వాహనం మొదటిసారి వాడునపుడు ప్రమాదములు రాకుండ చదువవలసిన శ్లోకము

శ్లోకం!!సూర్యపుత్రం హాయారూడం పంచవక్త్రం దశాంభకం, రక్తవర్ణం కశాఖండం రేవంతం ద్విభుజం స్మరేత్!! మంత్రం!!సూర్యపుత్ర నమస్తేస్తు నమస్తే పంచవక్త్రక నమొగంధర్వ దేవాయ రేవంతాయ నమోనమహా!!

ఇది పఠించి వాహనారూఢమైన ప్రమాదములు జరగవు

పంచామృత రహస్యం, విశిష్టత , ప్రయోజనాలు..!

హిందూ సంస్కృతి ఆచారాల ప్రకారం.. ఏ శుభకార్యం వచ్చినా.. ఆ కార్యములో పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము.ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది.
మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
శబరిమల అయ్యప్ప స్వామికి, పరమేశ్వరుడికి పంచామృ తాలతో అభిషేకం చాలా ప్రీతికరం అందుకే శివుడును అభిషేకప్రియుడు అని అంటుంటారు.

కొన్ని దోషాలకు నివారణగా పరమేశ్వరుడుకి రుద్రాభిషేకం, పంచామృ తముతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. పంచామృత తీర్థం తీసుకుంటే మనం అనుకున్న పనులు అఖండంగా పూర్తి అవుతుంది.

 మరియు బ్రహ్మలోకం ప్రాప్తించును.
🕉️పంచామృతం అంటే ఏమిటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

పంచామృతం అంటే….

పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. 

భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!
🍁ఆవు పాలు

ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.
🍁పెరుగు

పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది.

కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయం పూట గుడికి వెళ్ళి పెరుగుతో పంచామృతం తీసుకోవటం ఈ విధంగా చూసినా మంచిదే!
🍁నెయ్యి

మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి.

దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.
🍁తేనె

వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. 

తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
🍁పంచదార

ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది.

వీటన్నిటి కలియికతో చేసిన ఈ పంచామృతం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

04/02/2019 అమావాస్య మహోదయ పుణ్యకాలం

కోటిసూర్య గ్రహణములతో సమానమైనది.

పుష్య బహుళ అమావాస్య. *04/02/2019- సోమవారం* మహోదయ పుణ్యకాలం.

శ్లోకం:-

 *అర్క శ్రోణా వ్యతీపాత యుక్తా౽మా పౌష మాఘయోః!అర్ధోదయస్స విఙ్ఞేయః కించిన్యూనా మహోదయః*

అమావాస్య,సోమవారం, శ్రవణానక్షత్రం, వ్యతీపాతయోగం కలిసిన రోజున మహోదయమనే అలభ్యపుణ్యకాలం.

చాలా అరుదుగా ఈ కలయిక సంభవిస్తుంది.  అందుచేతనే ఇటువంటి యోగం కోటిసూర్య గ్రహణములతో సమానమైనది అని పెద్దలు చెప్పారు.

 ఈ సమయంలో  సముద్రస్నానం  చేసి పితృతర్పణములు చేయాలి. ఈరోజున  చేసే దానములు విశేష ఫలితాన్నిస్తాయి. సాధకులకు మంత్రానుష్ఠానపరులకు  చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహోదయ పుణ్యకాలంలో ఈశ్వర పూజ,  స్నానం,  జపం,  తపం  ఆచరించి, వారి వారి శక్తి కొలది దానధర్మాలను ఆచరించి అనంతకోటి పుణ్యఫలాన్ని పొందగలరు. *🙏🙏

02.02.2019 శనిత్రయోదశి. ఈ శనిత్రయోదశి నాడు అన్ని రాశులవారు పూజలో పాల్గొనండి సమస్త శని బాధల నుండి విముక్తి పొందండి..

స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు కు శనివారం, లయకారకుడైన పరమేశ్వరునికి త్రయోదశి ప్రీతికరమైనవి. శనివారం రోజున త్రయోదశి తిథి వచ్చిన యోగాన్ని “శనిత్రయోదశి” పర్వదినంగా పేర్కొంటారు.
శివకేశవులకు ప్రీతి కరమైన “శనిత్రయోదశి” రోజున శనైశ్చరుని మరియు సవర్ణ, సపత్ని, సవాహన నవగ్రహాల అనుగ్రహం పొందుట ఎంతో శ్రేయస్కరం.

