ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే

ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది. 

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో  తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.

మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. 
“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.
 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు. 

“మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది.

అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. 

చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది.

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు. 
ఊరి పొలిమేర దాటాడో లేదో… ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప. 
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
“ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి,  ధర్మ హీనులను ధ్వంసంచేశాను.” అన్నాడు కలిపురుషుడు…
…ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే…
ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రక్షాసానందం పొందుతారు..కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది..
II ధర్మో రక్షతి రక్షితః II

యజ్ఞాలు చెయ్యడం వెనుక scientific reasons కూడా ఉన్నాయి అండీ..

#యజ్ఞంఎందుకుచేస్తారు?
మనందరికీ యజ్ఞం అనే పదం బాగా తెలిసిందే. దేవాలయాల్లో, కొత్త ఇళ్ళలో, ఇంకా చాలా సందర్భాలలో యజ్ఞాలు చేస్తుంటారు. అయితే ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారో? వాటి వల్ల ఫలితాలేంటొ తెలుసుకుందాం.

వేదకాలం నాటి నుండి ఉన్న మన ఆచార వ్యవహారాలెన్నో నేడు అంతర్థానమైపోయాయి. మరికొన్నిఅయితే పూర్తి వ్యతిరేక స్థాయిలో అమల్లోకి వచ్చాయి. కొన్ని రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకున్నాయి. అలాంటి వాటిలో యజ్ఞయాగాదులను ముఖ్యమని చెప్ప వచ్చు. ఈరోజుల్లో అధికారం కోసం, దాన్ని నిలబెట్టుకోవడానికే యజ్ఞాలను చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది మరి.

యజ్ఞం లేదా యాగం అనేది ఒక విశిష్టమైన మన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం ముఖ్య లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవన్ని అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి వాటిని వేస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చు. ‘‘ యజ్ఞం ’’ అను శబ్దం ‘‘ యజ దేవపూజయాం’’ అనుదాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. ’’యజయే ఇతి యజ్ఞ: యజ:’’ ఎన్నో యజ్ఞ యాగదులచేత యోగ దాయకుడైన పరమేశ్శరుని యోగీశ్యరత్వానికి ’య’ కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వలన స్వార్దం నశింస్తుందని గాఢ విశ్వాసం ఉంది.

యజ్ఞాలు ల లో మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు

వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అంటే యజ్ఞము విష్ణు స్వరూపం అని అర్ధం.

.

చాలామంది హోమం, అగ్నిహోత్రాల్లో ఆజ్యం (నునె లేదా నెయ్యి) పోయడం దండగని, మిగతా వస్తువులన్నీ వేయడం వృధా అని, చాదస్తం అని కొట్టి పడేసేవారున్నారు, దీనివల్ల ఒరిగేదేమీ లేకపోగా ఎంతో డబ్బు నష్టమని కొందరు వాదిస్తూ ఉంటారు. ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్వార్థం కోసమే కాదు కదా! కొన్నిటిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఆయా వస్తువులు, పదార్ధాలను వృధా చేసినట్లనుకుంటే పొరపాటే మరి. ఆయా పదార్ధాలను కచితంగా సార్ధకం అవుతుంది. ఇలా అగ్నిదేవునికి ఆహుతి చేయడంవల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది అనేది మనకు అనాదిగా వస్తున్నా నమ్మకం.

ఈ యజ్ఞాలు చెయ్యడం వెనుక scientific reasons కూడా ఉన్నాయి అండీ.. యజ్ఞం చేసేపుడు అగ్ని హోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక వృక్షాల కట్టెలు వంటి వాటిని వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వెయ్యడం వచ్చే ధూమంవల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి కూడా. స్వచ్చమైన గాలి అందుతుంది. మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదండీ ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమౌతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెప్తారు. మరి యజ్ఞాల వల్ల లాభాలు తెలుసుకునారుగా! ఇక నుండి మీ చుట్టూ పక్కల ఎక్కడ యజ్ఞం జరిగిన కొంత సమయాన్ని కేటాయించి వెళ్ళిరండి. అందువల్ల జరిగే మంచిని పొందండి.
⚛️⚛️⚛️సర్వంశివసంకల్పం⚛️⚛️⚛️

ఎంత ధనాన్ని సంపాదించమని కాదు..

ఎంత ధనాన్ని సంపాదించామని కాదు.

సంపాదించింది ఎలా పొదుపుగా వాడుకొంటున్నామనేది కూడా ముఖ్యమే..సమయస్ఫూర్తి తో అవసరాన్ని బట్టి ఆలోచించి చేసే ఖర్చులోని మిగులు కూడా.. ఒక ఆదాయమే అవుతుంది.

*అనంతవచనం*

సూర్యోదయ సమయాన తిథి ఉన్నరోజునే పండుగ జరుపుకోవాలా?

Bhattacharya:

ప్ర: మనం ప్రతిరోజూ చేసే పూజలలో సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని సంకల్పంలో చెప్పుకునే పద్దతి ఉంది. ఇదే పద్ధతిని ఆయా తిథుల్లో వచ్చే పండుగలకు అనుసరిస్తారా? అంటే సూర్యోదయ సమయాన తిథి ఉన్నరోజునే పండుగ జరుపుకోవాలా?
జ: సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని నిత్యం సంకల్పంలో చెప్పుకోవాలి. అందులో సందేహం లేదు. పండుగలలో కూడా అలాగే చెప్పుకునా, కొన్ని పండుగలకు మాత్రం విభిన్న కాలాలు వర్తిస్తాయి. ఉదాహరణకు – మధ్యాహ్నం శుక్ల చవితి (భాద్రపదమాసంలో) ఉన్న రోజునే వినాయక చవితి జరుపుకుంటాం. చంద్రోదయంతో కృష్ణ చవితి ఉన్న రోజున సంకష్టహర చతుర్థి చేస్తాం. మధ్యాహ్న వ్యాపిని ఆయనే చైత్రశుద్ధనవమి శ్రీరామనవమిగానూ, రాత్రి అష్టమి ఉన్న రోజున కృష్ణాష్టమిని, అమావాస్య రాత్రి ఉన్న రోజున దీపావళిని, అర్థరాత్రి చతుర్దశి ఉన్న రోజున శివరాత్రిని, ఇలా నిర్వహిస్తాం. వాటికి సంబంధించిన రోజున ఆ పర్వాన్ని పేర్కొని అర్చనాదులు చేయాలి.—–సామవేదం