనలు, సంగీత సేవల్లో మెదక్,హైదరాబాద్, మంచిర్యాల, వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మాజీ dcc చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శ్వేతార్క గణపతి స్వామివారిని దర్శించి పుట్టినరోజు వేడుకలను ఆలయంలో గల గణపతి కళాక్షేత్రంలో ప్రముఖుల,కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు ఆలయ మర్యాదలతో వారిని సత్కరించటం జరిగింది మరియు ఇందులో 52,53,54 division కార్పొరేటర్ లు జకులరామరవిందర్, ఎం స్వప్న చరణ్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాలయ అన్నపూర్ణ భవనంలో భక్తులకు అన్నప్రసాదా వితరణ జరిగింది. ఈరోజు పూజ కార్యక్రమంలో దేవాలయ వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ నేతృత్వంలో ఐనవోలు సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు టీ. హరికృష్ణ స్వామి, ఆనంద్ త్రిపాఠి,నరేషమిశ్రల సహాయంతో భక్తులకు విశేష పూజలు నిర్వహించారు. కార్యకర్తలు సుధీర్,మణి, స్వప్న,సుష్మిత,సాంబమూర్తి లు సేవలు అందించారు.

www.t.me/swetharka……Whatsapp: 9394810881