నేటి అనంతవచనం

ముప్పై మంది కలిసి కలిపేది వివాహబంధం,
మూడోవ్యక్తి కలిసి కలిపేది స్నేహ బంధం
ఒకరికొకరు కలిసి కలుపుకొనేది విడరాని జీవిత బంధం
*అనంతవచనం*

ఘానంగ ముగిసిన దేవి నవరాత్రోత్సవ పూజలు 

swe
 స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయములో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకు సమస్త దేవతా మూర్తులకు స్నపన విధిని నిర్వహించి శ్వేతార్క గణపతికి పంచామృతములతో అభిషేకము జరపబడినది. తదుపరి అలంకారం అర్చన హారతి తీర్థప్రసాద వితరణ జరుపబడినది. ఈ సందర్భంగా తొమ్మిది మంది బ్రాహ్మణ ముత్తయిదువులకు సువాసినీ పూజలు జరుప బడినవి . అనంతరము రుద్ర హోమము నిత్య గణపతి హోమము చివరన పూర్ణాహుతి జరుపబడినది. కాల రాత్రి సమయంలో జరుపబడిన చండీహోమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో దేవాలయ సంప్రోక్షణ పూజ జరుపబడినది. అనంతరం చండీహోమ బలిహరణం ఇత్యాది పూజల తదుపరి కలుష ఉద్వాసన జరుపబడినది. బ్రహ్మశ్రీ ఎల్లం బట్ల క్రాంతి శర్మ ఆధ్వర్యములో సంపూర్ణ దేవీ పూజను నిర్వహించారు. బ్రహ్మశ్రీ అయినవోలు వెంకటేశ్వర శర్మ పుష్పలత దంపతులు భక్తులను ఆశీర్వదించినారు . ఈరోజు భక్తులు దేవాలయము నందు జరిగి పూజలయందు అధిక సంఖ్యలో పాల్గొని పూజలను నిర్వహించారు. భక్తులు వాహన పూజలకు బారులుతీరారు సాయంత్రం ఏడు గంటలకు అయినవోలు రాధాకృష్ణ సాయి కృష్ణ ఆధ్వర్యంలో శమీ పూజ నిర్వహింపబడినది . ఈరోజు దేవాలయ ప్రచార రథం హనుమకొండ పద్మాక్షి దేవాలయానికి తీసుకు వెళ్లడం జరిగింది. రాత్రి పూజలో భక్తులు ఒకరినొకరు శమీ పత్రములతో ఆలింగనము చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ మేనేజర్ యల్.రవి, సుధీర్,మణిదీప్,స్వప్న తదితరులు పాల్గొన్నారు . రథయాత్రలో శ్రీనివాస్ సాయి తేజ పాల్గొన్నారు.ఈ రోజు పూజలకు స్థానిక కార్పొరేటర్ రమారవిందర్,టాస్క్ఫోర్స్ ఆఫీసర్ యల్.రమేషకుమార్ పాల్గొన్నారు. వీరిని దేవాలయ ఆచార ప్రకారంగా శాలువాతో సత్కరించి ఆశీర్వచనం చేయబడింది.

అనంత మల్లయ్య సిద్ధాంతి

అనంత వచనమునకు ఆటవెలది రూపము

ప్రేమ గొనుట తిరిగి ప్రేమించుటనునది

తప్పు కాదెపుడును తరచి జూడ

మనువు ముందు ప్రేమ గన,కల్ల గావచ్చు

పెండ్లి పిదప ప్రేమ వెలుగు నిజము
మూలం:-శ్రీ అనంతమల్లయ్య గారు

పద్యరూపం:-శేషకుమా‌ర్🙏🙏

నేటి అనంతవచనం

ప్రేమించండి…

ప్రేమించుకొనండి…

కానీ,

పెళ్ళి ముందు కంటే ..పెళ్ళయ్యాక ప్రేమించుకొంటే

సంసారాల బండిచక్రం బాగా నడుస్తుంది. 

పెళ్లికి ముందుండే ప్రేమ అబద్ధం కావొచ్చు.

 పెళ్లి తర్వాత పడే ప్రేమ ఎప్పుడూ నిజంగానే ఉంటుంది.

*అనంతవచనం*

శ్వేతార్కగణపతి దేవాలయంలో శ్రీ షిరిడి సాయిబాబాకు జరిపిన ప్రత్యేక పూజలు

 స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో దసరా పండుగ రోజున ప్రత్యేక సాయిబాబా పూజలు జరుపబడినవి. శ్రీ షిరిడి సాయిబాబా  సమాధి చెంది ఈ దసరా పండుగకు 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా శతాబ్ది సమాధి పూజలు జరుపబడినవి. ఉదయం ఏడు గంటలకు పాలాభిషేకము మరియు 11గంటలకు కోవా పదార్థ నివేదన. 12 గంటలకు అన్నదానము సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక అర్చన హారతి తీర్థప్రసాద వితరణ చేయబడినది. రాత్రి ఎనిమిది గంటలకు దేవాలయ భజన బృందం వారిచే భజన జరుపబడినది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . సాయిబాబా సమాధి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని విశేష అన్నదానమును జరుపబడింది.
 ఇట్లు 

ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి

అనంతవచనం

కష్టకాలంలో భగవంతున్ని దూషిస్తున్నావంటే..ఇష్టకాలంలో దేవుడున్నాడనే కదా దాని అర్థం. 

మంచి చెడుల మాయయే ఈ జీవితం

*అనంత వచనం*

అనంత వచనమునకు ఆటవెలది రూపము

“తిట్టు చుందు వనగ దేవుని యిక్కట్ల
హాయి వేళ నుండి నటులె యతడు

మంచి చెడులు కూడు మాయయే బ్రతుకురా

గుఱుతు పెట్టు కొనుము మరువ వలదు”
మూలం:-శ్రీ అనంతమల్లయ్య గారు

పద్యరూపం:-శేషకుమా‌ర్🙏🙏

అనంతవచనం

కష్టకాలంలో భగవంతున్ని దూషిస్తున్నావంటే..ఇష్టకాలంలో దేవుడున్నాడనే కదా దాని అర్థం. 

మంచి చెడుల మాయయే ఈ జీవితం

*అనంత వచనం*

అనంతవచనం

కష్టకాలంలో భగవంతున్ని దూషిస్తున్నావంటే..ఇష్టకాలంలో దేవుడున్నాడనే కదా దాని అర్థం. 

మంచి చెడుల మాయయే ఈ జీవితం

*అనంత వచనం*

నేటి అనంతవచనం

వయస్సులో ఉన్నప్పుడే నిరంతర శ్రమ చేస్తూ డబ్బు,పేరును బాగా సంపాదించాలి. వయస్సు దాటుతున్నప్పుడు దానాలు,ధర్మాలు,తీర్థ యాత్రలు చేయాలి. వయస్సు మీరిందని అనుకున్నప్పుడు దేవాలయాలలో సేవ చేయాలి. కానీ ఎప్పుడైనా సరే వీలును బట్టి పైవన్ని చేస్తూ.. మాతాపితృ భక్తిని,గురుభక్తిని, దైవభక్తిని,దేశభక్తి ని తప్పక కలిగి ఉండాలి.

*అనంతవచనం*