జాతకరీత్యా అర్థాష్టమ, అష్టమ, ఏల్నాటి శని దోష ప్రభావిత రాశులైన వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారి శని దోష నివారణకు 02.02.2019 శనివారం రోజు ఉదయం 10.30 గం.లకు “సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహములకు అభిషేకం, శనికి తైలాభిషేకం, షోడశోపచార పూజలు, తిల దానం, నవగ్రహ హోమాలు నిర్వహించబడును.

     -::  ఫలితాలు. ::-

*వృత్తి, ఉద్యోగ, వ్వాపారాదులలో విజయం, లాభం సిద్ధించుటకు*

*విద్య, విదేశీయాన, వివాహ, సంతాన, అన్యోన్య దాంపత్యం పోందుటకు*

*అనారోగ్య, కోర్టు, ఋణబాధల నివారణకు*

*కీర్తి-ప్రతిష్ఠలు, దీర్ఘాయువు, ఐశ్వర్యం, ధర్మార్ద, కామ, మోక్షాలు పొందుటకు*

శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం.

శనిగ్రహం దీర్ఘాయువు, దుర్భాగ్యము, దుఃఖము, వృద్ధాప్యం మరియు చావు, క్రమశిక్షణ, నియమం, బాధ్యత, కాలయాపనలు, గాఢమైన వాంఛ, నాయకత్వము, అధికారం, నిరాడంబరత, చిత్తశుద్ధి, అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం, కాదనుట, అనురాగం లేకపోవుట, ఆత్మ స్వరూపత్వం, కష్టించి పనిచేయుట, సంవిధానం, వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది. అసమానమైన లక్షణాలు: అపారమైన శక్తి, చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు..

 శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే, కాలసర్పం, సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.

శని త్రయోదశి రోజున సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహ అభిషేక హోమాలలో పాల్గొనుటకు సంప్రదించువారు

*29 దేవతమూర్తులతో కొలువుదిరిన దంపత్ వాహన సమేత తెలంగాణ గణపతిగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లా కాజీపేటలోని సపరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి స్వామివారి దివ్య క్షేత్రం* 
Website : www.swetharka.org

Telegram : t.me/swetharka

Contact/Whatsapp : +91 9347080055, +91 9394810881.

*శ్లోకం:*

*ॐ నీలాంజన సమాభాసం | రవి పుత్రం యమాగ్రజం||*

*ఛాయామార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరమ్ ||*

నువ్వులు ,నువ్వులనునెతో అభిషేకం, మరియు 108 సార్లు ప్రదక్షణ..చేయండి
_*శని త్రయోదశి*_

———————–

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. 

ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. 

శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు..

శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాయాధిపతి లా శని దండన విధిస్తాడు.శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి ,త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేస్తాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి.
*శని త్రయోదశి* ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లాబిస్తుంది. ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు,శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు.ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనె తో శని కి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టు కి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనె లో ముఖం చూసుకొని ఆ నూనె ని దానం చేయడం. నల్ల కాకి కి అన్నం పెట్టడం,నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు,నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది.

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం,కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

_*శనీశ్వర స్తోత్రం*_

———————

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్‌ నమామి శనైశ్చరమ్‌ (108 సార్లు)

ప్రదక్షిణ చేసి తరువాత కాళ్లు కడుక్కొని ఈశ్వర దర్శనం కానీ అభిషేకం చేయండి

తప్పక హనుమంతుని ఆలయాన్ని దర్శించి హనుమాన్ దర్శనం హనుమంతునికి కూడా 108 ప్రదక్షిణలు చేయండి .

అందువల్ల ఏలినాటి శని ప్రభావం ఉపశమనం కలిగి మీకు మనశ్శాంతి సౌఖ్యం లభిస్తాయి కార్య విజయం కలుగుతుంది.

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా…? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.

త్రయోదశి వ్రతం

త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశిగానీ లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు గానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు.

ప్రదోషకాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలకాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట. 

శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. 

1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.

2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.

3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు 

నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ: శివాయ” అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.

