కార్తీక మాసశివరాత్రి పురస్కరించుకుని సంతాన నాగలింగేశ్వర స్వామివారికి అన్నాభిషేకం మరియు సుగంధ ద్రవ్య కలశాభిషేకం

శివకేశవుల పవిత్రమాసమైన కార్తీకమాసంలో మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు 29 దేవతామూర్తులతో శివ కేశవుల నిలయంగా కాజీపేట తెలంగాణ గణపతిగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లా కాజీపేటలోని సుప్రసిద్ధ క్షేత్రమైన స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దివ్యక్షేత్రంలో కొలువుదీరిన సంతాన ప్రదాత శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి సకల కార్య సిద్దికి, ఐహిక వాంఛల సిద్ధి కొరకు, సర్వ గ్రహ దోష నివారణకై,  ప్రత్యేక  సుగంధ ద్రవ్యములతో కలశాభిషేకం మరియు అన్నాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకములు తదుపరి 10 గంటల నుండి రుద్ర నమక చమక పంచసూక్తాలు మరియు పాశుపత హోమములు విశేషంగా జరిగినాయి. ఇందులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రులైన వారు. మాస శివరాత్రి  పురస్కరించుకొని సాయంత్రం 7 గంటల నుండి రుద్రక్రమర్చన,కార్తీక పురాణమ్, దీప సమారాధన , సహస్రదీపాలంకరణ సేవ మరియు ధాత్రి నారాయణ పూజలు , శివ భజనలు విశేషించి జరిగాయి.