7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

4-2-2019 తేదీన జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీసంతనానగలింగేశ్వర స్వామివారికి ఉదయం 7 నుండి 11 వరకు విశేష  అభిషేకాలు 11 గంటలకు సోమవతిఅమ్వాస్య ప్రత్యేక పూజా.. సాయంత్రం 6.30 ని లకు నాగదండ పూజ జరుగును…. జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం,రాహు కేతు దోషం ఉన్నవారు తప్పక పాల్గొనగలరు….

​పుష్యబహుళ అమావాస్య సోమవారం 4-2-19 శ్రవణానక్షత్రయుక్త మహోదయపుణ్యకాలం గురించి శ్రీ స్వామివారి అనుగ్రహపూర్వక భాషణం.

మాఘ పుష్య మాసాలలో అమావాస్య సోమవారం నాడు శ్రవణా నక్షత్రం కలిసిన పుణ్యకాలం మహోదయం చెప్పబడుతోంది.

కోటి సూర్య గ్రహణాలలో దానం, తపస్సు చేసిన ఫలితము ఒక్క మహోదయ కాలంలో చేసిన స్నానానికి సమానము.

పరమాచార్య స్వామివారు మహోదయ పుణ్యకాలంలో విద్యారణ్యమునందు స్నానమాచరించేవారు.
సులభంగా తరించటానికి ఇటువంటి సదవకాశాన్ని  అందరూ ఉపయోగించుకోవాలని స్వామి వారు బోధించారు..

4-2-2019 తేదీన జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

సోమవారం నాడు వచ్చే అమావాస్యకు హిందూధర్మం లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోజుని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకం లో ఉండే సకల దోషాలు పోతాయి.

_*సోమావతి అమావాస్య కథ :*_

ఒకానొక ఊరిలో ఒక సాధువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంటిలోని పెళ్లికాని ఒక కన్యను ఆమె ముఖం చూసి దీవించకుండా నే వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం ఎంతో బాధ పడింది. చివరికి పురోహితుని పిలిపించి కారణం అడుగగా , ఆయన ఆమె జాతకం చూసి, ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలం లోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. అని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుని ప్రార్థించారు. ఆయన సింఘాల్ ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పాడు.

వర్తకుడు ఆ అవివాహిత అయిన కన్యనూ,తన చిన్న కొడుకునూ అక్కడికి పంపుతాడు. మార్గ మధ్యం లో ఒక నదిని దాటబోతుండగా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన  గద్ద పిల్లను ఒక పెద్ద పాము చంపి తినడానికి వస్తోంది. నిత్యం అక్కడ ఇదే జరుగుతుండేది. గద్ద పిల్ల పుట్టిన వెంటనే పామువచ్చి వాటిని తిని వెళ్లిపోయేది. కానీ ఆరోజు ఆయువతి ధైర్యంగా ఆ పామును చంపి గద్ద పిల్లను కాపాడింది. తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గద్ద వారికి చాకలి స్త్రీ ఇంటికి దారిచూపింది. కొన్ని నెలల పాటు ఆ చాకలామెకు సేవచేయగా ఒక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమనిచ్చింది. ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోయింది.

ఫిబ్రవరి 4న సోమాతి అమావాస్య రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే..

సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు.

సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య ఫిబ్రవరి నాలుగో తేదీ (2019)న రానుంది.

ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది

శ్వేతార్క Selfie Contest

Sai krishna:

శ్వేతార్క selfie contest :

 తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట శ్వేతార్కమహాగణపతి సన్నిధిలో భక్తులు తమ కెమెరాలో స్వామివారిని లేదా పరివార దేవాలయ మూర్తుల వద్ద భక్తులు selfie దిగి #swetharka అను tag జత చేసి మీ వాట్సాప్, instagram, facebook, మరిన్ని సమాచార మాధ్యమంలో పోస్ట్ చేసి ఎక్కువ likes వచ్చిన ముగ్గురిని సెలెక్ట్ చేసి వారిని రాబోవు 22వ శ్రీ శ్వేతార్కగణపతి స్వామివారి (పుట్టినరోజు) వసంతోత్సవ వేడుకల్లో జరుగు మహా కళ్యాణోత్సవంలో కూర్చునే మహాదవకాశం కలిపించి శ్రీస్వామివారి విశేష ప్రసాదం ఇవ్వబడును…  మీరు దిగే సెల్ఫీ ఫోటోను మాకు శ్రీరామనవమి లోపున మీరు దిగిన ఫొటల likes, shares, కామెంట్స్ ల screenshots ని మా 9394810881 నెంబర్నకు  పంపగలరు…

ఇట్లు ఐనవోలు సాయికృష్ణ శర్మ దేవాలయ పరిపాలన నిర్వాహకులు

 భక్తులకు గమనిక 1. మీరు దిగిన ఫోటోగ్రఫీలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో ఉండాలి… 2. దేవాలయ క్షేత్రంలో మాత్రమే దిగి ఉండాలి…. 3. దేవతమూర్తులతో కూడిన సెల్ఫీ అయి ఉండాలి…. 4. గ్రూప్ ఫోటోగ్రఫీ అయినట్లైతే వేరేగా పరిగణనలోకి తీసుకోవడం జరుగును…. 5. తప్పనిసరిగా నుదుట తిలకం,కుంకుమ ధరించి ఉండాలి… మగవారు దోవతి,లుంగీ,పంచ,పైజామా లో ఉండాలి… జీన్స్,టీ-షర్ట్స్ అంగీకరించబడవు.. 6.ఆడవారు తప్పనిసరిగా తిలకం,కుంకుమ, చేతికి గాజులతో ఉండాలి,లంగావోని,చీర,పంజాబిడ్రెస్సు అంగీకరించబడును….జీన్స్,టీ-షర్ట్స్ అంగీకరించబడవు… 7. అన్ని వయసులవారు ఇందులో పాల్గొనవచును….

ప్రారంభమైన కాజిపేట శ్వేతార్క గణపతి క్షేత్ర గాలిగోపురం నిర్మాణ పనులు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి దివ్య క్షేత్ర *రాజ గోపుర* నిర్మాణం పనులు ప్రారంభమైనాయి…దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ గారు భూమి పూజాది కార్యక్రమాలు చేసి ఇటుకలు పరిచి ఆరంభించారు….. ఈ కార్యక్రమంలో భాగంగా కాజీపేట పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త మరియు అయ్యప్ప దీక్ష గురుస్వామి సిరిపురం వెంకటయ్య గారు మరియు దేవాలయ మేనేజర్ ఎల్.రవి , స్థాపతి ప్రభాకర్, మరియు శివకుమార్, జక్కుల రవీందర్, సుధీరకుమార్, శ్రీనివాస్, స్వప్న, మణిదీప్, హరిస్వామి, మరియు కాజీపేట పుర ప్రముఖులు పాల్గొన్నారు… స్థాపతి బృందం వారికి శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వారిని వేద ఆశీర్వచనాలు చైర్మన్ గారి చేతులమీదుగా జరిగింది….#శ్వేతార్క #తెలంగాణ #swetharka #telangana #gopuram #gopuramcontrusction #swetharkapoojas #telanganaswetharka #telanganaganapathi #తెలంగాణగణపతినేత్రపర్వంగా శ్వేతార్క గణపతికి వసంతోత్సవాభిషేకం …..

 తెలంగాణ గణపతిగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ఏకైక స్వయంభు గణపతిదేవాలయ క్షేత్రమై శివ కేశవుల నిలయంగా ఉండి 29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ దేవాలయ క్షేత్రంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజిపేట విష్ణుపురిలో వెలసిన స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవలయముల క్షేత్రంలో 24 జనవరి 2019 నాటి రోజున  ఉదయం నుండి శ్రీస్వామివారిని దర్శించుకొనుటకు భక్తులు వివిధ జిల్లాల్లో నుండి విచ్చేసారు.

నిత్య పూజలతో పాటుగా సంకష్టహర చవితి పూజలు వైభవోపేతంగా జరిగాయి.. ఉదయం 5.30 ని౹౹ల నుండి పంచామృత,పంచవర్ణ, గోక్షిరాభిషేక సేవలు, ఉ.10 గం౹౹ల నుండి నిత్యా సహస్రమోదక రుద్ర పంచ సూక్త నవగ్రహ హోమములు మధ్యాహ్నం 12 గం౹౹లకు శ్రీస్వామివారికి ప్రీతిగా సంగీత,గాత్ర సహిత సహస్రనామార్చన సేవలు జరిగాయి. తిరిగి సా.5గం౹౹లకు దూర్వా, లాజ హోమము, సాయంత్రం 6.10ని౹౹ల నుండి శ్వేతార్క గణపతి స్వామివారికి *216 కిలోల గులలు రంగుతో స్వామివారికి వసంతోత్సవాభిషేకం* జరుపబడింది. ఈ నాటి పూజకు భద్రాచలం,బెంగళూర్,కడప నుండి మరియు వివిధ రాష్ట్రాల నుంచి భారిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు తమ మహత్భాగ్యంగా  శ్రీస్వామివారి వసంతోత్సవాభిషేక దర్శనమును చేసుకొని మధురానుభూతిని పొందినారు…తదుపరి భక్తులకు శ్వేతార్కగణపతిస్వామివారికి జరిపిన  అభిషేక ఫలితాల విశేషాలను భక్తులకు తెలియజేసి హారతి,తీర్థప్రసాదాలు అందచేయబడింది. మరియు దేవాలయంలోని అన్నపూర్ణ కేంద్రంలో మహా అన్నదానం జరుపడమైనది… ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ పర్యవేక్షణలో, దేవాలయ వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ వేద మంత్రోర్చణలతో, ఆనంద్ త్రిపాఠీ, నరేష్ మిశ్రా, హరికృష్ణ స్వామి అర్చకుల సహాయంతో, ఎల్.రవి , సుధీర్, శ్రీనివాస్, స్వప్న, కవిత, మణి, అమర్, హరీష్, రాము, చందు, మహిపాల్  సేవకులు భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా సేవనందించారు…

భోజనంలో రకాలు

మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.
*సత్వగుణ ప్రధానుల భోజనం*


ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||
ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.
*రజోగుణ ప్రధానుల భోజనం*
కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |

ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||
ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.
*తమోగుణ ప్రధానుల భోజనం*
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |

ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||
ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.
ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.
ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు “తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు” అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. “నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి” అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.
భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి. అవి చెప్పిన నియమాల ప్రకారం తల మీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని పాగా చుట్టుకుని భుజిచకూడదు. భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు. తోలు మీద కూర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతికి ధరించి కానీ భుజించకూడదు. 
అన్నంతోపాటు పూరీ, రొట్టెల్లాంటివి కలుపుకుని తినకూడదు. పగిలిన పళ్లేల్లో భుజించకూడదు. కలసి భోజనం చేయాల్సిన సందర్భాల్లో వారు తన కోసం నిరీక్షించేలా చేయకూడదు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు ముందస్తుగానే ముగించి ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు. బజారులో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు. పడవలో భుజించరాదని ‘ఆపస్తంబ’ మహర్షి రాశారు. మంచం మీద కూర్చుని తినరాదని చెప్పింది ‘యమస్మృతి’. అలాగే చాపమీద కూర్చుని కూడా భుజించకూడదు. అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్లన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని ‘బ్రహ్మపురాణం’ పేర్కొంది. 
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి బయటకు తీసి తిరిగి తినరాదు. ఆవు నెయ్యితో తడపకుండా ఆహారాన్ని తినకూడదు. విక్రయాన్నం తినకూడదని ‘శంఖలిఖితస్మృతి’ శాసించింది. మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది. ప్రశాంతచిత్తంతో భుజించాలి. భుజించేటప్పుడు కామక్రోధాదులు, హింసావైరాల వంటి వాటికి మనసులో చోటుండకూడదు. భుజించేటప్పుడు మాట్లాడకూడదు. అయితే, ముద్దముద్దకూ ‘భగవన్నామం’ చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు. వండిన అన్నం నుంచి ఒక ముద్ద తీసి, నేయి వేసి, ‘యజ్ఞేశ్వార్పణం’ అంటూ మండే పొయ్యిలో వేయాలనే నియమముంది. భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి. దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి. అలాగే కుక్కలకు కూడా న్నం పెట్టాలి. మొదటగా ప్రాణులకు పెట్టే భుజించాలి. అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి. సన్యాసులకూ, సాధువులకూ ఆహారమివ్వాలి. పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథలకు, దీనులకు భోజనం పెట్టాలి. ఆకలే అర్హత. ఆకలిగొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్థు ధర్మం.